Keerthy Suresh Wedding Card : హీరోయిన్ కీర్తి సురేశ్ త్వరలోనే పెళ్లి పీటలెక్కనున్న సంగతి తెలిసిందే. తన స్నేహితుడు ఆంటోనీతో ఆమె ఏడడుగులు వేయనున్నారు. ఈ నెల 12న వీరి వివాహం జరగనుంది. అయితే తాజాగా ఈమె పెళ్లి వేడుకకు సంబంధించిన వెడ్డింగ్ కార్డ్ ఫొటో బయటకు వచ్చింది. ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.
తాజాగా తన రిలేషన్షిప్ గురించి ఓపెనప్ అయ్యారు కీర్తి. ఆంటోతో ఆమె 15 ఏళ్లుగా ప్రేమలో ఉన్నట్లుగా చెప్పుకొచ్చారు. ఈ క్రమంలో తన ప్రియుడితో ఆమె దిగిన ఓ స్పెషల్ ఫొటోను ఫ్యాన్స్ కోసం షేర్ చేశారు. దీనికి అభిమానులు, సినీ ప్రముఖులు రియాక్ట్ అయ్యారు. నెట్టింట ఈ జంటకు కంగ్రాజ్యూలేషన్స్ చెప్పారు.
🌟 Wedding bells are ringing! 💒 #KeerthySuresh & #Antony’s love story reaches its beautiful destination on Dec 12th! ❤️
— KLAPBOARD (@klapboardpost) December 4, 2024
Stay tuned for every enchanting detail! #KeerthyAntonyWedding pic.twitter.com/ySARSVkHBD
గతంలోనూ ఆమె పెళ్లి గురించి రకరకాల రూమర్స్ వచ్చాయి. అయితే వాటిని ఆమెతో పాటు తన ఫ్యామిలీ ఖండించారు. ఆ తర్వాత ఆంటోనీ పేరు తెగ ట్రెండ్ అయ్యింది. తన స్నేహితుడితో ఆమె ఏడడుగులు వేయనున్నారంటూ గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలోనూ ప్రచారం జరిగింది. ఇంజినీరింగ్ చదివిన ఆంటోనీ కొంతకాలం విదేశాల్లో ఉద్యోగం చేశారని, ప్రస్తుతం ఆయనకు కేరళలో బిజినెస్ చేస్తున్నారని టాక్ నడిచింది.
ఇక కాలేజీ రోజుల నుంచే కీర్తి - ఆంటోనీ స్నేహితులు. సుమారు 15 ఏళ్లుగా వీరు ప్రేమలో ఉన్నారని, ఇప్పుడు పెద్దల అంగీకారంతో పెళ్లి చేసుకుంటున్నారని సమాచారం. అయితే గతంలోనే ఈ ఇద్దరి పేర్లు నెట్టింట తెగ ట్రెండ్ అవ్వగా, దానిపై కీర్తి కానీ తన ఫ్యామిలీ మెంబర్స్ కానీ స్పందించలేదు. తాజాగా కీర్తి తండ్రి తమ కుమార్తె పెళ్లి గురించి త్వరలోనే చెప్తామని వెల్లడించడం వల్ల అందరికీ ఓ క్లారిటీ వచ్చింది.
'గీతాంజలి' అనే మలయాళ చిత్రంతో తెరంగేట్రం చేసిన కీర్తి 'నేను శైలజ', 'మహానటి' లాంటి సినిమాలతో తెలుగువారికి దగ్గరయ్యారు. అయితే రీసెంట్గా ఆమె నటించిన 'రఘు తాత' మిక్స్డ్ టాక్ సొంతం చేసుకుని బాక్సాఫీస్ వద్ద నిరాశపరిచింది. ప్రస్తుతం ఆమె 'రివాల్వర్ రీటా', 'బేబీ జాన్' అనే రెండు సినిమాల కోసం వర్క్ చేస్తున్నారు.
ప్రియుడి గురించి ఫస్ట్ టైమ్ రివీల్ చేసిన కీర్తి సురేశ్ - అతడేనా?
కీర్తి సురేశ్ పెళ్లి ఫిక్స్!- గోవాలో వెడ్డింగ్- వరుడు ఎవరంటే?