ETV Bharat / entertainment

ఓటీటీలోకి వచ్చేసిన అవార్డ్‌ విన్నింగ్‌ మూవీ - స్ట్రీమింగ్‌ ఎక్కడంటే?

Manoj Bajpayee Joram : ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్స్​లో పలు అవార్డులు గెలుచుకున్న సూపర్ థ్రిల్లర్ మూవీ ఎట్టకేలకు ఓటీటీలోకి వచ్చేసింది. ఈ మూవీ కోసం ప్రేక్షకులు ఎంతగనో ఎదురుచూస్తున్నారు. ఎందులో చూడాలంటే?

ఓటీటీలోకి వచ్చేసిన అవార్డ్‌ విన్నింగ్‌ మూవీ - స్ట్రీమింగ్‌ ఎక్కడంటే?
ఓటీటీలోకి వచ్చేసిన అవార్డ్‌ విన్నింగ్‌ మూవీ - స్ట్రీమింగ్‌ ఎక్కడంటే?
author img

By ETV Bharat Telugu Team

Published : Feb 3, 2024, 8:25 AM IST

Updated : Feb 3, 2024, 8:40 AM IST

Manoj Bajpayee Joram OTT : విలక్షణ పాత్రలు, నటనతో సినీ ప్రేక్షకుల్ని అలరిస్తుంటారు బాలీవుడ్‌ స్టార్ యాక్టర్​ మనోజ్‌ బాజ్‌పాయ్‌. తెలుగులోనూ ఆయన పలు చిత్రాల్లో ప్రతినాయకుడిగా నటించి మెప్పించారు. ఇక 'ఫ్యామిలీ మ్యాన్‌' వెబ్‌ సిరీస్‌లో శ్రీకాంత్‌ తివారీగా ఆయన నటన హైలైట్​గా నిలిచింది.

అయితే ఇప్పుడాయన దేవాశిష్‌ మకీజా డైరెక్షన్​లో నటించిన సర్వైవల్‌ థ్రిల్లర్‌ 'జొరామ్‌'. డిసెంబరు 8న రిలీజైన ఈ సినిమా విమర్శకులను కూడా మెప్పించింది. అలానే వివిధ ఇంటర్నేషనల్​ ఫిల్మ్‌ ఫెస్టివల్స్‌లోనూ ప్రత్యేకంగా ప్రదర్శించే ఛాన్స్​ను అందుకుంది. రీసెంట్​గా అనౌన్స్​ చేసిన ఫిల్మ్‌ ఫేర్‌ అవార్డులను దక్కించుకుంది. ఉత్తమ చిత్రం (క్రిటిక్స్‌), ఉత్తమ కథ అవార్డులను ఖాతాలో వేసుకుంది.

దీంతో 'జొరమ్' ఓటీటీ రిలీజ్ కోసం ప్రేక్షకులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. ఇక వారి ఎదురుచూపులకు తెరదించుతూ ఓటీటీ ఆడియెన్స్​ను అలరించడానికి ఈ 'జొరామ్‌' సినిమా రెడీ అయిపోయింది. ప్రముఖ ఓటీటీ ప్లాట్ ​ఫామ్​ అమెజాన్‌ ప్రైమ్‌ వీడియో వేదికగా స్ట్రీమింగ్‌కు వచ్చేసింది. అయితే, ఇక్కడే ఓ చిన్న ట్విస్ట్ ఉంది . అదేంటంటే ప్రస్తుతం ఈ సినిమాను అద్దె ప్రాతిపదికన అందుబాటులోకి తెచ్చారు మేకర్స్​. దీన్ని చూడాలంటే రూ.199 చెల్లించాల్సి ఉంటుంది.

ఇంతకీ జొరామ్‌ స్టోరీ ఏంటంటే : ఝార్ఖండ్‌లో ఓ గిరిజన ప్రాంతానికి చెందిన వ్యక్తులు దాస్రు(మనోజ్‌ బాజ్‌పాయ్‌) వాన్నో (తనిష్ట ఛటర్జీ). అయితే వీరిద్దరు సొంత గ్రామాన్ని వీడిచి కూలి పని కోసం ముంబయి వెళ్తారు. అక్కడ అనుకోని పరిస్థితుల్లో దాస్రు జీవితంలోకి గిరిజన రాజకీయ నాయకుడు ఫులో కర్మ (స్మిత తాంబే) ఎంట్రీ ఇస్తాడు. దాస్రు, అతడి కుటుంబాన్ని చంపేందుకు ప్రయత్నిస్తాడు. మరి దాస్రు, ఫులో మధ్య గతంలో ఏం జరిగింది? ఫులో నుంచి దాస్రు ఎలా తప్పించుకున్నాడు? ఈ క్రమంలో అతడికి ఎదురైన సవాళ్లు ఏంటి? అనేదే జొరామ్​ మిగిలిన కథ. మొత్తంగా ఈ కథ ఆద్యంతం సస్పెన్స్ థ్రిల్లర్​గా ముందుకు సాగుతూ పోతుంది. ట్విస్ట్​లతో ప్రేక్షకులను షాక్​కు గురిచేస్తుంటుంది. మరి ఈ వీకెండ్​లో కొత్తగా ఏమైనా చూడాలనుకుంటే ఈ డిఫరెంట్ సర్వైవల్ మూవీని ట్రై చేయెుచ్చు. మరి రియాలిటీకి దగ్గరగా ఉండే ఈ జొరామ్ ఓటీటీలో ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేస్తుందో.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

ఆమిర్ ఖాన్ మాజీ భార్యకు సందీప్​ వంగా కౌంటర్​

క్యాన్సర్‌తో పూనమ్ పాండే మృతి - ప్రముఖుల సంతాపం

Last Updated : Feb 3, 2024, 8:40 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.