Manjummel Boys Telugu Release Date: ఇతర భాషల్లో బ్లాక్బస్టర్ విజయం అందుకున్న సినిమాలను తెలుగులోకి సీక్వెల్ చేయడం టాలీవుడ్లో సాధారణం అయ్యింది. రీసెంట్గా తెలుగు ప్రేక్షకులను అలరించిన మలయాళ 'ప్రేమలు' సినిమా అలాంటిదే. ఇప్పుడు ఇదే బాటలో ఇంకో మాలీవుడ్ సినిమా తెలుగులోకి డబ్బింగ్ కానున్నట్లు తెలుస్తోంది. చిన్న చిత్రంగా విడుదలైన 'మంజుమ్మెల్ బాయ్స్' సెన్సేషన్ క్రియేట్ చేస్తూ ఇప్పటివరకు రూ.176 కోట్లు వసూల్ చేసింది. ఈ క్రమంలో బాక్సాఫీస్ వద్ద అత్యధిక వసూళ్లు సాధించిన మలయాళ సినిమాగా 'మంజుమ్మెల్ బాయ్స్' రికార్డు సృష్టించింది. అయితే ఇంతటి ఘన విజయం సాధించిన ఈ సినిమా త్వరలోనే తెలుగులోకి రానున్నట్లు తెలుస్తోంది.
ప్రముఖ ప్రొడక్షన్ హౌజ్ మైత్రి మూవీమేకర్స్ ఈ సినిమా తెలుగు రైట్స్ దక్కించుకొని అందుబాటులోకి తీసుకు రానుందని సోషల్ మీడియాలో ప్రచారం సాగుతోంది. ఈ సినిమాను తెలుగులోకి డబ్ చేసి మార్చి 29న గ్రాండ్గా రిలీజ్ చేయాలని మేకర్స్ భావిస్తున్నట్లు సమాచారం. మరి ఈ విషయంపై ఎలాంటి క్లారిటీ లేదు. కానీ, ఈ సినిమా తెలుగు డబ్బింగ్ కోసం మాత్రం టాలీవుడ్ ఆడియెన్స్ ఎదురుచూస్తున్నారు.
డైరెక్టర్ చిదంబరం ఈ మూవీని రూ.20 కోట్ల బడ్జెట్లో తెరకెక్కించారట. ఫిబ్రవరి 22న థియేటర్లలో రిలీజైన ఈ సినిమాకు భారీ స్పందన లభించింది. ఇక సర్వైవల్ థ్రిల్లర్గా రూపొందిన ఈ మూవీలో సౌబిన్ షాహిర్, శ్రీనాథ్ భసి, బాలు వర్గీస్, గణపతి, సీనియర్ నటుడు లాల్, అరుణ్ కురియన్, ఖలిడ్ రెహ్మాన్, అభిరామ్ రాధాకృష్ణన్, దీపక్ పరంబోల్, షెబిన్ బెన్సన్, లాంటి స్టార్స్ కీలక పాత్ర పోషించారు.
సినిమా కథేంటంటే: 2006లో తమిళనాడులోని కొడైకెనాల్ గుణ గుహల్లో జరిగిన ఓ రియల్ ఇన్సిడెంట్ను బేస్ చేసుకుని డైరెక్టర్ ఈ సినిమాను తెరక్కెక్కించారు. టూర్లో భాగంగా కొంత మంది స్నేహితులు గుణ గుహల్లోకి వెళ్లగా, అక్కడున్న ఓ లోయలో ఒక వ్యక్తి ప్రమాదవశాత్తు పడిపోతాడు. దీంతో అతడ్ని కాపాడటం కోసం మిగతా స్నేహితులు ఏం చేశారనేదే మిగతా కథ. ఆ సమయంలో వారు ఎదుర్కొన్న ఆటుపోట్లను ఎంతో రియాలిస్టిక్గా చూపించారు డైరెక్టర్. పోలీసులు సైతం చేతులెత్తినప్పటికీ అలుపు ఎరగకుండా పోరాడి తమ స్నేహితుడిని ఎలా కాపాడుకున్నారు అనే విషయాలు ఈ సినిమాలో హైలైట్గా నిలిచాయి.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
రూ.4 కోట్ల బడ్జెట్ - 'పుష్ప' విలన్ కొత్త సినిమాకు అదిరిపోయే కలెక్షన్స్!
మాలీవుడ్లో ఫాస్టెస్ట్ రూ. 100 క్రోర్ మార్క్! - 'మంజుమ్మెల్ బాయ్స్' అరుదైన రికార్డు