ETV Bharat / entertainment

బిగ్​బాస్​ 8: ఆరో వారం కిర్రాక్​ సీత అవుట్​ - రెమ్యునరేషన్​ వివరాలు లీక్​! - KIRRAK SEETHA REMUNERATION DETAILS

-ఎలిమినేట్ అయిన​ తర్వాత ముగ్గురికి వైట్​ హార్ట్​, ముగ్గురికి బ్లాక్​ హార్ట్​ -సీత డాడికి మెహబూబ్​ బైక్​ గిఫ్ట్​

Kirrak Seetha Remuneration
Kirrak Seetha Elimination and Remuneration (ETV Bharat)
author img

By ETV Bharat Telugu Team

Published : Oct 14, 2024, 10:53 AM IST

Kirrak Seetha Elimination and Remuneration: బిగ్‌బాస్‌ సీజన్‌ 8లో ఆరో వారం మరొకరు ఎలిమినేట్​ అయ్యారు. ప్రేక్షకుల నుంచి అతి తక్కువ ఓట్లు వచ్చిన కారణంగా కిర్రాక్​ సీత ఎలిమినేట్‌ అయినట్లు హోస్ట్​ నాగార్జున ప్రకటించారు. ఇక దసరా సందర్భంగా నిర్వహించిన స్పెషల్​ ఎపిసోడ్​ ఫుల్​ ఎంటర్​టైనింగ్​గా సాగింది. అయితే కిర్రాక్​ సీత రెమ్యూనరేషన్​ వివరాలు సోషల్​ మీడియాలో వైరల్​ అవుతున్నాయి. ఆ డీటెయిల్స్​ ఇప్పుడు చూద్దాం..

ఆరో వారం నామినేషన్స్‌లో గంగవ్వ, కిర్రాక్‌ సీత, పృథ్వీ, మెహబూబ్‌, విష్ణుప్రియ, యష్మీలు ఉండగా.. శనివారం ఎపిసోడ్​లో పృథ్వీని సేవ్​ చేశారు నాగార్జున. ఇక ఆదివారం నాడు విష్ణుప్రియ, గంగవ్వ, యష్మీలు సేవ్​కాగా.. చివరకు మెహబూబ్‌, సీత మిగిలారు. వీరిద్దరిలో అతి తక్కువ ఓట్లు వచ్చిన సీత ఎలిమినేట్‌ అయింది. ఈ సందర్భంగా స్టేజీ మీదకు వచ్చిన సీత.."ఎలిమినేట్‌ అవుతానని అస్సలు అనుకోలేదు. నా ఆట ఎక్కడో ప్రేక్షకులకు నచ్చకపోయి ఉండవచ్చు. ఎన్నెన్నో కష్టాలు చూశాను. ఇది పెద్ద విషయమేమీ కాదు’"అని చెప్పుకొచ్చింది. ఇక హౌజ్​లో ఉన్న వాళ్లలో ఎవరికి వైట్‌ హార్ట్, బ్లాక్‌ హార్ట్‌ ఇస్తావని నాగార్జున అడగ్గా తన అభిప్రాయాన్ని చెప్పింది సీత.

వైట్‌ హార్ట్‌

విష్ణుప్రియ: చాలా అమాయకురాలు. గేమ్‌ షో గురించి పెద్దగా అర్థం కాదు. కానీ, ఆమెలో ఫైర్‌ ఉంది అని సీత చెప్పింది." నువ్వు బయటకు వెళ్లాక మీ అమ్మను మర్చిపోయేంత ప్రేమ దొరకాలి. నువ్వు పెళ్లి చేసుకునే పార్ట్‌నర్‌ కోసం ప్రార్థిస్తా. నిన్ను బాగా చూసుకుంటాడు. కృష్ణుడు నాతో పలికిస్తున్న మాటలివి. నిన్ను ఫైనల్స్‌లో చూడాలనుకుంటున్నా" అంటూ సీత చెబుతూ ఎమోషనల్​ అయ్యింది.

నబీల్‌: "నా తమ్ముడు నబీల్‌ చాలా బాగా ఆడతాడు. రియాల్టీ షోలో రియల్‌ పీపుల్‌ విన్​ అవ్వాలని అనుకుంటున్నా" అని చెప్పింది.

అవినాష్‌: "తను వచ్చాక పాజిటివ్‌ ఎనర్జీ తీసుకొచ్చాడు. వచ్చి వన్​ వీకే అయినా, తను మాట్లాడుతుంటే నవ్వుతూనే ఉన్నాను. నాలో ఆ జోష్‌ తీసుకొచ్చినందుకు థ్యాంక్యూ" అంటూ చెప్పింది.

మరో షాకిచ్చిన నాగ మణికంఠ - భార్య కంటే ఎన్నేళ్లు చిన్నోడో తెలుసా?

బ్లాక్‌ హార్ట్‌

నిఖిల్‌: "పర్‌ఫెక్ట్‌ హజ్బెండ్‌ మెటీరియల్‌. కానీ, ఒక్క మైనస్‌. పారదర్శకంగా ఉండు. ఫిజికల్‌ టాస్క్‌లు బాగా ఆడతాడు. ఎవరో నిన్ను రైట్‌ అనుకోవాలని, అక్కడవి ఇక్కడ చెప్పకు. నీకు నచ్చింది మాట్లాడు" అంటూ సలహా ఇచ్చింది.

గౌతమ్‌: "నువ్వు ఇచ్చిన జోష్‌ బాగా నచ్చింది. చిన్న చిన్న విషయాలకు బాధపడకు. నీ నుంచి చాలా ఆశిస్తున్నాం. నిన్ను నీవు నిరూపించుకో. ఎన్ని రోజులున్నా, నిజాయతీతో ఉండు." అంటూ గౌతమ్​కు కూడా పలు సూచనలు చేసింది.

నయని పావని: "నేను ఏడుస్తూ ఉంటానని నామినేట్‌ చేశావు. నువ్వే ఎక్కువ ఏడుస్తున్నావు. గెలవాలన్న పట్టుదలతో ఆడు. ఈసారి ఎక్కువ రోజులు ఉండాలని కోరుకుంటున్నా" అంటూ చురకలు అంటిస్తూనే సలహాలు ఇచ్చింది సీత.

సీత డాడీకి మెహబూబ్​ గిఫ్ట్​: ఇక హౌజ్​లో జరిగిన ఓ టాస్క్‌లో సీత ఆడదామనుకున్నా, మెగా చీఫ్‌ అయిన మెహబూబ్‌.. విష్ణు, నయని పావనిని పంపాడు. ఆ టాస్క్‌ గెలిచి సీత తన తండ్రికి బైక్‌ గిఫ్ట్‌ ఇద్దామనుకుందట. అందుకు బాధపడిన మెహబూబ్‌ బయటకు వచ్చాక ఆ బైక్‌ను తానే గిఫ్ట్‌గా ఇస్తానని చెప్పగా.. దీంతో సీత హ్యపీ ఫీల్​ అయ్యింది.

సీత రెమ్యునరేషన్​ ఇదే!: ఈ సీజన్​లో ఇప్పటికే బిగ్​బాస్​ నుంచి ఎలిమినేట్​ అయిన కంటెస్టెంట్ల రెమ్యునరేషన్​ వివరాలు సోషల్​ మీడియాలో వైరల్​ అయ్యాయి. తాజాగా కిర్రాక్​ సీత కూడా ఆరువారాలను బాగానే తీసుకున్నట్లు టాక్​. వారానికి రూ.2 లక్షల లెక్కన ఆరువారాలకుగానూ దాదాపు రూ.12 లక్షలు అందుకున్నట్లు తెలుస్తోంది. ఈ వివరాలు సోషల్​ మీడియాలో వైరల్​ అయినవే.. అఫీషియల్​గా ఎంత అనేది ఎవరికీ తెలియదు.

"పక్కనోళ్ల బాధ గురించి వాడికి అక్కర్లేదు" - "వాడికి అదే సమస్య" - నాగ మణికంఠ చెల్లెలు షాకింగ్​ కామెంట్స్​!

బిగ్​బాస్​ 8 : లవ్​ మ్యాటర్​ రివీల్​ చేసిన ​నబీల్ - పార్ట్​నర్​ ఆమేనటగా!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.