ETV Bharat / entertainment

'స్వాగ్​' క్వీన్ ఎంట్రీ - మీరా జాస్మిన్ లుక్ అదుర్స్ - Meera Jasmine Swag Movie - MEERA JASMINE SWAG MOVIE

Meera Jasmine Swag Movie : 'విమానం' సినిమాతో టాలీవుడ్​లోకి రీ ఎంట్రీ ఇచ్చిన స్టార్ హీరోయిన్ మీరా జాస్మిన్ మరోసారి తెలుగు అభిమానులను అలరించనుంది. ఆ విశేషాలు మీ కోసం.

Meera Jasmine Swag Movie
Meera Jasmine Swag Movie (ETV Bharat Archives)
author img

By ETV Bharat Telugu Team

Published : Jun 2, 2024, 12:13 PM IST

Meera Jasmine Swag Movie : మల్లు బ్యూటీ మీరా జాస్మిన్​కు టాలీవుడ్​లో ఎంత క్రేజ్​ ఉందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. హీరోయిన్​గా ప్రేక్షకులను మెప్పించిన ఈ నటి సపోర్టింగ్​ రోల్స్​లోనూ తనదైన శైలిలో నటించి ఆకట్టుకుంది. అయితే 2013 తర్వాత ఆమె క్రమక్రమంగా తెలుగు ఇండస్ట్రీకి దూరమైంది. కానీ తమిళ, మలయాళ సినిమాల్లో యాక్టివ్​గా ఉంటూ పలు హిట్స్​ను తన ఖాతాలో వేసుకుంది.

ఇదిలా ఉండగా, 'విమానం' సినిమాతో టాలీవుడ్​లోకి రీఎంట్రీ ఇచ్చి అభిమానులకు సడెన్ సర్​ప్రైజ్ ఇచ్చింది. చేసింది గెస్ట్ రోలే అయినా కూడా తన నటనతో మంచి మార్కులు సంపాదించింది. ఆ తర్వాత తెలుగులో మరే సినిమాకు గ్రీన్​ సిగ్నల్ ఇవ్వలేదు. అయితే ప్రముఖ నిర్మాణ సంస్థ పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ తాజాగా మీరా జాస్మిన్ అభిమానులకు ఓ స్వీట్ సర్​ప్రైజ్ ఇచ్చింది.

ఇటీవలే ఆ సంస్థ శ్రీ విష్ణు హీరోగా 'స్వాగ్' అనే ఎంటర్​టైనింగ్ మూవీని రూపొందిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ మూవీ నుంచి వచ్చిన టైటిల్ గ్లింప్స్​తో పాటు హీరో, హీరోయిన్ ఇంట్రో కూడా మూవీ లవర్స్​ను తెగ ఆకట్టుకుంది. ఇందులో భాగంగానే నేడు (జూన్ 2) మీరా జాస్మిన్ రోల్​ను కన్ఫార్మ్​ చేస్తూ ఓ స్పెషల్ పోస్టర్​ను విడుదల చేసింది. "#SWAG ప్రపంచం మన హృదయాలను ఏలిన రాణిని మీ ముందుకు తీసుకువస్తోంది. #మీరా జాస్మిన్​ ఆన్​ బోర్డ్​." అంటూ ఆమెకు వెల్​కమ్ చెప్పింది. అందులో ఆమె మహారాణి లుక్​లో కనిపించి అదరగొట్టింది. ప్రస్తుతం ఆ ఫొటో నెట్టింట తెగ ట్రెండ్ అవుతోంది.

ఇక మీరా 'స్వాగ్​' సినిమాతో పాటు 'ది టెస్ట్'​ అనే తమిళ సినిమాలోనూ నటిస్తోంది. స్పోర్ట్స్​ డ్రామాగా తెరకెక్కుతోన్న ఈ చిత్రంలో త్రిష, నయన్​తార, సిద్ధార్థ్​, ఆర్ మాధవన్ తదితరులు కీలక పాత్ర పోషిస్తున్నారు. ప్రస్తుతం ఈ చిత్రం రిలీజ్​కు సిద్ధంగా ఉంది. తమిళంతో పాటు తెలుగు, హిందీ, కన్నడ, మలయాళం ఇలా పలు భాషల్లో దీన్ని విడుదల చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు.

బాలయ్య బాబుకే నో చెప్పిన హీరోయిన్​! - ఆమెకు అంత డేర్ ఉందా?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.