ETV Bharat / entertainment

కుర్చీ మ‌డ‌తెట్టేసింది భయ్యా - వైరల్​గా మ‌హేశ్‌ అన్న కూతురు గ్లామర్​ ఫొటోషూట్​! ​ - మహేశ్ అన్న కూతురు గ్లామర్ ఫొటోషూట్

Mahesh Brother daughter Dance Video : సూపర్ స్టార్ మహేశ్ బాబు అన్న రమేశ్ బాబు కూతురు భారతి మరోసారి సోషల్ మీడియాలో ఫుల్ ట్రెండ్ అవుతోంది. అందుకు కారణం ఆమె పెట్టిన పోస్టే. దాని గురించే ఈ కథనం.

కుర్చీ మ‌డ‌తెట్టేసింది భయ్యా - వైరల్​గా మ‌హేశ్‌ అన్న కూతురు గ్లామర్​ ఫొటోషూట్​! ​

author img

By ETV Bharat Telugu Team

Published : Feb 19, 2024, 12:50 PM IST

Mahesh Brother daughter Dance Video : సూపర్ స్టార్ మహేశ్​ బాబు నటించిన రీసెంట్ మూవీ గుంటూరు కారంలోని కుర్చీ మడతపెట్టి సాంగ్ ఎంతటి బ్లాక్ బస్టర్ హిట్ టాక్​ను అందుకుందో తెలిసిన విషయమే. మాస్ ఆడియెన్స్​తో పాటు క్లాస్ ఆడియెన్స్ కూడా ఈ సాంగ్​కు ఫిదా అయిపోయారు. ఈ పాట వినిపిస్తే చాలు ఉర్రూతలూగిపోతున్నారు. సోషల్ మీడియాలో భారీగా రీల్స్​ కూడా చేస్తున్నారు.

అయితే ఇదే పాటను(Kurchi Madatapetti Song) అభిమానులు, ఆడియెన్స్​తో పాటు మహేశ్ బాబు అన్న రమేశ్ బాబు కూతురు భారతి కూడా ఓ రీల్ చేసింది. ఈ వీడియోను ఆమె పోస్ట్ చేయగా అది విపరీతంగా ట్రెండ్ అవుతోంది. ఆమె గ్రేస్‌తో వేసిన ఊరమాస్​ స్టెప్పులు విజిల్స్ వేసేలా ఉన్నాయి. దీంతో మరోసారి సూపర్ స్టార్ అభిమానులతో పాటు నెటిజన్ల కన్ను ఆమెపై పడింది. ఆమె ఇన్​స్టా తీసి తాను పోస్ట్​ చేసిన పాత ఫొటోలను తెగ చూసేస్తున్నారు.

వాస్తవానికి ఆమె పెద్దగా సోషల్ మీడియాలో యాక్టివ్​గా ఉండదు. ఎప్పుడో ఓ సారి పోస్ట్ పెడుతుంటుంది. అయితే తాజాగా ఈ రెండు రోజుల నుంచి ఇన్​స్టాలో యాక్టివ్​గా ఉంటోంది. రెండు రోజుల క్రితం వైట్ కలర్ డ్రెస్​లో గ్లామర్ ఫొటోషూట్ పోస్ట్ చేసింది. ఇప్పుడేమో డ్యాన్స్ వీడియో పోస్ట్ చేసింది. అంతేకాదు తన ఇన్‌స్టా బయోలో డ్రైవ్ ఇన్ మూవీ థియేటర్​ అంటూ రాసుకొచ్చింది. దీంతో త్వరలోనే ఆమె సినిమాల్లోకి రానుందా అంటూ సూపర్ స్టార్ అభిమానులు సందేహ పడుతున్నారు. కాగా, మహేశ్ అన్న రమేశ్​ బాబుకి ఇద్దరు పిల్లలు ఉన్నారు. అబ్బాయి జయకృష్ణ, కూతురు భారతి. బయట పెద్దగా ఎప్పుడూ కనిపించారు. ఆ మధ్య రమేశ్​ బాబు చనిపోయిన సమయంలో మహేశ్​తో కలిసి వీరిద్దరు దిగిన ఫోటోలు సోషల్ మీడియాలో బాగా వైరల్ అయ్యాయి.

Mahesh Rajamouli Movie : ఇకపోతే మహేశ్ బాబు ప్రస్తుతం తన కొత్త సినిమా కోసం రెడీ అవుతున్నారు. దర్శకధీరుడు రాజమౌళితో పాన్ వరల్డ్ రేంజ్​లో భారీ మూవీ చేస్తున్నారు. ఫారెస్ట్ అండ్ యాక్షన్ అడ్వెంచర్ నేపథ్యంలో ఈ చిత్రం రూపందుతోంది. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటున్న ఈ చిత్రం త్వరలోనే సెట్స్​పైకి వెళ్లనుంది.

ప్రభాస్ కల్కిలో ఎన్టీఆర్​ - అసలు విషయం చెప్పేసిన మూవీ రైటర్!

కొత్త వారం షురూ - ఈటీవీలోకి బోలెడు తెలుగు సినిమాలు - మీరేం చూస్తారు?

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.