ETV Bharat / entertainment

'విశ్వంభర' అలా ఉంటుంది : సూపర్ అప్డేట్ ఇచ్చిన వశిష్ఠ - Viswambhara Movie - VISWAMBHARA MOVIE

Mallidi Vassishta Comments on Viswambhara : చిరంజీవి హీరోగా తెరకెక్కుతున్న తాజా చిత్రం 'విశ్వంభర'. ఈ సినిమా గురించి దర్శకుడు వశిష్ఠ ఆసక్తికర విషయాలను చెప్పారు. పూర్తి వివరాలు స్టోరీలో.

source ETV Bharat
Mallidi Vassishta Comments on Viswambhara (source ETV Bharat)
author img

By ETV Bharat Telugu Team

Published : Aug 22, 2024, 6:06 PM IST

Mallidi Vassishta Comments on Viswambhara : 'భోళాశంకర్' వంటి డిజాస్టర్​​ తర్వాత మెగాస్టార్​​​ చిరంజీవి నటిస్తున్న లేటెస్ట్​​ మూవీ 'విశ్వంభర'. సోషియో ఫాంటసీగా రాబోతున్న ఈ చిత్రాన్ని చిరు అభిమాని, బింబిసార దర్శకుడు వశిష్ట తెరకెక్కిస్తున్నారు. యువీ క్రియేషన్స్ బ్యానర్​పై చిరు కెరీర్​లోనే అత్యంత భారీ బడ్జెట్​తో రూపొందుతోందని సమాచారం.

అయితే నేడు(ఆగస్ట్ 22) చిరు పుట్టిన రోజు సందర్భంగా టీజర్ వస్తుందని జోరుగా ప్రచారం సాగింది. అయితే ఓ పోస్టర్​ను మాత్రం విడుదల చేశారు మేకర్స్​. ఇదే సమయంలో చిరుకు స్పెషల్ విషెస్ చెప్పిన దర్శకుడు విశిష్ట ఫ్యాన్స్​లో జోష్ నింపే విషయాలను పంచుకున్నారు.

సినిమాపై ఎన్ని ఎక్స్​పెక్టేషన్స్​ అయినా పెట్టుకోండి, అంతకుమించి వంద రెట్టు ఎక్కువ ఉండేలా, అభిమానులు సంతృప్తి చెందేలా ఈ చిత్రాన్ని తాను తెరకెక్కిస్తున్నట్లు చెప్పారు. బాస్ నీ అభిమానులందరూ ఎలా చూడాలి అనుకుంటున్నారో అలా చూపిస్తా అని అన్నారు. ఒకప్పటి వింటేజ్ చిరును చూపించడంతో పాటు ఇప్పటి వరకు ఎవరూ మెగాస్టార్​తో చేయని సబ్జెక్టును చేస్తున్నట్లు చెప్పుకొచ్చారు. ఈ సినిమా కచ్చితంగా అంచనాలు అందుకుంటుందని ధీమా వ్యక్తం చేశారు. టీజర్ అనౌన్స్​మెంట్​ త్వరలోనే ఉంటుందని చెప్పారు. ప్రస్తుతం ఈ కామెంట్స్ సోషల్​ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.

Viswambhara Release Date : కాగా, ఈ విశ్వంభర సినిమా జనవరి 10న రిలీజ్ కానుంది. దీనిని ఉద్దేశిస్తూ ఈ సంక్రాంతి మనదే అని మరోసారి నొక్కి చెప్పారు వశిష్ట. సంక్రాంతి విజేతగా విశ్వంభర నిలుస్తుందని అన్నారు. చిత్రంలో త్రిష హీరోయిన్​గా నటిస్తోంది. ఆశికా రంగనాథ్​తో పాటు మరో ముగ్గురు భామలు కూడా నటిస్తున్నారు. ఆస్కార్ అవార్డు గ్రహీత ఎంఎం కీరవాణి సంగీతం అందిస్తున్నారు. సినిమా సోషియో ఫాంటసీ కావడం వల్ల వీఎఫ్‌ఎక్స్‌పై ప్రత్యేక శ్రద్ధ పెట్టారట. మూవీ కోసం 13 భారీ సెట్‌లు వేసి ఓ ప్రత్యేక ప్రపంచాన్ని సృష్టించారట. అంతకుముందెన్నడూ చూడని సరికొత్త అవతారంలో చిరు కనిపించనున్నారని సమాచారం.

OTTలోకి 'కల్కి' ట్రిమ్ వెర్షన్- 6 నిమిషాలు కట్- ఏ సీన్లు కత్తిరించారంటే? - Kalki 2898 AD OTT

శ్ర‌ద్ధా క‌పూర్ 'స్త్రీ 2' సంచలనం - మొదటి వారంలో రికార్డ్‌ వసూళ్లు - Stree 2 Collections

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.