ETV Bharat / entertainment

'లైఫ్​లో నెక్స్ట్​ ఛాప్టర్​ను నీవే రాసుకోవాలి గౌతమ్​!'- మహేశ్​ పుత్రోత్సాహం - Mahesh Babu Son Education - MAHESH BABU SON EDUCATION

Mahesh Son Graduation : ప్రముఖ నటుడు మహేశ్ బాబు పుత్రోత్సాహంతో పొంగిపోయారు. తన కుమారుడు గౌతమ్​ గ్యాడ్యుయేషన్ పూర్తి అయిన సందర్భంగా భావోద్వేగానికి గురయ్యారు! ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా షేర్​ చేసుకున్నారు. ​

Mahesh Son Graduation
Mahesh Son Graduation (ETV Bharat)
author img

By ETV Bharat Telugu Team

Published : May 26, 2024, 7:34 PM IST

Mahesh Son Graduation : టాలీవుడ్​ సూపర్ స్టార్ మహేశ్​ బాబు పుత్రోత్సాహంతో పొంగిపోయారు. తాజాగా ఆయన కుమారుడు గౌతమ్​ గ్రాడ్యుయేషన్(ఇంటర్) పూర్తి చేసిన సందర్భంగా ఆనందం వ్యక్తం చేశారు. ఈ మేరకు సోషల్​ మీడియాలో ఓ పోస్టు చేసిన మహేశ్​, తన హృదయం గర్వంతో పొంగిపోయిందని అన్నారు. "గ్రాడ్యుయేషన్​ పూర్తి అయినందుకు నీకు(గౌతమ్) అభినందనలు. నీ జీవితంలో తదుపరి అధ్యాయాన్ని నువ్వే రాసుకోవాలి. నువ్వు గొప్ప స్థాయికి ఎదుగుతావని నాకు తెలుసు. కలల్ని అందుకునేందుకు పరుగెత్తాలి. నిన్ను ఎప్పటికీ ప్రేమిస్తూనే ఉంటా. ఈరోజు నేను గర్వించదగ్గ ఘట్టమనేని గౌతమ్​ తండ్రిని" అని రాసుకొచ్చారు.

మరోవైపు, తన కుమారుడి గ్రాడ్యుయేషన్​ పూర్తి అయినందుకు నమ్రత సంతోషం వ్యక్తం చేశారు. ఈ మేరకు ఇన్​స్టాగ్రామ్​లో పలు చిత్రాలను పోస్ట్​ చేశారు. తాను చాలా గర్విస్తున్నట్లు చెప్పారు. 'నువ్వు నీ పట్ల నిజాయితీగా ఉంటూ నీ అభిరుచిని ఫాలో అవ్వు. నీకు నా ప్రేమ, సపోర్ట్​ ఎల్లప్పుడూ ఉంటుంది' అంటూ పుత్రోత్సాహంతో పొంగిపోయారు.

'మా నాన్నకు ఆలా చేయడం ఇష్టం ఉండదు'
మహేశ్‌ బాబు జుట్టుకు సంబంధించి ఓ వీడియో ఇటీవల వైరల్‌ అయింది. తన సోదరి మంజుల జుట్టు పట్టుకుని లాగడం, దానికి మహేశ్‌ ఇచ్చిన ఎక్స్‌ప్రెషన్‌ నెటిజన్లను ఆకర్షించాయి. కానీ, మంజులను మహేశ్‌ను ఏమన్నారో ఎవరికీ తెలియదు. మహేశ్‌ కుమార్తె సితార నుంచి ఆ ప్రశ్నకు సమాధానం రాబట్టే ప్రయత్నం చేశారు సోషల్‌ మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్లు. సితారతో వారు చిట్‌చాట్‌లో పాల్గొన్నారు. 'మీ డాడీ జుట్టుని మీ అత్తయ్య పట్టుకున్నప్పుడు ఏం జరిగింది?' అని అడగ్గా 'నా జుట్టు పట్టుకోవద్దు' అని మహేశ్‌ అన్నారని సితార చెప్పింది. ఎవరైనా తన జుట్టు పట్టుకోవడం తన తండ్రికి ఇష్టం ఉండదని తెలిపింది. కొన్ని రోజుల క్రితం హైదరాబాద్‌లో జరిగిన ఓ వివాహ వేడుకకు కుటుంబ సమేతంగా మహేశ్‌ హాజరయ్యారు. అయితే దిగ్గజ దర్శకుడు రాజమౌళి డైరెక్షన్​లో నటించనున్న మూవీ కోసం మహేశ్‌ జుట్టు పెంచారని సమాచారం.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.