ETV Bharat / entertainment

మాలీవుడ్​లో ఫాస్టెస్ట్ రూ. 100 క్రోర్ మార్క్​​! - 'మంజుమ్మెల్ బాయ్స్​' అరుదైన రికార్డు​

Manjummel Boys Box Office Collection : మలయళ ఇండస్ట్రీలో విడుదలైన పలు సినిమాలు బాక్సాఫీస్ వద్ద సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది. తాజాగా ఈ జాబితాలో లేటెస్ట్ మూవీ 'మంజుమ్మెల్ బాయ్స్​' చేరింది. అయితే ఈ మూవీ ఓ అరుదైన రికార్డును తన ఖాతాలో వేసుకుంది.

Manjummel Boys Box Office Collection
Manjummel Boys Box Office Collection
author img

By ETV Bharat Telugu Team

Published : Mar 6, 2024, 5:36 PM IST

Updated : Mar 6, 2024, 7:03 PM IST

Manjummel Boys Box Office Collection : చిన్న చిత్రంగా విడుదలై బాక్సాఫీస్​ వద్ద సెన్సేషన్స్ క్రియేట్ చేస్తోంది మలయాళ మూవీ 'మంజుమ్మెల్ బాయ్స్​​'. వాస్తవ ఘటనలను ఆధారంగా చేసుకుని తెరకెక్కిన ఈ సినిమా మాలీవుడ్​తో పాటు ఇతర భాషల ప్రేక్షకులను ఆకట్టుకుంటూ థియేటర్లలో సందడి చేస్తోంది. రిలీజైన రోజు నుంచే పాజిటివ్ టాక్ అందుకున్న ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపిస్తోంది.

ఈ నేపథ్యంలో తాజాగా ఈ సినిమా ఓ అరుదైన ఘనతను తన ఖాతాలో వేసుకుంది. రిలీజైన 10 రోజుల్లోనే రూ. 100 కోట్ల మార్కును దాటి మాలీవుడ్​లో ఈ మార్కును ఫాస్ట్​గా దాటిన సినిమాగా చరిత్రకెక్కింది. మరోవైపు మలయాళంతో పాటు తమిళ ప్రేక్షకులను ఆకట్టుకున్న ఈ సినిమా త్వరలో తెలుగు ప్రేక్షకుల ముందుకు రానుందని సమచారం. అయితే ఈ విషయంపై ఇప్పటి వరకు అఫీషియల్ అనౌన్స్​మెంట్​ లేదు.

Manjummel Boys Cast : ఇక ఈ సినిమా విషయానికి వస్తే - చిదంబరం డైరెక్ట్​ చేసిన ఈ మూవీ ఫిబ్రవరీ 22న ప్రేక్షకుల ముందుకొచ్చింది. సర్వైవల్ థ్రిల్లర్​గా రూపొందిన ఈ మూవీలో సౌబిన్‌ షాహిర్‌, శ్రీనాథ్‌ భసి, బాలు వర్గీస్​, గణపతి, సీనియర్ నటుడు లాల్‌, అరుణ్​ కురియన్, ఖలిడ్​ రెహ్మాన్, అభిరామ్ రాధాకృష్ణన్​, ​దీపక్‌ పరంబోల్‌, షెబిన్​ బెన్సన్​, లాంటి స్టార్స్ కీలక పాత్ర పోషించారు.

స్టోరీ ఏంటంటే ?
2006లో తమిళనాడులోని కొడైకెనాల్​ గుణ గుహల్లో జరిగిన ఓ రియల్ ఇన్సిడెంట్​ను బేస్ చేసుకుని డైరెక్టర్ ఈ సినిమాను తెరక్కెక్కించారు. టూర్​లో భాగంగా కొంత మంది స్నేహితులు గుణ గుహల్లోకి వెళ్లగా, అక్కడున్న ఓ లోయలో ఒక వ్యక్తి ప్రమాదవశాత్తు పడిపోతాడు. దీంతో అతడ్ని కాపాడటం కోసం మిగతా స్నేహితులు ఏం చేశారనేదే మిగతా కథ. ఆ సమయంలో వారు ఎదుర్కొన్న ఆటుపోట్లను ఎంతో రియాలిస్టిక్​గా చూపించారు డైరెక్టర్. పోలీసులు సైతం చేతులెత్తినప్పటికీ అలుపు ఎరగకుండా పోరాడి తమ స్నేహితుడిని ఎలా కాపాడుకున్నారు అనే విషయాలు ఈ సినిమాలో హైలైట్​గా నిలిచాయి.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

OTT : రూ.3 కోట్ల బడ్జెట్​తో​ రూ.50కోట్లకు పైగా వసూళ్లు - ప్రేక్షకుల మదిని దోచిన చిత్రాలివే!

తెలుగు ఆడియెన్స్ - ఈ రెండు మలయాళ చిత్రాల గురించే చర్చంతా!

Last Updated : Mar 6, 2024, 7:03 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.