Mahesh Babu Son Gautam Birthday : టాలీవుడ్ సూపర్‌స్టార్ మహేశ్ బాబు తాజాగా తన తనయుడు గౌతమ్ బర్త్‌డే సందర్భంగా ఓ స్పెషల్ పోస్ట్ పెట్టి విష్ చేశారు. "హ్యాపీ 18 మై సన్. ఈ సమయంలో ఎన్నో విషయాలను నువ్వు అన్వేషించు. ఎంజాయ్ చెయ్. లవ్ యూ. ఒక తండ్రిగా ఈరోజు నేనెంతో ఆనందంగా ఉన్నా" అంటూ ఏమోషనల్ నోట్ షేర్ చేశారు.
Happy 18 son!! ♥️♥️♥️ Explore & enjoy this time✨✨I love you very much… I’m a proud father today 😘😘😘 pic.twitter.com/byN6mvXmYJ
— Mahesh Babu (@urstrulyMahesh) August 31, 2024
ఇక గౌతమ్ తల్లి నమ్రత కూడా ఇన్‌స్టా వేదికగా విష్ చేశారు. "హ్యాపీ బర్త్‌డే మై సన్. నీ విషయంలో మేమెంతో ఆనందిస్తున్నాం. ఈ టైమ్ మనకు చాలా స్పెషల్. జీవితంలో నువ్వు ఇలాగే ప్రకాశించాలని కోరుకుంటున్నాను. లవ్ యూ" అంటూ స్పెషల్ నోట్ రాసుకొచ్చారు.
లండన్‌లో గౌతమ్ ఫస్ట్ పెర్ఫామెన్స్
Mahesh Babu Son Gautam First Performance: సూపర్ స్టార్ మహేశ్ బాబు తనయుడు గౌతమ్ తన కెరీర్లో తొలిసారి స్టేజ్ పెర్ఫార్మెన్స్ ఇచ్చాడు. లండన్ యూనికార్న్ థియేటర్‌లో గౌతమ్ ఘట్టమనేని పెర్ఫార్మెన్స్ చేశాడు. తమ ముద్దుల కుమారుడి టాలెండ్ ప్రత్యక్షంగా వీక్షించేందుకు మహేశ్ ఫ్యామిలీ లండన్ వెళ్లిపోయింది. ఈ సందర్భంగా ఫ్యామిలీ మొత్తం కలిసి దిగిన ఫొటోలను ఆయన సతీమణి నమ్రతా శిరోద్కర్ సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఈ షోకు మహేశ్, నమ్రతతోపాటు సితారా, ఫ్యామిలీ ఫ్రెండ్స్ హాజరయ్యారు.
అయితే గౌతమ్ ఇప్పటికే టాలీవుడ్లో చైల్డ్ ఆర్టిస్ట్‌గా ఎంట్రీ ఇచ్చాడు. '1 నేనొక్కడినే' సినిమాలో జూనియర్ మహేశ్‌గా కనిపించాడు. ఇక గౌతమ్ ఇటీవల గ్రాడ్యుయేషన్ కూడా పూర్తి చేసుకున్నాడు. ఈ గ్రాడ్యుయేషన్ ఈవెంట్‌కు కూడా మహేశ్, నమ్రత హాజరయ్యారు. దీనికి సంబంధించిన ఫొటోలు మహేశ్ బాబు సోషల్ మీడియాలో షేర్ చేశారు. 'గర్వంతో నా హృదయం ఉప్పొంగుతోంది. గ్రాడ్యుయేషన్ పూర్తి చేసినందుకు అభినందనలు, తర్వాతి అధ్యాయం నీ చేతుల్లోనే ఉంది. మరిన్ని శిఖరాలను అధిరోహిస్తావని ఆశిస్తున్నా. ఒక తండ్రిగా నిన్ను చూసి గర్వపడుతున్నా' అంటూ పోస్టు చేశారు.