ETV Bharat / entertainment

ఘట్టమనేని వారి వివాహ ఆహ్వానము - అందరూ ఆహ్వానితులే! - Ghattamaneni Wedding Invitation - GHATTAMANENI WEDDING INVITATION

ఘట్టమనేని వారి ఇంట పెళ్లి బాజా మోగనుంది! ప్రస్తుతం ఈ పెళ్లికి సంబంధించిన వివాహ పత్రిక చక్కర్లు కొడుతోంది. ఈ వివాహ వేడుకకు అందరూ ఆహ్వానితులే. ఏంటి పెళ్లి ఎవరిదో అర్థం కాలేదా? పూర్తి వివరాలు స్టోరీలో చదివేయండి.

source ETV Bharat
Murari Movie rerelease (source ETV Bharat)
author img

By ETV Bharat Telugu Team

Published : Jul 18, 2024, 2:07 PM IST

Mahesh Babu Rerelease Movie Murari : సూపర్ స్టార్ మహేశ్​ బాబు పుట్టినరోజు(ఆగస్ట్​ 9) సంద‌ర్భంగా ప‌లు స‌ర్‌ప్రైజ్‌లు ఉండ‌బోతున్న‌ట్లు తెలిసింది. రాజమౌళి SSMB 29 చిత్రానికి సంబంధించి ఆఫీషియ‌ల్ అనౌన్స్‌మెంట్​, షూటింగ్ డీటెయిల్స్, యాక్ట‌ర్స్‌తో పాటు పలు విష‌యాల‌పై స్పెషల్ అనౌన్స్​మెంట్ చేయనున్నట్లు తెలిసింది. దీంతో పాటే మరో సర్​ప్రైజ్ కూడా ఉండనుంది. ఈ మధ్య స్టార్ హీరోల బర్త్​డే సందర్భంగా వారి హిట్ చిత్రాలను రీరిలీజ్ చేస్తున్నారు. అలా ఇప్పుడు మహేశ్ పుట్టినరోజు(Mahesh Babu Birthday) సందర్భంగా ఆయన కెరీర్​లోనే బ్లాక్ బస్టర్ చిత్రం మురారీ రీరిలీజ్​కు సిద్ధం చేశారు. దీనిపై అధికార ప్రకటన కూడా చేశారు. దాదాపు మూడు వంద‌ల‌కుపైగా థియేట‌ర్ల‌లో ఈ మూవీ రీ రిలీజ్ కానున్న‌ట్లు స‌మాచారం. అయితే ఈ చిత్రంలో దాదాపు 18 నిమిషాలు ట్రిమ్ చేశారు.

ఈ నేపథ్యంలో పలువురు అభిమానులు రీరిలీజ్ ను వినూత్నంగా ప్లాన్ చేస్తున్నారు. మురారి వివాహ ఆహ్వాన పత్రికను క్రియేట్‌ చేసి, అభిమానం చాటుకున్నారు. ప్రస్తుతం ఈ పత్రిక సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతోంది. ఇందులో ఘట్టమేని సత్యనారాయణ(సత్తిపండు) కనిష్ఠ కుమారుడు, వరుడు : మురారిని, చంటి – అన్నపూర్ణమ్మ దంపతుల కనిష్ట పుత్రిక చి||లా|| సౌ. వసుంధరకు ఇచ్చి శ్రీ క్రోధినామ సంవత్సర శుక్ల పక్ష త్రయోధశి నాడు అనగా ఆగస్టు 9న పూర్వ ఆషాఢ లగ్నమందు వివాహం జరిపించుటకు అభిమానులు నిశ్చయించినారు. కావున తామెల్లరు కుటుంబ సమేతంగా బుంధుమిత్రులతో కలిసి మీ అభిమాన థియేటర్లకు వచ్చి నూతన వధూవరులను పేపర్ ముక్కలతో దీవించమని కోరుతున్నాము. విందు థియేటర్​లో పాప్కార్న్​, కూల్డింగ్ర్​, సమోసాలు ఇతర చిరుతిళ్లు. అని ఆహ్వాన పత్రికను ముద్రించారు.

ప్రస్తుతం ఈ వెడ్డింగ్‌ కార్డ్స్‌ అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి. కాగా, మహేశ్‌ హీరోగా కృష్ణవంశీ తెరకెక్కించిన ఈ సూపర్‌ నేచురల్‌ ఫ్యామిలీ డ్రామా 2001 ఫిబ్రవరి 17న విడుదలైంది. స్పెషల్‌ జ్యూరీ విభాగంలో మహేశ్‌ను నంది పురస్కారం వరిచింది.

టికెట్​ బుకింగ్స్​లో 'కల్కి' ఆల్​టైమ్​ రికార్డ్​ - ఎన్ని అమ్ముడుపోయాయంటే?

ప్రభాస్ లైనప్​లో చిన్న మార్పు - ఆ స్టార్ డైరెక్టర్​ సినిమా వెనక్కి! - Prabhas Movies Lineup

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.