ETV Bharat / entertainment

మా అధ్యక్షుడిగా మంచు విష్ణు ఏకగ్రీవం- కారణం ఏంటంటే? - Manchu Vishnu Maa President - MANCHU VISHNU MAA PRESIDENT

Manchu Vishnu Maa President: తెలుగు మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్​ అధ్యక్షుడిగా మంచు విష్ణు మరోసారి ఎన్నికయ్యారు.

Manchu Vishnu Maa President
Manchu Vishnu Maa President
author img

By ETV Bharat Telugu Team

Published : Apr 8, 2024, 4:16 PM IST

Updated : Apr 8, 2024, 4:56 PM IST

Manchu Vishnu Maa President: తెలుగు మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ (Maa Association) ​లో కీలం పరిణామం జరిగింది. స్టార్ హీరో మంచు విష్ణు మరోసారి 'మా' అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. ఆయనను అసోసియేషన్ సభ్యులు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. తెలుగు మూవీ ఆర్టిస్ట్ నూతన భవన నిర్మాణం పూర్తయ్యేంత వరకు మంచు విష్ణు 'మా' అధ్యక్షుడిగా కొనసాగాలని సోమవారం జరిగిన సర్వసభ్య సమావేశంలో అసోసియేషన్ సభ్యులు ఏకగ్రీవంగా తీర్మానం చేశారు.

ఈ క్రమంలో మా భవనం విజయవంతంగా పూర్తయ్యే వరకు మంచు విష్ణు నేతృత్వంలోని ప్రస్తుత కమిటీ పదవీకాలాన్ని పొడిగించాలని సభ్యులు ప్రతిపాదించారు. దీంతో మా అధ్యక్షుడిగా మంచు విష్ణు మరోసారి ఎన్నికయ్యారు. ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటిస్తూ 'మా' అసోసియేషన్ ప్రకటన విడుదల చేసింది.

ఇక సభ్యుల తీర్మానంపై హీరో విష్ణు హర్షం వ్యక్తం చేశారు. మా సభ్యుల అభివృద్ధి, సంక్షేమం కోసం తనవంతు ప్రయత్నాలను మరింత రెట్టింపు చేస్తానని విష్ణు తెలిపారు. తన నాయకత్వాన్ని కొనసాగించడం ద్వారా అసోసియేషన్ బలోపేతానికి సభ్యులు మరింత తోడ్పాటును అందించారని మంచు విష్ణు ఈ సందర్భంగా పేర్కొన్నారు.

ఇక మంచు విష్ణు 2021 అక్టోబర్​లో తొలిసారి మా ప్రెసిడెంట్ అయ్యారు. 2021లో జరిగిన ఎన్నికల్లో తన ప్రత్యర్థి ప్రకాశ్ రాజ్ ప్యానెల్​పై విష్ణు గెలుపొందారు. అప్పట్లో ఈ ఎన్నికలు జనరల్ ఎలక్షన్స్​ను తలపించాయి. రోజూ సోషల్ మీడియాలో ఈ ఎన్నికల గురించి చర్చ జరిగింది. ఇరు ప్యానెల్ సభ్యులు ప్రచారంలో విమర్శలు సంధించుకున్నారు. పోటాపోటీగా జరిగినా ఆ ఎన్నికల్లో చివరికి విష్ణు ప్యానెల్​నే విజయం వరించింది.

ఇక ఈసారి గతేడాది సెప్టెంబర్​లో ఎన్నికలు జరగాల్సి ఉండగా పలు కారణాల వల్ల 2024 మే కు వాయిదా వేశారు. ఈ ఎన్నికల్లో ఇది వరకులాగా తీవ్ర పోటీ ఉంటుందేమోనని అందరూ అభిప్రాయపడ్డారు. కానీ, ఎలాంటి హడావుడి లేకుండా ఇప్పుడు సైలెంట్​గా అధ్యక్షుడి ఎన్నిక జరిగింది. ఇక మంచు ఫ్యాన్స్, ఇండస్ట్రీ ప్రముఖులు ఆయనకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.

వరదల్లో చిక్కుకున్న హీరోలు ఆమిర్ ఖాన్, విష్ణు విశాల్- అతికష్టం మీద బయటపడ్డారిలా!

Manchu Vishnu Injured : మంచు విష్ణుకు గాయాలు? 'కన్నప్ప' సినిమా సెట్​లో!

Last Updated : Apr 8, 2024, 4:56 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.