ETV Bharat / entertainment

'ఆ మూడు రోజులు నీళ్లు మాత్రమే తాగి' - మత్తు వదలరా 2 సత్య గురించి ఆసక్తికర విషయాలు - Mathu Vadalara 2 Comedian Satya

author img

By ETV Bharat Telugu Team

Published : Sep 16, 2024, 4:45 PM IST

Mathu Vadalara 2 Comedian Satya : ఈ వారం బాక్సాఫీస్ దగ్గర బాగా వినిపిస్తున్న పేరు 'మత్తు వదలరా 2'. ఇందుకు కారణం ఒకరకంగా కమెడియన్ సత్య అనే చెప్పాలి. ప్రస్తుతం ఈ 'మత్తు వదలరా' సీక్వెల్‌తో ఆయన సోషల్‌ మీడియా సెన్సేషన్‌గా మారారు. ఎక్కడ చూసినా సత్య కామెడీ క్లిప్పులే తెగ కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో సత్య అసలు ఇండస్ట్రీలోకి ఎలా వచ్చారు? కెరీర్​ పరంగా ఏలాంటి ఇబ్బందులు ఎదుర్కొన్నారు? అసలు ఆయనలోని నటుడిని మొదటగా గుర్తించింది ఎవరు? సహా పలు విషయాలను తెలుసుకుందాం.

source ETV Bharat
Mathu Vadalara 2 Comedian Satya (source ETV Bharat)

Mathu Vadalara 2 Comedian Satya : ఈ వారం బాక్సాఫీస్ దగ్గర బాగా వినిపిస్తున్న పేరు 'మత్తు వదలరా 2'. ఇందుకు కారణం ఒకరకంగా కమెడియన్ సత్య అనే చెప్పాలి. ఈ మధ్య కాలంలో పర్ఫెక్ట్‌ కామెడీ టైమింగ్‌తో కడుపుబ్బా నవ్విస్తున్న కమెడియన్లలో ఆయన ముందు వరుసలో ఉంటారు. ప్రస్తుతం 'మత్తు వదలరా' సీక్వెల్‌తో ఆయన సోషల్‌ మీడియా సెన్సేషన్‌గా మారారు. ఎక్కడ చూసినా సత్య కామెడీ క్లిప్పులే తెగ కనిపిస్తున్నాయి. ఎందుకంటే ఈ సినిమా ఫస్ట్ హాఫ్ మొత్తం పగలబడి నవ్వించేలా ఆయన పేల్చిన లైనర్స్, కామెడీ టైమింగ్, బాడీ లాంగ్వేజ్ ఒకదాన్ని మించి మరొకటి తెగ చక్కిలిగింతలు పెట్టిస్తున్నాయని సినీ ప్రియులు అంటున్నారు.

Comedian Satya Background : ఈ నేపథ్యంలో సత్య అసలు ఇండస్ట్రీలోకి ఎలా వచ్చారు? కెరీర్​ పరంగా ఏలాంటి ఇబ్బందులు ఎదుర్కొన్నారు? అసలు ఆయనలోని నటుడిని మొదటగా గుర్తించింది ఎవరు? సహా పలు విషయాలను తెలుసుకుందాం. వీటికి సమాధానాలను సత్యనే స్వయంగా గతంలో ఓ సందర్భంలో సమాధానం ఇచ్చారు.

అద్దాలు తుడిచా - దర్శకులు కె.విశ్వనాథ్‌, శంకర్‌, సుకుమార్‌ అంటే తనకు స్ఫూర్తి అని చెప్పారు సత్య. వాళ్ల సినిమాల్నే ఎక్కువగా చూసేవారట. దీంతో అప్పుడే తాను కూడా దర్శకుడు కావాలని అనుకున్నారట. అలా ఆ సమయంలో ఇంజినీరింగ్‌ మధ్యలోనే మానేసి హైదరాబాద్‌కు వచ్చిన సత్య కొంత కాలం కష్టపడినట్లు చెప్పుకొచ్చారు సత్య.

" మా నాన్న రూ.10 వేలు చేతిలో పెట్టి వెళ్లిపో అన్నారు. అయితే నా దగ్గర డబ్బులు తగ్గుతున్న కొద్ది కంగారు పడ్డాను. అప్పటికీ నాంపల్లిలో ఒక హాస్పిటల్​ దగ్గర అద్దాలు తుడిచే పనికి ఒప్పుకున్నాను. రోజుకి రూ.200 ఇచ్చేవారు. అయితే నాలుగు రోజులు ఆ పని చేసుంటాను." అని చెప్పుకొచ్చారు సత్య.

మూడు రోజులు మంచినీళ్లు తాగే! - "ఓ సారి రజనీ కాంత్‌ 'శివాజీ' సినిమా ట్రైలర్‌ చూపిస్తున్నారని తెలిసి ఆర్టీసీ క్రాస్‌రోడ్స్‌లో 'భూ కైలాస్‌' సినిమాకు వెళ్లాను. అక్కడ ఇద్దరు జూనియర్‌ ఆర్టిస్టులు పరిచయం అయ్యారు. వారు రూ.500 తీసుకొని షూటింగ్​ జరుగుతున్న చోటుకు పంపించారు. అక్కడే జూనియర్‌ ఆర్టిస్టుల మధ్య కూర్చుని షూటింగ్​ను చూశాను. అక్కడే మరి కొంతమంది పరిచయం అయ్యారు. వారితో 'నవ వసంతం', 'యమదొంగ' సినిమాల షూటింగ్​లకు వెళ్లాను. అయితే జూనియర్‌ ఆర్టిస్టుల్లోనే ఒకరు నా దగ్గరున్న డబ్బును తీసుకుని వెళ్లిపోయాడు. దీంతో మూడు రోజులు పాటు మంచినీళ్లు తాగి మాత్రమే పడుకున్నాను.

ఆ తర్వాత మా ఇంట్లో విషయం తెలిసి మా నాన్న నన్ను తీసుకెళ్లి పోయారు. ఆ తర్వాత మా నాన్న ఫ్రెండ్​ చంటిగారి బంధువు నల్లశ్రీను దర్శకుడు రాజమౌళి దగ్గర మేకప్‌మెన్‌గా పనిచేస్తున్నారని తెలిసింది. దీంతో నన్ను ఆయన దగ్గరకు పంపించారు. ఆయనే నాకు 'ద్రోణ' సినిమాకు డైరెక్టర్ విభాగంలో పని చేసే అవకాశాన్ని ఇప్పించారు" అని సత్య గతంలో ఓ సందర్భంలో చెప్పుకొచ్చారు.

నటుడిని గుర్తించింది ఆయనే - తనలో నటుడిని గుర్తించింది హీరో నితిన్‌, రచయిత హర్షవర్ధన్‌, నిర్మాత డీఎస్‌ రావు అని ఓ సారి చెప్పారు సత్య. "మొదట్లో నేను అసిస్టెంట్‌ డైరెక్టర్‌గా వర్క్​ చేసేవాడిని. అప్పుడు నాకు ఎవరితో ఎలా మాట్లాడాలో పెద్దగా తెలీదు. అందరితోనూ ఒకేలా మాట్లాడేవాడిని. షూటింగ్ సమయంలోనూ అమలాపురం యాసలోనే మాట్లాడేవాడిని. నా మాటలు వినిన హీరో నితిన్‌ నువ్వు యాక్టర్‌ అవ్వు, బాగుంటుంది అని సలహా ఇచ్చారు. ఆ తర్వాత నెమ్మదిగా నటుడిగా మారాను" అని సత్య చెప్పుకొచ్చాడు.

కాగా, సత్య కెరీర్​లో పిల్ల జమిందార్, గబ్బర్ సింగ్, కెమెరామెన్ గంగతో రాంబాబు, స్వామి రారా, వెంకటాద్రి ఎక్స్ప్రెస్, కార్తికేయ లాంటి సినిమాలు బాగా వర్కౌట్ అయ్యాయి. ఆ తర్వాత రౌడీ ఫెలో, మత్తు వదలరా, వివాహ భోజనంబు ఇలా పలు సినిమాలు కూడా ఆయనకు పేరు తెచ్చిపెట్టాయి. ఇకపోతే రీసెంట్​గానూ డిజాస్టర్​గా నిలిచిన మిస్టర్ బచ్చన్, రంగబలి, హనుమాన్ ఇలా పలు చిత్రాల్లోనూ ఆయన కామెడీ టైమింగ్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది.

'మత్తు వదలరా 2' బాక్సాఫీస్​ జాతర - ఫస్ట్ వీకెండ్​లోనే లాభాల్లోకి! - Mathu Vadalara 2 Collections

'మత్తు వదలరా 2' రివ్యూ - ఈ క్రైమ్, కామెడీ OTTలోకి ఎప్పుడంటే? - Mathu Vadalara 2 Review

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.