NTR Koratala Siva Devara Review :
నటీనటులు : ఎన్టీఆర్, జాన్వీకపూర్, సైఫ్ అలీఖాన్, శ్రుతి మరాఠే, ప్రకాశ్‌రాజ్, శ్రీకాంత్, షైన్ టామ్ చాకో తదితరులు;
సంగీతం : అనిరుధ్ రవిచందర్;
సినిమాటోగ్రఫీ : ఆర్.రత్నవేలు;
ఎడిటింగ్ : ఎ.శ్రీకర్ ప్రసాద్;
నిర్మాత : సుధాకర్ మిక్కిలినేని, కొసరాజు హరికృష్ణ, నందమూరి కల్యాణ్‌రామ్;
రచన, దర్శకత్వం: కొరటాల శివ;
ఆరేళ్ల తర్వాత ఎన్టీఆర్ సోలో హీరోగా చేసిన చిత్రం దేవర. జాన్వీ కపూర్ ఈ చిత్రంతోనే తెలుగు తెరకు పరిచయమైంది. బాలీవుడ్ స్టార్ సైఫ్ అలీఖాన్ నేరుగా తెలుగులో చేసిన చిత్రమిది. పైగా ఇప్పటికే ఎన్టీఆర్-కొరటాల కాంబోలో వచ్చిన జనతా గ్యారేజ్ ఎంతటి విజయాన్ని అందుకుందో తెలిసిందే. ఇక ఆర్ఆర్ఆర్ బ్లాక్ బస్టర్‌తో ఎన్టీఆర్ ఇమేజ్ అంతర్జాతీయ స్థాయికి ఎదిగింది. ఇలా ఇవన్నీ కలిసి రావడంతో దేవరపై ఫ్యాన్స్‌లో భారీ అంచనాలు ఏర్పడ్డాయి. మరి నేడు(సెప్టెంబర్ 27) థియేటర్లలోకి వచ్చిన దేవర ఆ అంచనాలను అందుకుందా? ఫ్యాన్స్‌ను కాలర్ ఎగరేసుకునేలా చేసిందా? ఎన్టీఆర్ ద్విపాత్రాభినయం మెప్పించిందా? అసలు ఈ సినిమా కథేంటి? థియేటర్లకు వెళ్లిన ప్రేక్షకులు ఏం అంటున్నారు? కథనంలోకి వెళ్లి తెలుసుకుందాం.
pic.twitter.com/fd47BdlR28#Devara Review
— it's cinema (@its__cinema) September 26, 2024
FIRST HALF
Rating ⭐⭐⭐⭐4/5 !!
Good with some scenes of goosebumps 🔥#JrNTR is terrific & his entry & title card 💥#SaifAliKhan, @KalaiActor & others are good too ✌️
Visuals are decent 👍
BGM by @anirudhofficial 💥🔥
Interval 👌… pic.twitter.com/ddZE1e3KFO
కథేంటంటే?(Devara Story) : ఆంధ్రప్రదేశ్, తమిళనాడు సరిహద్దులో రత్నగిరి అనే ప్రాంతం ఉంటుంది. అక్కడే సముద్రానికి ఆనుకుని ఉన్న ఓ కొండపై నాలుగు ఊర్లను కలిపి ఎర్ర సముద్రం అని పిలుస్తారు. ఆ పేరు వెనక బ్రిటీష్ కాలం నుంచే ఓ పెద్ద చరిత్ర ఉంటుంది. ఆ నాలుగు ఊళ్ల ప్రజల అవసరాల కోసం దేవర (ఎన్టీఆర్), భైర (సైఫ్ అలీఖాన్) తమ అనుచరులతో కలిసి ఎర్ర సముద్రంపై ప్రయాణం చేసే నౌకలపై ఆధారపడుతుంటారు.
అయితే ఆ నౌకల్లో అక్రమ ఆయుధాల్ని దిగుమతి చేస్తుంటుంది మురుగ (మురళీశర్మ) గ్యాంగ్. అయితే ఇలా అక్రమంగా దిగుమతి చేసే ఆయుధాల వల్ల తమకే ముప్పు కలిగిస్తుందని గ్రహించిన దేవర ఇకపై ఆ పనుల్ని చేయకూడదనే నిర్ణయిస్తాడు. చేపలు పట్టడంపై దృష్టి పెడదామని ఆదేశిస్తాడు.
కానీ భైరకు అది ఇష్టం ఉండదు. దీంతో ఈ ఇద్దరి మధ్య అంతర్యుద్ధం ప్రారంభం అవుతుంది. దీంతో దేవరను అడ్డు తొలగించి సంద్రాన్ని శాసించాలనుకుంటాడు భైర. కానీ దేవర మాత్రం అజ్ఞాతంలో ఉంటూ ప్రత్యర్థులను భయపడేలా చేస్తుంటాడు.
మరి ఆ భయం ఎన్ని తరాలు కొనసాగింది? దేవర ఎందుకు అజ్ఞాతంలో ఉన్నాడు? దేవర కోసం అతని కొడుకు వర (ఎన్టీఆర్) ఏం చేశాడు? వరని ఇష్టపడిన తంగం (జాన్వీకపూర్) ఎవరు? వంటి విషయాలు తెరపై చూడాల్సిందే.
Blockbuster Movie 👌🔥
— Ankush Gangwar (@GangwarAnkush) September 26, 2024
Interval Shows,
What the movie all NTR FANS #JhanviKapoor#DevaraReview #DevaraPart1 #DevaraStorm #devaraday@tarak9999 @DevaraMovie#DevaraOnSep27th #Devara#DevaraTickets #DevaraTrailer #DevaraBookings #DevaraUSA #DevaraStorm #DevaraJatharaaBegins… pic.twitter.com/dXUnOSBrbi
ఎలా ఉందంటే?(Devara Review) - 'దేవర' కొసం ఒక కొత్త ప్రపంచాన్ని ఆవిష్కరించారు. ఆ ప్రపంచం చుట్టూ భావోద్వేగాలు, గాఢతతో కూడిన కథను చెప్పే ప్రయత్నం చేశారు దర్శకుడు కొరటాల శివ. ఎన్టీఆర్ దీటైన పాత్రను ఎంచుకుని, దానిపై పరిపూర్ణమైన ప్రభావం చూపించారు. పాన్ ఇండియా స్థాయికి తగ్గట్టుగా విస్తృత పరిధి ఉన్న కథ ఇది. సముద్రం నేపథ్యంలో సాగే కథ కావడంతో ప్రేక్షకులకు ఓ సరికొత్త అనుభూతిని ఇచ్చింది. బ్రిటిష్ కాలం నుంచి ఎర్ర సముద్రానికి, అక్కడి ప్రజలకు ఉన్న చరిత్ర, దానికి కాపలాగా ఉండే దేవర కథను సింగప్ప(ప్రకాశ్‌రాజ్)తో చెప్పిస్తూ కథను అద్భుతంగా నడిపించారు. నడిపించిన తీరు ఆకట్టుకుంటుంది.
ఎన్టీఆర్ ఎంట్రీ సీన్ ఎలివేషన్స్, సముద్రం బ్యాక్‌డ్రాప్ గొప్ప థియేట్రికల్ అనుభూతిని పంచుతుంది. దేవర, భైర ఆ రెండు పాత్రల్ని అత్యంత శక్తిమంతంగా తెరపై ఆవిష్కరించారు. ఇద్దరి మధ్య సాగే భీకర పోరాటం, సహా ఇతర సన్నివేశాలను అద్భుతంగా చూపించారు. ఫియర్ సాంగ్, యాక్షన్ సీన్స్, ఇంటర్వెల్ సీన్స్ మరో స్థాయిలో ఉన్నాయి. మొత్తంగా ఫస్ట్ హాఫ్‌లో ఎర్ర సముద్రం కథ, దేవర, భైరవ పాత్రలు, యాక్షన్ సీన్స్, సాంగ్స్ ఇలా అన్ని సూపర్‌గా ఉన్నాయి.
సెకండాఫ్‌లో వర, తంగం పాత్రల సందడి కనిపిస్తుంది. సరదా సరదాగా సాగే కొన్ని సన్నివేశాలు, ఆ తర్వాత మళ్లీ దేవర పాత్రను చూపిస్తూ కథలో గాఢతను పెంచుతారు. ఫస్ట్ హాఫ్‌తో పోలిస్తే సెకండాఫ్ కాస్త తక్కువే. క్లైమాక్స్‌లో వచ్చే మలుపు ఊహించిందే అయినా, దానికి కొనసాగింపుగా సాగే పోరాట ఘట్టాలు, సముద్రంలో దేవర పాత్రను చూపించిన తీరు బాగా ఆకట్టుకున్నాయి. ఫైనల్‌గా దేవర, భైర పాత్రల ముగింపు ఏమిటనేది రెండో భాగం కోసం దాచి పెట్టారు.
2nd half Very nice 👌
— S (@UrsShareef) September 26, 2024
Last 30 minutes of movie ,twist 👌
Climax cliffhanger Too Too Good 👏
Theatre total shock aa twist ki 🔥
Mass audience ki feast
Anirudh Duty 🔥@tarak9999 anna one of the best performances 🤩👏
Koratala sir direction 👏#Devara #DevaraBlockbuster pic.twitter.com/SsArK0emAi
ఎవరెలా చేశారంటే ? - దేవర, వర పాత్రల్లో ఎన్టీఆర్ అద్భుతంగా నటించారు. ముఖ్యంగా దేవర పాత్రలో ఎన్టీఆర్ లుక్, పలికించిన ఎమోషన్స్, యాక్షన్ సీన్స్ సినిమాను మరో స్థాయికి తీసుకెళ్లాయి. భైర పాత్రలో సైఫ్ అలీఖాన్ గొప్పగా నటించారు. ఈ రెండు పాత్రలు ఢీ అంటే ఢీ అనేలా కొనసాగాయి.
తంగం పాత్రలో జాన్వీ కపూర్ ఎంతో అందంగా కనిపించింది. కానీ, ఆమె పాత్రకి పెద్దగా ప్రాధాన్యం లేదు. శ్రీకాంత్, ప్రకాశ్‌రాజ్, మురళీశర్మ, అజయ్, శ్రుతి తదతరులు కీలకమైన పాత్రల్లో కనిపించారు.
టెక్నికల్‌గా సినిమా హైస్టాండర్డ్‌లో ఉంది. రత్నవేలు కెమెరా పనితనం హైలైట్ అనే చెప్పాలి. విజువల్ ఎఫెక్ట్స్, ప్రొడక్షన్ డిజైన్ పనితీరుతో సరికొత్త ప్రపంచం తెరపై ఆవిష్కృతమైంది. ఇక బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్‌తో అనిరుధ్ సినిమాపై గట్టి ప్రభావం చూపించారు. సినిమాకు ఆయన మరో హీరో అని కూడా ఫ్యాన్స్ అంటున్నారు.
యాక్షన్ సీక్వెన్స్‌ను డిజైన్ చేసిన తీరు కూడా బాగా మెప్పించింది.
కొరటాల శివ మాటలు, కథా రచన, భావోద్వేగాలు బాగా ప్రభావం చూపించాయి. ‘'దేవర అడిగినాడంటే సెప్పినాడని, సెప్పినాడంటే'. '‘భయం పోవాలంటే దేవుడి కథ వినాల, భయం అంటే ఏంటో తెలియాలంటే దేవర కథ వినాల' ఇలా పలు సంభాషణలు’ ప్రేక్షకులతో థియేటర్లలో ఈలలు వేయించాయి. నిర్మాణం ఉన్నతంగా ఉంది.
#DevaraReview #DEVARA @tarak9999 @TeamKoratala
— Surya (@Pinkmen22) September 26, 2024
movie hituuuuuu bomma
BGM photography
NTR 🔥🔥🔥🔥
Koratala pen writeings 🔥🔥🔥
movie must watch in ATMOS 🔥🔥🔥🔥
Srikar prasad crispy editing 🔥🔥🔥🔥 pic.twitter.com/TGV7fvwAEX
మీరు 'దేవర'కు వెళ్తున్నారా? - ఈ 15 ఆసక్తికర విషయాలు తెలుసా? - Devara Movie Interesting Facts