ETV Bharat / entertainment

మలైకా అరోరా - అర్జున్ కపూర్ బ్రేకప్ - కానీ ఒక కండిషన్! - MALAIKA ARORA ARJUN KAPOOR - MALAIKA ARORA ARJUN KAPOOR

Malaika Arora And Arjun Kapoor Separated : మరో సెలబ్రిటీ కపుల్ విడిపోయినట్లు జోరుగా ప్రచారం సాగుతోంది. మలైకా అరోరా - అర్జున్ కపూర్ విడిపోడినట్లు తెలుస్తోంది. అందరూ దీని గురించే తెగ చర్చించుకుంటున్నారు. పూర్తి వివరాలు స్టోరీలో

Source Getty Images
Arjun kapoor Malaika Arora (Source Getty Images)
author img

By ETV Bharat Telugu Team

Published : May 31, 2024, 5:25 PM IST

Malaika Arora And Arjun Kapoor Separated : బాలీవుడ్‌లో మరో జంట బ్రేకప్‌ చెప్పుకున్నట్లు తెలిసింది. ప్రస్తుతం ఈ వార్త బీటౌన్ మీడియా వర్గాల్లో హాట్‌ టాపిక్‌గా మారింది. అందరూ దీని గురించే తెగ చర్చించుకుంటున్నారు. ఇంతకీ వారు మరెవరో కాదు బాలీవుడ్‌ లవ్ బర్ట్స్ మలైకా ఆరోరా - అర్జున్‌ కపూర్‌. ఇప్పటికే చాలా సార్లు ఈ జంట విడిపోయినట్లు వార్తలు వచ్చాయి. కానీ వారు దాన్ని డైరెక్ట్​గా కొట్టిపారేయకుండా కలిసున్న ఫొటోలను పోస్ట్ చేస్తూ రూమర్స్​కు చెక్ పెట్టేవారు. అయితే ఈ సారి మాాత్రం వీరు విడిపోయారని ఈ జంటకు సంబంధించిన సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి.

"మలైకా, అర్జున్‌ల మధ్య ఎంతో మంచి అనుబంధం ఉంది. ఒకరి మనసులో మరొకరికి ప్రత్యేకమైన స్థానం కూడా ఉంది. అయితే ఈ ఇద్దరికి బ్రేకప్‌ అయినప్పటికీ వారి మధ్య అనుబంధం ఎప్పటికీ అలాగే ఉంటుంది. హెల్తీ రిలేషన్‌ను వారు కొనసాగిస్తారు. కానీ తమ బ్రేకప్‌ గురించి బయటకు చెప్పేందుకు వారు ఇష్టంగా లేరు. ఎందుకంటే దీనిపై అందరు మాట్లాడుకోవడం వారికి ఇష్టం లేదు. అందుకే ఈ విషయంలో వారు సైలెంట్​గా ఉంటున్నారు" అని ఇండస్ట్రీ వర్గాలు పేర్కొన్నాయి.

కాగా, మలైకా అరోరా - అర్జున్ కపూర్​ మొదట కొంతకాలం పాటు సీక్రెట్‌ డేటింగ్‌లో ఉన్నారు. 2018లో రిలేషన్‌ను ఆఫీషియల్​గా అనౌన్స్ చేశారు. అయితే అర్జున్‌ కన్నా మలైకా 12 ఏళ్లు పెద్ద. దీంతో అందరూ మలైకాను తెగ ట్రోల్‌ చేసేవారు. ఆంటీతో ప్రేమ ఏంటని అర్జున్​పై విమర్శలు కురిపించారు. కానీ ఈ జంట వాటిని పట్టించుకోలేదు. దాదాపు ఆరేళ్ల నుంచి చెట్టపట్టాలేసుకుని తిరిగుతున్నారు. ఇండస్ట్రీకి సంబంధించి ఏ ఫంక్షన్‌ అయినా, మూవీ ఈవెంట్‌ అయినా ఇద్దరూ జంటగా హాజరయ్యేవారు. తరచూ డిన్నర్‌ డేట్స్‌కు వెళ్లి కెమెరాలకు చిక్కేవారు. ఒకరి ఫోటోలు మరొకరు షేర్‌ చేస్తూ ప్రేమను కురిపించుకునేవారు. వెకేషన్లకు వెళ్లేవారు. కానీ ఇప్పుడు ఎవరి దారి వారు చూసుకున్నారంటూ బీ టౌన్‌లో గుసగుసలు వినిపిస్తున్నాయి. ఎందుకంటే ఎప్పుడు జంటగా కనిపించే వీరు ఇప్పుడు సింగిల్‌గా కనిపిస్తున్నారు. అర్జున్‌ మీడియాకు దూరంగా ఉంటున్నారు. మలైకా సింగిల్‌గానే కనిపిస్తోంది. చూడాలి మరి ఈ విషయంపై అర్జున్‌, మలైకా రియాక్ట్ అవుతారో లేదో.

భారీ బడ్జెట్ ఇండియన్​​ సీరియల్​ ఇదే - RRR, కల్కి, ఆదిపురుష్ బడ్జెట్​ కన్నా ఎక్కువ! - Indian Most Expensive TV Show

అల్లు అర్జున్​ 'పుష్ప 2'కు పోటీగా దిగిన కీర్తిసురేశ్​ - Alluarjun VS Keerthi Suresh

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.