Mathu Vadalara Who Is Riya : 'రియా' ప్రస్తుతం సోషల్ మీడియాలో ఎక్కువగా వినిపిస్తున్న పేరు. 'రియా ఎక్కడ?' అనే హ్యాష్‌ట్యాగ్ ప్రస్తుతం తెగ ట్రెండ్ అవుతోంది. చాలా మంది నెటిజన్లు రియా ఎక్కడ? అనే హ్యాష్‌ట్యాగ్‌తో రీల్స్ చేసి పోస్ట్ చేస్తున్నారు. అయితే అది రీసెంట్ బ్లాక్‌బస్టర్ 'మత్తు వదలర 2' సినిమాలోని ఓ పాత్ర పేరు. సినిమాలో ఓ సన్నివేశంలో ఈ రెండు పాత్రల మధ్యలోని ఈ డైలాగ్ తాజాగా సోషల్ మీడియా ద్వారా మరింత మంది ప్రేక్షకులకు రీచ్ అవుతోంది.
ఈ సినిమాలో చాలా కామెడీ సీన్లు ఉన్నాయి. అన్నింటికీ మించి మూవీలో సత్య, అజయ్ మధ్య జరిగే ఓ సన్నివేశం ప్రస్తుతం ట్రెండ్ అవుతోంది. ఇందులో రియా అనే అమ్మాయి కోసం సత్య, అజయ్‌ని ప్రశ్నిస్తాడు.ఇందులో సత్య ప్రశ్నలు, అందుకు అజయ్ చెప్పే సమాధానాలు కడుపుబ్బా నవ్విస్తాయి. ఈ సీన్ ఆధారంగా చాలా మంది రియా ఎక్కడ? అనే ట్యాగ్‌తో రీల్స్ చేసి పోస్ట్ చేస్తున్నారు.
Riya ekkada? 🤣🤣 pic.twitter.com/fOaa4JLHAQ
— Deputy CM Thammudu 😎 (@tweetsof_mani) October 17, 2024
స్పందిచిన నటి
అయితే ఈ సోషల్ మీడియా మీమ్స్‌కు సినిమాలో రియా పాత్ర పోషించిన నటి ఈషా యాదవ్ స్పందించింది. ఆమె కూడా ఈ మీమ్స్‌ను ఫుల్ ఎంజాయ్ చేస్తోంది. 'రియా ఇదిగో' అంటూ సినిమాలోని ఓ ఫొటోను తన ఇన్స్టాగ్రామ్ అకౌంట్లో షేర్ చేసింది.
ట్రైలర్‌తోనే అంచనాలు
ట్రైలర్‌తోనే ఈ సినిమా అందరి దృష్టిని ఆకర్షించింది. డైరెక్టర్ రితేశ్ రానా ఈ విషయంలో తెలివిగా వ్యవహరించి సక్సెస్ అయ్యాడు. సోషల్ మీడియా పాపులర్ మీమ్స్, వాటి రిఫరెన్స్‌లు టీజర్, ట్రైలర్‌లో చూపించి హైప్ క్రియేట్ చేశాడు. ట్రైలర్‌లోని కామెడీ సీన్లు ప్రేక్షకులను ఎక్కువగా ఆకర్షించాయి.
సెప్టెంబర్ 13న థియేటర్లలో రిలీజైన ఈ సినిమా మంచి విజయం సాధించింది. గతవారం ఈ సినిమా ఓటీటీలోకి ఎంట్రీ ఇచ్చింది. థియేటర్లలో మాదిరిగానే ఓటీటీలోనూ ఈ సినిమాకు మంచి రెస్పాన్స్ వస్తోంది. సత్య కామెడీ, హీరో శ్రీసింహా పెర్ఫార్మెన్స్‌కి ప్రేక్షకులు ఫిదా అవుతున్నారు. ఎక్కువ మందికి ఈ సినిమాకి కనెక్ట్ కావడం వల్ల మీమ్స్ పుట్టుకొచ్చాయి. ఇప్పుడు సోషల్ మీడియాలో అందూ రియా ఎక్కడ? అని ట్రెండ్ చేస్తున్నారు. దీనికి నెటిజన్ల సమాధానాలు ఇంకా ఫన్నీగా ఉంటున్నాయి. కాగా, ఈ సినిమాలో శ్రీసింహ, సత్యతోపాటు ఫరియా అబ్దుల్లా, వెన్నెల కిషోర్ కీలక పాత్ర పోషించారు.
OTTలోకి 'మత్తు వదలరా 2' - స్ట్రీమింగ్ ఎక్కడంటే?
'మత్తు వదలరా 2' బాక్సాఫీస్ జాతర - ఫస్ట్ వీకెండ్లోనే లాభాల్లోకి! - Mathu Vadalara 2 Collections