ETV Bharat / entertainment

'కూలి' నాగార్జున వైల్డ్​ లుక్​ షూటింగ్​ వీడియో లీక్​ - రోలెక్స్​ తరహాలో క్రూరంగా చంపేస్తూ! - Coolie Nagarjuna Video Leaked - COOLIE NAGARJUNA VIDEO LEAKED

Coolie Movie Nagarjuna Video Leaked : 'కూలి' సినిమాలోని నాగార్జున పాత్రకు సంబంధించిన ఓ వీడియో లీక్ అయింది. ఇందులో చుట్టూ వందల మంది ఉండగా నాగ్​ మధ్యలో నిలబడి ఓ వ్యక్తిని అతి కూర్రంగా కొడుతూ కనిపించారు. సుత్తితో బలంగా ఆ వ్యక్తి ముఖంపై కొడుతూ, ఏదో డైలాగ్ చెబుతూ కనిపించారు. పూర్తి వివరాలు స్టోరీలో.

source ETV Bharat
Rajinikanth Nagarjuna Lokesh Kanagaraj (source ETV Bharat)
author img

By ETV Bharat Telugu Team

Published : Sep 18, 2024, 4:07 PM IST

Coolie Movie Nagarjuna Video Leaked : అక్కినేని నాగార్జున ప్రస్తుతం తనలోని కొత్త కోణాన్ని చూపించేందుకు సిద్ధమవుతున్నారు. ఇప్పటికే ఆయన శేఖర్ కమ్ముల దర్శకత్వంలో రానున్న కుబేరలో, లోకేశ్ కనగరాజ్​ డైరెక్షన్​లో తెరకెక్కుతోన్న కూలిలో కీలక పాత్రలు పోషిస్తున్న సంగతి తెలిసిందే. ఈ రెండు చిత్రాల్లోనూ ఆయన భిన్నంగా కనిపించబోతున్నారని మొదటి నుంచి జోరుగా ప్రచారం సాగుతోంది.

కూలి సినిమా విషయానికొస్తే ఇందులో నాగ్​ సైమన్ అనే పాత్రలో కనిపించనున్నారు. వైల్డ్​గా కనిపిస్తారనే వార్తలు కూడా వచ్చాయి. ఈ క్రమంలోనే తాజాగా కూలి చిత్రంలో నాగార్జున పాత్ర ఎంత వైల్డ్​గా ఉండబోతుందో తెలిసేలా ఓ వీడియో బయటకు లీక్ అయింది. నాగార్జునపై చిత్రీకరిస్తున్న ఓ యాక్షన్ వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఇందులో చుట్టూ వందల మంది ఉండగా నాగ్​ మధ్యలో నిలబడి ఓ వ్యక్తిని అతి కూర్రంగా కొడుతూ కనిపించారు. సుత్తితో బలంగా ఆ వ్యక్తి ముఖంపై కొడుతూ, ఏదో డైలాగ్ చెబుతూ కనిపించారు.

ఇది చూసిన నెటిజన్లు విక్రమ్​ సినిమాలో సూర్య రోలెక్స్​ తరహాలో నాగ్ పాత్ర క్రూరంగా ఉందంటూ కామెంట్లు చేస్తున్నారు. ఆ వీడియోనూ తెగ షేర్ చేస్తున్నారు. సినిమా పక్కా రూ.1000 కోట్లు అని చెబుతున్నారు.

అంతకుముందు అఫీషియల్​గా విడుదల చేసిన ఫస్ట్ లుక్ పోస్టర్​లో నాగార్జున పూర్తి డిఫరెంట్ లుక్​లో కనిపించారు. చేతికి ఓ గోల్డెన్ కలర్ వాచీ పెట్టుకుంటూ, మరో చేతిలో ఓ ఎర్రటి స్కార్ఫ్​తో చాలా సీరియస్​గా కనిపించారు. చాలా రోజుల తర్వాత ఆయన ఈ రగ్డ్​ లుక్​లో పక్కా మాస్​గా కనిపించారు.

కాగా, రజనీ కాంత్ - లోకేశ్​ కనగరాజ్ కాంబోలో రానున్న ఈ కూలి చిత్రంలో శ్రుతిహాసన్​, ఉపేంద్ర, సత్యరాజ్​, మంజుమ్మెల్ బాయ్స్ ఫేమ్ సౌబిన్ షాహిర్ కూడా కీలక పాత్రలు పోషిస్తున్నారు. సినిమాను సన్ పిక్చర్స్ నిర్మిస్తోంది. గతంలోనే రజనీకాంత్ వీడియోతో మూవీ టైటిల్​ను అనౌన్స్ చేశారు. అనిరుధ్ రవిచందర్ మ్యూజిక్ అందిస్తున్నారు. ఇక నాగార్జున విషయానికి వస్తే ఈ ఏడాది సంక్రాంతికి నా సామి రంగ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చి హిట్ అందుకున్నారు.

'స్పిరిట్'​ బడ్జెట్​పై లేటెస్ట్​ బజ్​ - ఏకంగా ఎన్ని వందల కోట్లంటే? - Spirit Movie Budget

హిందీలో 'స్త్రీ 2' సంచలన కలెక్షన్స్​ - హైయెస్ట్ గ్రాస్​ ఫిల్మ్​గా రికార్డ్​ - Stree 2 Movie Collections

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.