ETV Bharat / entertainment

మీరు 'దేవర'కు వెళ్తున్నారా? - ఈ 15 ఆసక్తికర విషయాలు తెలుసా? - Devara Movie Interesting Facts - DEVARA MOVIE INTERESTING FACTS

NTR Devara Movie Interesting Facts : ఎన్టీఆర్​ - కొరటాల శివ కాంబోలో తెరకెక్కిన 'దేవర' రిలీజ్​కు సిద్ధమైంది. ఈ నేపథ్యంలో సినిమా గురించి ఆసక్తికర విషయాలను తెలుసుకుందాం.

source ETV Bharat
NTR Devara Movie Interesting Facts (source ETV Bharat)
author img

By ETV Bharat Telugu Team

Published : Sep 26, 2024, 12:57 PM IST

NTR Devara Movie Interesting Facts : యంగ్​ టైగర్ ఎన్టీఆర్‌ సోలో హీరోగా ఆరేళ్ల తర్వాత బాక్సాఫీస్ ముందుకు వస్తున్న చిత్రం 'దేవర'. అంతకుముందు ఆయన నుంచి అరవింద సమేత సినిమా వచ్చింది. ఆ తర్వాత ఆర్ఆర్ఆర్‌ లాంటి మల్టీస్టారర్ బ్లాక్ బస్టర్​ సినిమాలో నటించారు.

  • ఎన్టీఆర్‌ డ్యుయెల్ రోల్ చేసిన నాలుగో సినిమా ఇది. అంతకుముందు ఆంధ్రావాలా, అదుర్స్‌, శక్తి సినిమాల్లో ద్విపాత్రాభినయం చేశారు. ప్రస్తుతం దేవరలో దేవర, వర అనే పాత్రలు చేశారు.
  • ఎన్టీఆర్‌ 4 భాషల్లో (తెలుగు, హిందీ, కన్నడ, తమిళ్) డబ్బింగ్‌ చెప్పారు. సైఫ్‌ అలీ ఖాన్‌ పాత్రకు పి.రవిశంకర్‌ డబ్బింగ్ చెప్పారు.
  • 1980-90 నేపథ్యంలో దేవర కథ సాగుతుంది. కమర్షియల్‌ చిత్రాలకు భిన్నంగా దీన్ని తీర్చిదిద్దారు. సినిమాలో ఇతరులను చంపుతూ ధైర్యంతో బతికే వాళ్లకు భయాన్ని పుట్టించే వ్యక్తి’గా ఎన్టీఆర్‌ కనిపించనున్నారు.
  • బాలీవుడ్‌ స్టార్ యాక్టర్​ సైఫ్‌ అలీఖాన్‌ డైరెక్ట్​గా నటిస్తున్న తొలి తెలుగు సినిమా ఇదే. సినిమాలో భైర అనే పాత్ర పోషించారు.
  • ఈ దేవర చిత్రంతోనే జాన్వీ కపూర్‌ టాలీవుడ్​కు పరిచయం కానున్నారు. ఇందులో ఆమె తంగం అనే పాత్ర పోషించారు. మొదటి భాగంతో పోలిస్తే రెండో భాగంలో ఆమె పాత్రకు మరింత ప్రాధాన్యం ఉంటుందట.
  • మరాఠీ నటి శ్రుతి మరాఠే దేవరలో కీలక పాత్ర పోషించారు. దేవర భార్య పాత్రలో ఆమె కనిపించారని సమాచారం. ఆమె పాత్రపై మూవీటీమ్ సస్పెన్స్‌ ఉంచింది.
  • దేవర కథ మొత్తం దాదాపు 9 గంటలకు పైగా ఉంటుందట. అందుకే రెండు భాగాలుగా తెరకెక్కిస్తున్నారు.
  • 'దేవర' క్లైమాక్స్‌లో చివరి 40 నిమిషాలు అండర్‌ వాటర్‌ సీక్వెన్స్‌ సినిమాకే హైలైట్‌ అని అంటున్నారు.
  • అండర్‌ వాటర్‌ సీన్స్​ కోసం ఎన్టీఆర్‌ ప్రత్యేక శిక్షణ తీసుకున్నారు. 200 చదరపు గజాల్లో సముద్రాన్ని పోలిన సెట్‌ వేశారు. 35 రోజుల పాటు చిత్రీకరణ చేశారు. కృత్రిమ అలలు క్రియేట్‌ చేశారు. ట్రైలర్‌ చూపించిన షార్క్‌ షాట్‌ తీయడానికి రోజంతా సమయం పట్టిందట.
  • వాటర్‌ సీక్వెన్స్‌లో ఉపోయోగించే పడవలను కళా దర్శకుడు సాబు సిరిల్‌ డిజైన్‌ చేశారు. 90ల కాలంనాటి పరిస్థితులకు అనుగుణంగా వాటిని తీర్చిదిద్దారు.
  • దేవరలో నైట్‌ ఎఫెక్ట్‌ కోసం అతి తక్కువ వెలుతురులో షాట్స్‌ తీశారు.
  • దేవర రిలీజ్​కు ముందు పలు రికార్డులను క్రియేట్ చేసింది. ఓవర్సీస్‌లో ప్రీసేల్‌లో అత్యంత వేగంగా మిలియన్‌ డాలర్ల క్లబ్‌లో చేరింది. ట్రైలర్​ కూడా రిలీజ్‌ కాకముందే ఈ ఘనత సాధించిన తొలి ఇండియన్‌ మూవీ ఇదే.
  • ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌లలో అత్యధిక సంఖ్యలో డాల్బీ అట్మాస్‌ షోలను ప్రదర్శించనున్న మొదటి ఇండియన్ సినిమాగానూ దేవర నిలిచింది.
  • లాస్‌ ఏంజిల్స్‌ వేదికగా బియాండ్‌ ఫెస్ట్‌లో ప్రదర్శితం కానున్న తొలి భారతీయ చిత్రంగా దేవర రికార్డుకెక్కింది.
  • సినిమాలోని చుట్టమల్లే సాంగ్​ అయితే సెన్సేషన్‌ క్రియేట్‌ చేసింది. అత్యంత వేగంగా యూట్యూబ్‌లో 100 మిలియన్‌ వ్యూస్‌ దక్కించుకుంది.

ఆ హాలీవుడ్ సినిమాలా 'దేవర' - గూస్​బంప్స్​ తెప్పించే అప్డేట్​ ఇచ్చిన అనిరుధ్​ - Devara Music Director Anirudh

టాలీవుడ్ అప్​కమింగ్ బడా ప్రాజెక్ట్స్​ - ​ఈ స్టార్​ హీరోల సరసన సొగసరి వీరేనా? - Tollywood Upcoming Movies Heroines

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.