LONGEST RUNNING TV SERIAL : స్టోరీ లైన్ ఇంటరెస్టింగ్‌గా ఉంటే సంవత్సరాలు కాదు దశాబ్దాలు దాటినా ఆదరణ తగ్గదు. దానికి ఉదాహరణే క్రైమ్ పెట్రోల్ సీరియల్. 1998లో మొదలై 2018 వరకూ టెలికాస్ట్ అయిన "సీఐడీ" సీరియల్‌ను స్ఫూర్తిగా తీసుకుని వచ్చింది క్రైమ్ పెట్రోల్. 2003 నుంచి 2024 వరకూ టెలికాస్ట్ అయి రికార్డ్ సృష్టించింది. ఇండియన్ సీరియల్స్‌లో అత్యధిక కాలం ప్రసారమైన సీరియల్‌గా పేరు తెచ్చుకుంది.
మొత్తం ఏడు సీజన్లుగా టెలికాస్ట్ అయిన ఈ షో తొలి ఎపిసోడ్ సోనీ టీవీలో 2003 మే9న ప్రసారమైంది. అలా 21 ఏళ్ల పాటు అంటే 2024 జనవరి 19 వరకూ 2032 ఎపిసోడ్స్‌ను ప్రేక్షకులు ఆదరించారు. ఈ క్రైమ్ పెట్రోల్‌లో టెలికాస్ట్ అయ్యే ఒక్కో ఎపిసోడ్ 30 నుంచి 40 నిమిషాల నిడివి ఉంటుంది. 2003 నుంచి 2006 వరకూ మూడేళ్ల పాటు తొలి సీజన్ టెలికాస్ట్ అయితే, నాలుగో సీజన్ ఒక్కటే ఏడేళ్ల పాటు టెలికాస్ట్ అయింది. అంతటి సక్సెస్‌ఫుల్ టీఆర్పీ రేటింగ్స్ సాధించిన షో చివరి రెండు సీజన్ల(ఆరు, ఏడు)కు మాత్రం కాస్త పాపులారిటీ తగ్గింది. వరుసగా రెండు సీజన్లు డిజాస్టర్ ఫీడ్ బ్యాక్ అందుకోవడంతో ఇక షోను టెలికాస్ట్ చేయడం ఆపేయాలనే నిర్ణయం తీసుకున్నారు నిర్వాహకులు.
ఈ సీరియల్‌లో దివాకర్ పందిర్, శక్తి ఆనంద్, సాక్షి తన్వర్, అనూస్ సోనీ తదితరులు కీలక పాత్రల్లో పోషించారు. ఇంకా ఈ సీరియల్‌లో బాలీవుడ్ స్టార్ హీరో అయిన రణ్‌వీర్ సింగ్, ఒకప్పటి హీరోయిన్ జూహీ చావ్లా అతిథి పాత్రల్లో కనిపించి మెప్పించారు. వాస్తవంగా జరిగిన కథలను ఆధారంగా చేసుకుని ఈ క్రైమ్ పెట్రోల్ సీరియల్‌ను తెరకెక్కించేవారు. సుబ్రమణియన్ ఎస్ అయ్యర్ క్రియేటర్‌గా వ్యవహరిస్తే, దర్శన్‌రాజ్ దర్శకత్వం వహించేవారు.
వాస్తవ కథలకు దగ్గరగా స్క్రీన్ ప్లే ఉండటంతో కొన్ని సార్లు వివాదాలను కూడా ఎదుర్కోవాల్సి వచ్చింది. దిల్లీ గ్యాంగ్ రేప్ కేసు, శ్రద్ధావాకర్ మర్డర్ కేసు లాంటివి షో నిర్వాహకులకు ఇబ్బందులు తెచ్చిపెట్టాయి. ఫలితంగా కొన్ని సార్లు ఆ ఎపిసోడ్ల ప్రసారాన్ని మధ్యలోనే ఆపేశారు. అయితే వివాదాలను ఎదుర్కొన్నప్పటికీ అత్యధిక కాలం పాటు ప్రసారమైన సీరియల్‌గా క్రైమ్ పెట్రోల్ నిలిచింది.
OTTలో దూసుకెళ్తోన్న క్రైమ్ కామెడీ డ్రామా - వచ్చిరాగానే టాప్‌లో ట్రెండింగ్!