Kubera Movie Nagarjuna First Look : కోలీవుడ్ స్టార్ హీరో ధనుశ్, డైరెక్టర్ శేఖర్ కమ్ముల కాంబోలో వస్తున్న లేటెస్ట్ మూవీ 'కుబేర'. ఇప్పటికే ఈ సినిమా నుంచి మేకర్స్ టైటిల్ రివీల్ వీడియోను రిలీజ్ చేసి అభిమానులను ఆకట్టుకున్నారు. ఈ నేపథ్యంలో ఈ సినిమాలో నటిస్తున్న మరో స్టార్ హీరో ఫస్ట్ లుక్‌ను రివీల్ చేశారు. హీరో నాగార్జున ఫస్ట్ లుక్‌ను ఓ వీడియో ద్వారా చూపించారు.
ఓ వర్షం కురుస్తున్న రోజు, హీరో నాగార్జున గొడుగు పట్టుకుని నిల్చున్నారు, ఆయన వెనుక ఉన్న కంటైనర్ మెత్తం కరెన్సీ నోట్లతో నిండిపోయింది. ఆయన అలా వానలో నడుస్తూ వెళ్తున్న సమయంలో ఓ నోట్ కిందపడి ఉన్నదాన్ని గమనిస్తారు. దాన్ని చూసి నాగ్ తన జేబులోని కొంత డబ్బును తీసి అక్కడ పేర్చి ఉన్న నోట్ల కట్టపై ఉంచుతారు. ఆయన లుక్ చాలా సీరియస్గా ఉంటుంది. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట ట్రెండ్ అవుతోంది.
- " class="align-text-top noRightClick twitterSection" data="">