ETV Bharat / entertainment

తెలుగు ఆడియెన్స్ - ఈ రెండు మలయాళ చిత్రాల గురించే చర్చంతా! - భ్రమయుగం సినిమా

Malayalam Bramayugam Pramalu Movie : ఈ వారం తెలుగు రాష్ట్రాల్లోని థియేటర్లలో రెండు మలయాళ సినిమాలు బాగా మూవీ లవర్స్​ను ఆకట్టుకుంటున్నాయి. ఒకటి భ్రమయుగం, రెండోది ప్రేమలు. దాని గురించే ఈ కథనం.

Etv Bharat
Etv Bharat
author img

By ETV Bharat Telugu Team

Published : Feb 19, 2024, 7:18 AM IST

Malayalam Bramayugam Pramalu Movie : ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లోని థియేటర్లలో చెప్పుకోదగ్గ సినిమాలేమీ లేవు. 'ఊరి పేరు భైరవకోన' ఒక్కటే పర్వాలేదనిపించే టాక్​తో రన్ అవుతోంది. అయితే దీంతో పాటు ఈ వారమే విడుదలైన మలయాళ చిత్రాలు 'భ్రమయుగం', 'ప్రేమలు' మాత్రం సూపర్​ హిట్ టాక్​ను తెచ్చుకోవడం విశేషం. తెలుగు సినీ లవర్స్​ ఎక్కువగా ఈ రెండు చిత్రాల గురించి డిస్కస్ చేస్తున్నారు. మరి ఇంతకీ ఆ రెండు చిత్రాల విశేషాలంటి? కలెక్షన్స్ ఎలా వస్తున్నాయ్​ తెలుసుకుందాం.

ప్రస్తుతం ప్రతి చిత్రం అత్యున్నత టెక్నాలజీలో కలర్‌ఫుల్‪‌గా భారీ స్థాయిలో తెరకెక్కుతోంది. బ్లాక్ అండ్ వైట్ చిత్రాలు ఎన్నో దశాబ్దాల క్రితమే కనుమరుగైపోయాయి. మరి ఇలాంటి అత్యున్నత సాంకేతిక ఉన్న సమయంలో మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి మాత్రం బ్లాక్ అండ్ వైట్ మోడ్​లో 'భ్రమయుగం' చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. హారర్ థ్రిల్లర్ కథతో డిఫరెంట్ కాన్సెప్ట్‌తో రూపొందిన ఈ చిత్రానికి ఆడియెన్స్ స్లోగా కనెక్ట్ అవుతున్నారు. కథ పరంగా కాస్త ల్యాగ్ ఉన్నప్పటికీ, యాక్టింగ్, సినిమాటోగ్రఫీ, బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ ఇలా అద్భుతంగా హైస్టాండర్స్​తో ప్రేక్షకుల్ని బాగా ఆకట్టుకుంటున్నాయి. హైదరాబాద్‌లోనూ ఈ చిత్రానికి మంచి రెస్పాన్స్ వస్తోంది. వసూళ్లు కూడా మంచిగానే వస్తున్నాయని ట్రేడ్ వర్గాల నుంచి సమాచారం అందుతోంది.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

ఇకపోతే మరో మలయాళ చిత్రం 'ప్రేమలు'. యూత్‌ఫుల్ లవ్‌స్టోరీగా రూపొందిన ఈ చిత్రం పోయిన వారం థియేటర్లలోకి వచ్చి మంచి హిట్ టాక్ అందుకుంది యూత్​ దగ్గర ఫుల్ మార్క్​లు కొట్టేసింది. బ్యాక్ డ్రాప్‌ అంతా దాదాపు హైదరాబాద్‌లోనే ఉండటం కూడా సినిమాకు బాగా కలిసొచ్చింది. దీంతో మనోళ్లు ఇంకా బాగా కనెక్ట్ అయ్యారు. అతి తక్కువ బడ్జెట్​తో రూపొందిన ఈ చిత్రానికి కలెక్షన్లు ఊహించని దాని కన్నా ఎక్కువగా వస్తోంది. పుష్ప విలన్​, మలయాళ స్టార్ ఫహద్ ఫాజిల్ ఈ చిత్రాన్ని తెరకెక్కించారు.

అలా వేర్వేరు డిఫరెంట్ జానర్స్​తో వచ్చిన ఈ రెండు చిత్రాలు ఆడియెన్స్​ను బాగానే ఆకట్టుకుంటున్నాయి. త్వరలోనే ఈ రెండు చిత్రాలు తెలుగులోనూ డబ్​ చేసి రిలీజ్​ చేయనున్నట్లు తెలిసింది.

90's ​లోనే భారీ రెమ్యునరేషన్- రూ.కోటి అందుకున్న తొలి స్టార్ ఎవరంటే ? ​

అత్తమ్మ బర్త్​ డే స్పెషల్​ - మరో గుడ్ న్యూస్​తో ఉపాసన సర్​ప్రైజ్​

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.