ETV Bharat / entertainment

'దేవ‌ర' ఫ్యాన్స్ కాలర్ ఎగ‌రేసుకోవ‌చ్చా - సినిమా చూశాక అభిమానుల రియాక్షన్ ఇదే! - Devara Movie Twitter Review

NTR Devara Twitter Review : ఎన్టీఆర్ దేవర థియేటర్లలోకి వచ్చేసింది. దీంతో సోషల్ మీడియా అంతా అర్ధరాత్రి నుంచే షేక్ అవుతోంది. యంగ్ టైగర్ ఫ్యాన్స్ ట్వీట్లతో అంతా సందడి వాతావరణం కనిపిస్తోంది. ఇంతకీ ఈ సినిమా ట్విటర్ రివ్యూ ఎలా ఉందో చూసేద్దాం.

source ETV Bharat
NTR Devara Twitter Review (source ETV Bharat)
author img

By ETV Bharat Telugu Team

Published : Sep 27, 2024, 6:21 AM IST

Updated : Sep 27, 2024, 8:12 AM IST

NTR Devara Twitter Review : 'దేవర'తో థియేటర్లలో మాస్‌ యాక్షన్‌ హంగామా రుచి చూపించారు యంగ్ టైగర్ ఎన్టీఆర్‌. ఆయన తండ్రీకొడుకులుగా ద్విపాత్రాభినయం చేసిన ఈ పాన్‌ ఇండియా చిత్రం తాజాగా భారీ అంచనాలతో థియేటర్లలోకి వచ్చేసింది. 'ఆర్ఆర్ఆర్'తో(మల్టీస్టారర్​) మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ ఇమేజ్ అంతర్జాతీయ స్థాయికి వెళ్లిన సంగతి తెలిసిందే. ఆ సినిమా తర్వాత ఆయన నటించిన సినిమా 'దేవర'నే (Devara Part 1). దాదాపు ఆరేళ్ల తర్వాత ఎన్టీఆర్​ సోలో హీరోగా చేసిన చిత్రమిది.

ఆచార్య వంటి ఫ్లాప్ తర్వాత ఎలాగైనా గట్టి హిట్ కొట్టాలని పట్టుదలతో కొరటాల శివ తెరకెక్కించారు. యువసుధ ఆర్ట్స్, ఎన్టీఆర్‌ ఆర్ట్స్‌ సంస్థలు సంయుక్తంగా నిర్మించాయి. జాన్వీ కపూర్‌ ఈ చిత్రంతో టాలీవుడ్​కు ఎంట్రీ ఇవ్వగా, సైఫ్‌ అలీ ఖాన్‌ ప్రతినాయకుడిగా నటించారు. అయితే రిలీజ్‌కు ముందే ప్రీ సేల్స్​, అడ్వాన్స్ బుకింగ్స్‌తో పలు రికార్డులు క్రియేట్ చేసిన 'దేవ‌ర' ప్రస్తుతం పాన్ ఇండియ‌న్ లెవెల్‌లో తెలుగు, హిందీతో పాటు ఇత‌ర ద‌క్షిణాది భాష‌ల్లో రిలీజైంది. ఇంతకీ ఈ మూవీ ట్విట్ట‌ర్ టాక్ ఎలా ఉందంటే?

కథేంటంటే?(Devara Movie Story) : ఎర్ర సముద్రంలో నాలుగు గ్రామాలు ఉండగా అక్కడి ప్రజలు జీవనోపాధి కోసం మురుగ (మురళీ శర్మ) కోసం పని చేస్తుంటారు. కార్గో షిప్స్​లో అక్రమంగా తీసుకొచ్చిన సరుకును కోస్ట్ గార్డుల కంట పడకుండా ఒడ్డుకు తెస్తుంటారు. కానీ అందులో ఏముందనేది తెలుసుకోరు.

అలా అక్రమంగా తీసుకొచ్చిన సరుకు వల్ల ఓ సందర్భంలో ఓ ప్రాణం పోతుంది. ఇది తెలిసి మురుగ కోసం పని చేయకూడదని దేవర(ఎన్టీఆర్) నిర్ణయిస్తాడు. అలానే ఎర్ర సముద్రంలో అతడి మాటకు తిరుగుందడదు. అతడిని ఎదిరించే ధైర్యం కూడా ఎవరికీ ఉండదు. దీంతో ఇష్టం లేకున్నా మౌనంగా ఉంటూనే భైరా (సైఫ్ అలీ ఖాన్), చివరకు దేవర ప్రాణం తీయడానికి ప్రణాళిక రచిస్తాడు. అయితే ఈ కథ సింపుల్‌గానే ఉన్నా కొరటాల త‌న స్క్రీన్‌ ప్లేతో మ్యాజిక్ చేశాడ‌ని టాక్ వినిపిస్తోంది.

ఎన్టీఆర్ వ‌న్ మెన్ షో - 'దేవ‌ర'(DevaraJatharaaBegins) సినిమా ఎన్టీఆర్ వ‌న్ మ్యాన్ షో అని ఫ్యాన్స్ చెబుతున్నారు. టైటిల్ కార్డ్ మొదలు నుంచి చివ‌రి వ‌ర‌కు ఎన్టీఆర్ తన యాక్షన్​తో అద‌ర‌గొట్టేశారని కామెంట్స్ చేస్తున్నారు. డ్యుయెల్​ రోల్ ట్విస్ట్ అదిరిపోయిందని, దేవ‌ర‌, వ‌ర పాత్ర‌లో చ‌క్క‌టి వేరియేష‌న్ చూపించారని అంటున్నారు.

ఎలివేష‌న్స్ అయితే నెక్ట్స్​ లెవల్​ - 'దేవర'లో ఎన్టీఆర్ ఎలివేష‌న్స్‌, హీరోయిజం నెక్ట్స్​ లెవెల్‌లో ఉన్నాయ‌ని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. దేవ‌ర‌ విజువ‌ల్స్‌, యాక్ష‌న్ ఎపిసోడ్స్‌, పెర్ఫార్మెన్స్ అన్ని టాప్ నాచ్​గా ఉన్నాయని చెబుతున్నారు.

అనిరుధ్ మ‌రో హీరో - దేవరకు అనిరుధ్ మ‌రో హీరోగా నిలిచాడ‌ని అభిమానులు అంటున్నారు. ఆయన అందించిన బీజేఎమ్ థియేట‌ర్ల‌లో గూస్‌బంప్స్‌ను తెప్పిస్తోంది ట్వీట్లను తెగ వైరల్​ చేస్తున్నారు.

మీరు 'దేవర'కు వెళ్తున్నారా? - ఈ 15 ఆసక్తికర విషయాలు తెలుసా? - Devara Movie Interesting Facts

ఆ హాలీవుడ్ సినిమాలా 'దేవర' - గూస్​బంప్స్​ తెప్పించే అప్డేట్​ ఇచ్చిన అనిరుధ్​ - Devara Music Director Anirudh

Last Updated : Sep 27, 2024, 8:12 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.