ETV Bharat / entertainment

రజనీ కాంత్ వేలు పెట్టడం వల్లే నా సినిమా ఫ్లాప్!​ - ప్రముఖ దర్శకుడు ఆరోపణలు - Rajinikanth Flop Movie

Rajinikanth KS Ravikumar : సూపర్ స్టార్ రజనీ కాంత్ జోక్యం చేసుకోవడం వల్లే ఫ్లాప్ అయిన సినిమా ఇదే!

author img

By ETV Bharat Telugu Team

Published : 2 hours ago

source ETV Bharat
Rajinikanth (source ETV Bharat)

Rajinikanth KS Ravikumar : సూపర్ స్టార్ రజనీ కాంత్‌పై కోలీవుడు స్టార్ డైరెక్టర్​ కె.ఎస్‌.రవికుమార్‌ ఆరోపణలు చేశారు. తమ కాంబోలో వచ్చిన లింగ ఫ్లాప్ ఎందుకు అయిందో వివరించారు. ఆ సినిమా ఎడిటింగ్‌లో రజనీ కాంత్‌ జోక్యం చేసుకున్నారని పేర్కొన్నారు. ఓ యూట్యూబ్‌ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో రవి కుమార్‌ ఈ ఆరోపణలు చేస్తూ, సినిమా పరాజయం గురించి చెప్పుకొచ్చారు.

"లింగ్ ఎడిటింగ్‌ విషయంలో సూపర్ స్టార్ రజనీ కాంత్‌ జోక్యం చేసుకున్నారు. సీజేఐ (కంప్యూటర్‌ గ్రాఫిక్స్‌) చేసేందుకు నాకు ఏ మాత్రం కూడా సమయం ఇవ్వలేదు. సెకండాఫ్‌ మొత్తాన్ని పూర్తిగా మార్చేశారు. అనుష్కతో ఉండాల్సిన ఒక సాంగ్​, క్లైమాక్స్‌లో వచ్చే ట్విస్ట్‌ను తీసేశారు. ఆర్టిఫిషియల్​గా ఉండే బెలూన్‌ జంపింగ్‌ సీన్‌ కూడా ఆయనే జోడించారు. మొత్తంగా లింగ చిత్రాన్ని గందరగోళం చేసేశారు" అని రవి కుమార్‌ కీలక కామెంట్స్​ చేశారు. ప్రస్తుతం ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్​గా మారాయి.

కాగా, దర్శకుడు కె.ఎస్‌.రవి కుమార్‌కు కోలీవుడ్‌లో మంచి దర్శకుడిగా గుర్తింపు ఉంది. రజనీ కాంత్‌తో కలిసి ఆయన గతంలో ముత్తు, నరసింహ వంటి సూపర్ హిట్ చిత్రాలను తెరకెక్కించి భారీ విజయాన్ని సాధించారు. అనంతరం వీరి కాంబినేషన్​లో 2014లో లింగ సినిమా వచ్చింది. భారీ బడ్జెట్‌లో రూపొందిన ఈ యాక్షన్‌ కామెడీ చిత్రంలో రజనీ కాంత్‌ ద్విపాత్రాభినయంలో కనిపించి మెప్పించారు. సోనాక్షి సిన్హా, అనుష్క హీరోయిన్లుగా నటించారు.

భారీ అంచనాలతో విడుదలైన ఈ మూవీ బాక్సాఫీస్‌ వద్ద రూ.150 కోట్లకు పైగా గ్రాస్‌ కలెక్షన్లను అందుకుంది. మంచి వసూళ్లనే అందుకున్నప్పటికీ డిజాస్టర్​ టాక్​ను అందుకుంది. ఈ మూవీ రిజల్ట్​ గురించి 2016లో రవి కుమార్‌ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ - వరల్డ్ వైడ్​గా ఈ చిత్రం రూ.150 కోట్లకు పైగా కలెక్షన్లను అందుకుంది. అది అంత ఈజీ కాదు. కలెక్షన్ల పరంగా మా చిత్రం సూపర్‌ హిట్‌" అని చెప్పుకొచ్చారు.

Rajinikanth Vettaiayan Movie : ప్రస్తుతం రజనీ కాంత్​ 'వేట్టయాన్‌', 'కూలీ' చిత్రాల్లో నటిస్తున్న సంగతి తెలిసిందే. 'వెేట్టయాన్‌' అక్టోబర్‌ 10న విడుదల కానుంది. ఇందులో రజనీ పవర్‌ ఫుల్ ఎన్‌కౌంటర్ ఆఫీసర్​గా కనిపించనున్నారు. రానా దగ్గుబాటి, అమితాబ్ బచ్చన్, ఫహాద్ ఫాజిల్, మంజు వారియర్, రితికా సింగ్ తదితరులు ఇతర కీలక పాత్రలు పోషిస్తున్నారు. టి.జ్ఞాన్​వేల్ దర్శకత్వం వహించారు.

Rajinikanth Coolie Movie : 'కూలి' సినిమ విషయానికొస్తే - ఇందులో నాగార్జున, శ్రుతిహాసన్‌, సౌబిన్‌ షాహిర్‌ సత్యరాజ్‌, ఉపేంద్ర తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. బంగారం స్మగ్లింగ్‌ నేపథ్యంతో సాగే యాక్షన్‌ థ్రిల్లర్‌ ఇది.

రజనీకాంత్ హెల్త్ అప్డేట్- ఆసుపత్రి నుంచి తలైవా డిశ్చార్జి - Rajinikanth Health Update

రజనీకాంత్​ 'వేట్టాయన్'పై కోర్టులో కేసు - ఎందుకంటే? - Vettaiyan Movie Court Case

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.