ETV Bharat / entertainment

ఓటీటీలోకి మరో సైకో థ్రిల్లర్​ సిరీస్​- LSD స్ట్రీమింగ్​ ఎప్పట్నుంచంటే ? - LSD Trailer

LSD Web Series OTT Streaming : లవ్​ డెత్​ సెక్స్​ పేరుతో ఓటీటీలో మరో కొత్త వెబ్​సిరీస్​ సందడి చేయనుంది. సరికొత్త జానర్​లో రూపొందిన ఈ సిరీస్​ను ఫిబ్రవరి 2న విడుదల చేయనున్నారు మేకర్స్​. మరి ఇది ఏ ఓటీటీ ప్లాట్​ఫామ్​లో స్ట్రీమ్​ కానుందంటే..

LSD OTT Release Date
LSD Web Series OTT Streaming
author img

By ETV Bharat Telugu Team

Published : Feb 1, 2024, 4:50 PM IST

LSD Web Series OTT Streaming : ఈ మధ్యకాలంలో థియేటర్లకు వెళ్లి సినిమాలు చూసే వారికంటే ఓటీటీ ప్లాట్​ఫామ్​లలో ఆయా సినిమాలు రిలీజయ్యాక చూసేవారి సంఖ్య ఎక్కువగా ఉంటుంది. దీనినే క్యాష్​ చేసుకుంటున్నాయి చాలావరకు ఓటీటీ సంస్థలు. ఇందుకోసం డిఫరెంట్​ థీమ్స్, కాన్సెప్ట్స్‌​తో సినిమాలు, వెబ్​సిరీస్​లను తెరకెక్కించి తమ సొంత ప్లాట్​ఫామ్స్​ వేదికగా రిలీజ్ చేస్తున్నాయి. ఇదిలాఉంటే ఈవారం ఏకంగా 21 సినిమాలు, వెబ్​సిరీస్​లు వివిధ ఓటీటీల వేదికగా రిలీజ్​ కానున్నాయి. ఈ క్రమంలోనే సరికొత్త జానర్​లో తెరకెక్కిన 'ఎల్​ఎస్​డీ' అనే సైకలాజికల్ థ్రిల్లర్​ వెబ్​సిరీస్​ను ఫిబ్రవరి 2న ప్రముఖ ఓటీటీ ప్లాట్​ఫామ్​లో​ విడుదల చేయనున్నట్లు ప్రకటించారు మేకర్స్​. దీనికి సంబంధించిన ట్రైలర్​ను తాజాగా రిలీజ్​ చేశారు.

స్టోరీ ఏంటంటే : ఎల్​ఎస్​డీ ట్రైలర్​ ప్రారంభంలోనే ఒక బూతు పదాన్ని చూపించారు. హిందీ, ఇంగ్లిష్​ భాషలో రాసి ఉన్న ఆ వర్డ్​ను చూపించి వెబ్​సిరీస్​పై కాసింత క్యూరియాసిటీని కల్పించే ప్రయత్నం చేశారు. ఆ తర్వాత లవ్​, సెక్స్​, అమ్మ సెంటిమెంట్​లతో కూడి ఉన్న సీన్లను ట్రైలర్​లో చూపించారు. మూడు జంటల మధ్య జరిగే ఉత్కంఠమైన సన్నివేశాలు, ఫారెస్ట్ ట్రిప్, మర్డర్స్, ఎవరు హత్య చేశారనే సస్పెన్స్‌తో ఈ సైకాలజికల్​ థ్రిల్లర్​పై ఇంట్రెస్ట్​ కలిగేలా చేశారు దర్శకుడు. అంతేకాకుండా ఇందులో ఓ జోకర్​ పాత్రను చూపిస్తూ, దేశముదురులోని ఆలీ చెప్పే డైలాగ్స్​ వంటివి సిరీస్​లో హైలైట్​గా నిలవనున్నాయా అనిపించేట్లుగా ట్రైలర్​ను విడుదల చేశారు. ఇక నిర్మాత దిల్​రాజు చెప్పిన డ్యాన్సు వేనుమా అనే పాట రీమిక్స్‌తో డైలాగ్స్, రాముడి వేషధారణలో అబ్బని తీయన దెబ్బ పాటకు పేరడీ డ్యాన్స్, బ్రిటిష్​ సోల్జర్​ ఆర్​ఆర్​ఆర్​లోని నాటు నాటు పాట రీమిక్స్​కు స్టెప్పులేయడం, ఇలా ప్రతిదీ ఆసక్తిని రేకెత్తించేలా ఉన్నాయి. మొత్తానికి ఎల్ఎస్‌డీ ట్రైలర్​ను చూస్తుంటే ఇది ఒక సైకలాజికల్​ థ్రిల్లర్​ కాన్సెప్టుతో డార్క్ కామెడీ వెబ్​సిరీస్​గా రూపొందిందని అర్థమవుతోంది.

ఏ ఓటీటీలో అంటే? : ఎల్​ఎస్​డీ(లవ్​ డెత్​ సెక్స్​)- టైటిల్​తో తెరకెక్కిన ఈ వెబ్​సిరీస్​ను శివ కోన డైరెక్ట్ చేశారు. అనిల్ మోదుగ, శివ కోన కలిసి నిర్మించారు. ప్రవీణ్​ మణి, శశాంక్​ తిరుపతి మ్యూజిక్​ అందించారు. ఇందులో ప్రాచీ టకర్​, నేహా దేశ్​ పాండే, ప్రభాకర్​, కునల్​, అభిలాశ్​ బండారి, రమ్య దినేశ్​ ప్రధాన పాత్రల్లో నటించారు. హీరోయిన్‌కు తల్లిపాత్రలో ఐ డ్రీమ్​ యూట్యూబ్​ ఛానల్​ యాంకర్ అంజలి నటించారు. ఇక ఫిబ్రవరి 2 నుంచి ప్రముఖ ఓటీటీ వేదిక ఎమ్ఎక్స్ ప్లేయర్‌(MX Player)లో 'ఎల్​ఎస్​డీ' వెబ్​సిరీస్​ స్ట్రీమింగ్​ కానుంది.

ఏంటి జ్యోతి రాయ్ వయసు 38 కాదా? రియల్​ ఏజ్​ చెప్పి షాకిచ్చిన నటి!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.