ETV Bharat / entertainment

చెత్తలో 10 గంటలు మాస్క్ లేకుండా - కుబేర కోసం ధనుశ్ భారీ రిస్క్​! - Kubera Dhanush - KUBERA DHANUSH

Kubera Dhanush in Garbage: ధనుశ్ మరోసారి సినిమాల పట్ల తనకున్న నిబద్ధతను చూపారు. కుబేర సినిమా కోసం పెద్ద రిస్క్ చేశారు.

Kubera Dhanush in Garbage
Kubera Dhanush in Garbage (Source: ANI)
author img

By ETV Bharat Telugu Team

Published : May 6, 2024, 11:32 AM IST

Updated : May 6, 2024, 3:02 PM IST

Kubera Dhanush in Garbage: ఏ మూవీలో నటించినా తను నటించిన పాత్ర మాత్రమే కనిపించేలా చేయడం తమిళ్ స్టార్ హీరో ధనుశ్​ ప్రత్యేకత. అయితే తన కారెక్టర్ కోసం ధనుశ్​ ఎలాంటి రిస్క్ అయినా తీసుకుంటారని ఇండస్ట్రీలో టాక్ ఉంది. ప్రస్తుతం శేఖర్ కమ్ముల దర్శకత్వంలో తెరకెక్కుతున్న 'కుబేర' షూటింగ్​లో కూడా ధనుశ్​ ఇలాంటి సాహసమే చేశారు. నేచురాలిటీ కోసం ఓ సీన్​ను నిజంగానే ముంబయిలోని అత్యంత పెద్ద డంప్‌యార్డ్‌లో షూటింగ్‌ చేశారట. ఆ సీన్స్​ సహజంగా రావడం కోసం ధనుశ్​ 10 గంటల పాటు మాస్క్‌ కూడా లేకుండా డంప్‌యార్డ్‌లో నటించారని తెలిసింది.

అయితే సినిమాలో ధనుశ్ పాత్ర కోసం ఆయన దీన స్థితిలో ఉన్నాడని రియాల్టీకి దగ్గరగా చూపించడం కోసం ఈ సీన్ అక్కడ షూటింగ్ చేశారు. 10 గంటల పాటు కనీసం మాస్క్ కూడా ధరించకుండా ధనుశ్​అక్కడ తన షెడ్యూల్ పూర్తి చేశారు. అక్కడ ఘాట్ చేసిన సీన్ అద్భుతంగా చాలా సహజంగా వచ్చిందని ఆ మూవీ టీం పేర్కొంది. ఈ చిత్రాన్ని పాన్ ఇండియా ఫిల్మ్​గా తెలుగు, తమిళం, హిందీ భాషల్లో విడుదల చేయనున్నారు.

'కుబేర' ధనుశ్​కు 51వ చిత్రం. ఆ మధ్య విడుదలైన ఫస్ట్ లుక్ కూడా ఫ్యాన్స్​ను ఇంప్రెస్ చేసింది. ఇందులో ధనుశ్​తో పాటు టాలీవుడ్ కింగ్ అక్కినేని నాగార్జున కీలక పాత్రలో నటిస్తున్నారు. రీసెంట్​గా ఆయన ఫస్ట్​ పోస్టర్ కూడా రిలీజైంది. ఇక రష్మిక మందన్నా, జిమ్ సరబ్ కూడా నటిస్తున్నారు. ఈ మూవీకి దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. ఈ సినిమాను సునీల్ నారంగ్ , రామ్ మోహన్ రావు కలిపి శ్రీ వేంకటేశ్వర సినిమాస్ బ్యానర్​పై నిర్మిస్తున్నారు. జనవరి నుంచే సినిమా రెగ్యులర్ షూటింగ్ ప్రారంభంది. ప్రస్తుతం కీలకమైన షెడ్యూల్​ ముంబయిలో చిత్రీకరిస్తున్నారు. ఈ చిత్రంతో పాటు ధనుశ్ ​'రాయన్' సినిమాలో కూడా నటిస్తున్నారు. ఈ మూవీకి తనే దర్శకత్వ బాధ్యతలు కూడా చేపడుతున్నారు. ఇదొక యాక్షన్ థ్రిల్లర్​గా తెరకెక్కుతుంది

ఈ వారం OTTలోకి 15 సినిమాలు - ఆ భారీ బ్లాక్ బస్టర్ మూవీ​ కూడా! - This Week OTT Releases

ఒకేసారి రెండు కొత్త సినిమాలు సెట్స్​పైకి - Prabhas LineUp Movies

Last Updated : May 6, 2024, 3:02 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.