Mammootty Bramayugam Movie : తన నటనతో అటు సౌత్‌లో ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న మాలీవుడ్ మెగాస్టార్ మమ్ముట్టి ఏడు పదుల వయసులోనూ యంగ్ హీరోస్‌కు దీటుగా నటిస్తూ అందరినీ ఆశ్చర్య పరుస్తున్నారు. వరుస సినిమాలతో మలయాళ ఇండస్ట్రీలో సెన్సేషన్ క్రియేట్ చేస్తున్నారు. ఇటీవలే విడుదలైన 'కాథల్: ది కోర్'తో ప్రేక్షకులను పలకరించిన ఆయన తాజాగా మరో సినిమాతో బాక్సాఫీస్ ముందుకు రానున్నారు. 'భ్రమయుగం' అనే హర్రర్ థ్రిల్లర్‌లో ఆయన కీ రోల్ ప్లే చేస్తున్నారు. నైట్ షిఫ్ట్ స్టూడియోస్ అనే సంస్థ ఈ చిత్రానికి నిర్మణ బాధ్యతలు చేపట్టింది. సిద్ధార్థ్ భరతన్, అర్జున్ అశోకన్, అమల్దా లిజ్ లాంటి స్టార్స్ ఇందులో కీలక పాత్రలు పోషిస్తున్నారు.
అయితే ఈ సినిమాతో ఆయన ఓ కొత్త ప్రయోగానికి సిద్ధమయ్యారు. 'భ్రమయుగం' చిత్రాన్ని థియేటర్స్‌లో బ్లాక్ అండ్ వైట్ థీమ్‌లోనే విడుదల చేయనున్నట్లు తాజాగా వెల్లడించారు. ఇది విన్న ఫ్యాన్స్ తొలుత షాకైనప్పటికీ, ఆ తర్వాత ఇటువంటి తరహాలో సినిమా అంటే ఇంకాస్త ఇంట్రెస్టింగ్గా ఉంటుందంటూ మూవీ రిలీజ్ కోసం ఎదురుచూస్తున్నట్లు నెట్టింట కామెంట్లు పెడుతున్నారు.
సాధారణంగా ఇప్పటి సినిమాలో ఏదైనా ఫ్లాష్‌బ్యాక్ సీన్స్ చూపించాలనుకున్నప్పుడు ఆ సన్నివేశాలకు మాత్రం బ్లాక్ అంట్ వైట్ థీమ్‌ను ఉపయోగించింది చూశాం. కానీ, ఇలా సినిమా మొత్తం బ్లాక్ అండ్ వైట్‌లో వస్తుండటం అనేది ఈ కాలంలో ఓ కొత్త ప్రయోగమే. అయితే ఈ మూవీ టీమ్ ప్రమోషన్స్ కూడా విన్నూత్నంగానే చేసింది. మూవీకి సంబంధించిన పోస్టర్స్‌ను సైతం బ్లాక్ అండ్ వైట్‌లోనే రిలీజ్ చేసింది. దీంతో ఈ సినిమాపై ప్రేక్షకుల్లో మరింత ఆసక్తి నెలకొంది.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
Bramayugam Movie Relase Date : పాన్ ఇండియా లెవెల్లో ఈ మూవీ ఫిబ్రవరీ 15న విడుదల కానుంది. తాజాగా ఈ సినిమాకు సెన్సార్ బోర్డు యూ/ఏ సర్టిఫికెట్ జారీ చేసింది. ఇక సెన్సార్ అప్‌డేట్ ప్రకారం 'భ్రమయుగం' రన్ టైమ్ 140 (2 గంటల 20 నిమిషాలు) నిమిషాలని సమాచారం.