ETV Bharat / entertainment

'షూటింగ్ మధ్యలో చదువుకునేదాన్ని - అమ్మ నా సందేహాలు తీర్చేది' - Laapata Ladies Nitashi Goel - LAAPATA LADIES NITASHI GOEL

Laapata Ladies Nitashi Goel : చిన్న సినిమాగా విడుదలై భారీ హిట్ అందుకున్న చిత్రం 'లాపతా లేడీస్'. ఈ సినిమాను బాలీవుడ్ మిస్టర్ ఫర్ ఫెక్ట్ ఆమిర్ ఖాన్ మాజీ భార్య కిరణ్ రావ్ తెరకెక్కించారు. ఈ సినిమాలో పెళ్లి కూతురు పాత్రలో ఆకట్టుకున్నారు యువనటి నితాన్షి గోయల్. అయితే ఈమె తాజాగా ఓ ఇంటర్వ్యూలో తన గురించి ఓ ఆసక్తికరమైన విషయాన్ని పంచుకున్నారు. ఆ విశేషాలు మీ కోసం.

Laapata Ladies Nitashi Goel
Nitashi Goel (Getty Images)
author img

By ETV Bharat Telugu Team

Published : Jun 19, 2024, 4:11 PM IST

Laapata Ladies Nitashi Goel : బాలీవుడ్ స్టార్ హీరో ఆమిర్ ఖాన్ మాజీ భార్య కిరణ్ రావ్ డైరెక్షన్​లో తెరకెక్కిన చిత్రం 'లాపతా లేడీస్'. ఈ కామెడీ సైటెరికల్ ఫీల్ గుడ్ మూవీ నిర్మాణంలో ఆమిర్ ఖాన్ కూడా భాగస్వామ్యమయ్యారు. మార్చి 1న రిలీజైన ఈ సినిమా ప్రేక్షకుల మన్ననలు పొందింది. అయితే ఈ సినిమాలో పూల్ కుమారి అమాయక పాత్రలో ఒదిగిపోయిన యువనటి నితాన్షి గోయల్ గురించి ఇప్పుడొక ఆసక్తికర విషయం సోషల్ మీడియాలో చర్చనీయాంశమైంది. అదేంటంటే?

'లాపతా లేడీస్' మూవీ షూటింగ్ జరిగినప్పుడు తాను 9వ తరగతి పరీక్షలకు ప్రిపేర్ అయ్యానని నితాన్షి గోయల్ తెలిపారు. సినిమా చిత్రీకరణ మధ్య దొరికిన విరామంలో పరీక్షలకు సిద్ధమయ్యానని ఆమె ప్రముఖ యూట్యూబర్ రణ్​వీర్ అల్లాబదియా పోడ్​కాస్ట్​లో వెల్లడించారు. ఆ షూటింగ్​ సమయంలోనే తాను పరీక్షలకు హాజరయ్యాని చెప్పుకొచ్చారు. అలాగే షూటింగ్ పూర్తయిన ఒక రోజు తర్వాత కూడా పరీక్షలను రాశానని అన్నారు.

"నేను ఎక్కువగా షూటింగ్ స్పాట్​కు సైన్స్, మ్యాథ్స్ బుక్స్​ను తీసుకెళ్లేదాన్ని. నా తల్లి టీచర్. ఆమె నాకు సందేహాలు ఉంటే చెప్పేది. షూటింగ్ స్పాట్​లోనే 9వ తరగతి పరీక్షలకు సన్నద్ధమయ్యా." అని యువ నటి నితాన్షి గోయల్ చెప్పుకొచ్చారు. కాగా, 16 ఏళ్ల వయసులో ఈ అమ్మడు అటు సినిమాల్లోనూ, ఇటు చదువును రెండింటి బ్యాలెన్స్ చేస్తున్నారని నెటిజన్లు సోషల్ మీడియాలో కామెంట్లు పెడుతున్నారు.

'లాపతా లేడీస్' సినిమాలో నితాన్షి ఓ అమాయక యువతి పాత్రలో నటించారు. పెళ్లి కూతురుగా ఆమె నటనపై ప్రశంసలు దక్కాయి. కిరణ్ రావ్ డైరెక్షన్​లో తెరకెక్కిన ఈ సినిమా మంచి విజయాన్ని సాధించింది. ఇందులో నితాన్షితో పాటు ప్రతిభా రంతా, స్పర్శ్‌ శ్రీవాస్తవ, ఛాయా కదమ్‌, రవి కిషన్‌ లాంటి స్టార్స్ కీలక పాత్రలు పోషించారు.

వెబ్ సిరీస్ ల్లో అదరగొట్టిన నితాన్షి
'లాపతా లేడీస్‌' సినిమా కంటే ముందు నితాన్షి గోయల్ టీవీ షోలు, వెబ్ సిరీస్ ల్లో నటించారు. అలాగే 'ఎంఎస్ ధోనీ ది లన్ టోల్డ్ స్టోరీ', 'ఇందూ సర్కార్' , 'మైదాన్' వంటి చిత్రాల్లో కనిపించారు. 'ఇన్ సైడ్ ఎడ్జ్', 'తాప్కీ ప్యార్ కీ' వంటి టీవీ షోల్లోనూ నటించి మెప్పించిందీ ఈ బ్యూటీ. అలాగే నితాన్షి గోయల్​కు సోషల్ మీడియాలో మంచి ఫాలోయింగ్ ఉంది. ప్రస్తుతం ఈమె ఇన్ స్టాగ్రామ్ ఖాతాకు మిలిమన్లలో ఫాలోవర్లు ఉన్నారు.

ఒకే పాటలో దుమ్ములేపిన ఐదుగురు స్టార్​ హీరోలు - ఎవరెవరు? ఏ సినిమా? - మీకు తెలుసా? - Five Heros Dance in One Song

హాలీవుడ్ ఆల్ టైమ్​ క్లాసిక్ మూవీస్- పక్కా ఇన్స్పిరేషన్​! - Inspirational movies

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.