ETV Bharat / entertainment

అల్లు అర్జున్​ 'పుష్ప 2'కు పోటీగా దిగిన కీర్తిసురేశ్​ - Alluarjun VS Keerthi Suresh - ALLUARJUN VS KEERTHI SURESH

Alluarjun VS Keerthi Suresh : హీరోయిన్ కీర్తి సురేశ్​ నటించిన కొత్త సినిమా అల్లు అర్జున్ పుష్ప 2కు పోటీగా రిలీజ్ అయ్యేందుకు సిద్ధమైంది. అఫీషియల్ అనౌన్స్​మెంట్ కూడా వచ్చింది. పూర్తి వివరాలు స్టోరీలో.

Source ETV Bharat
Alluarjun VS Keerthi Suresh (Source ETV Bharat)
author img

By ETV Bharat Telugu Team

Published : May 31, 2024, 2:58 PM IST

Alluarjun VS Keerthi Suresh : సౌత్ ఇండియా స్టార్ హీరోయిన్ కీర్తి సురేశ్​ గురించి ప్రత్యేకంగా సినీ ప్రియులకు ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. నేను శైలజతో సినిమా టాలీవుడ్ ఇండ‌స్ట్రీలోకి అడుగుపెట్టిన ఈ ముద్దుగుమ్మ తక్కువ కాలంలోనే స్టార్ స్టేటస్​ ఇమేజ్​ను క్రియేట్ చేసుకుంది. మహానటితో ఇండియావైడ్​గా పాపులర్ అయి నేషనల్ అవార్డ్​ను దక్కించుకుంది.

అయితే ఆ మధ్య వరుస ఫ్లాప్​లను మూటగట్టుకున్న ఈ ముద్దుగుమ్మ ఆ తర్వాత రూట్ మార్చి గ్లామర్​ డోస్​తో హిట్లను అందుకుంది. అలానే డీ గ్లామర్ రోల్​తో వచ్చిన దసరాతోనూ గతేడాది భారీ సక్సెస్​ను ఖాతాలో వేసుకుంది. ప్రస్తుతం వరుస సినిమాలు చేస్తూ బాలీవుడ్ ఛాన్స్​లను అందుకుంటోంది. ప్రస్తుతం తమిళంలో రఘు తాతా అనే సినిమా చేస్తోంది. సుమన్‌కుమార్‌ దర్శకత్వం వ‌హిస్తున్నారు. రీసెంట్​గా ఈ మూవీ నుంచి టీజ‌ర్ విడుద‌ల అవ్వగా మంచి రెస్పాన్స్ దక్కించుకుంది.

ఇప్పుడు మేకర్స్​ ఈ సినిమా విడుద‌ల తేదీని అఫీషియల్​గా అనౌన్స్ చేశారు. స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ఆగ‌ష్టు 15న రిలీజ్ చేయ‌నున్న‌ట్లు ప్ర‌క‌టించారు. అయితే అదే రోజు తెలుగుతో పాటు పాన్ ఇండియా రేంజ్​లో అల్లు అర్జున్ పుష్ప 2 కూడా ప్రేక్షకుల ముందుకు రానుంది. దీంతో ఆగ‌ష్ట్ 15న ఈ రెండు చిత్రాలు బాక్సాఫీస్ ముందు పోటీ పడనున్నాయనమాట. వాస్తవానికి కమల్​హాసన్​ ఇండియన్ 2 కూడా ఆగస్ట్ 15న రావాలని మొదట ఆశించింది. కానీ పుష్ప 2 ఉండటం వల్లే వెనక్కి తగ్గిందని ఆ మధ్య ప్రచారం సాగింది. కానీ ఇప్పుడేమో కీర్తిసురేశ్ అల్లు అర్జున్​కు పోటీగా వస్తోంది.

కాగా, ర‌ఘు తాతా టీజ‌ర్ చూస్తే ఇందులో NCC క్యాడెట్ శిక్షణ పొందుతున్న కీర్తి సురేశ్​ పాత్రతో ప్రచార చిత్రం మొదలవుతుంది. అయితే NCC మాస్ట‌ర్ హిందీలో శిక్ష‌ణ ఇస్తుంటే నాకు హిందీ రాదు త‌మిళంలో చెప్పండి సార్ అంటూ కీర్తి సురేశ్​ చెప్పడం చూస్తుంటే తమిళ ప్రజలపై హిందీని రుద్దడం చుట్టూ కథ సాగుతుందని అర్థమవుతోంది. సలార్​తో భారీ సక్సెస్ అందుకున్న హోంబలే ఫిల్మ్స్ బ్యానర్ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. రవీంద్ర విజయ్, ఎంఎస్ భాస్కర్, రాజీవ్, దేవదర్శిని తదితరులు ఇతర కీలక పాత్రలు పోషిస్తున్నారు.షాన్ రోల్డన్ సంగీతం సమకూరుస్తున్నారు.

సినిమాల్లో సల్మాన్ లిప్ కిస్​ చేసిన ఒకే ఒక్క స్టార్ హీరోయిన్ ఎవరంటే? - SALMAN KHAN

బాలయ్యకు పోటీగా పవన్ కల్యాణ్​! - NBK 109 vs OG movie

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.