ETV Bharat / entertainment

కీర్తి సురేశ్ తొలి బాలీవుడ్ సినిమా ఇదే - ఏకంగా ఎన్ని కోట్లు ఛార్జ్​ చేసిందంటే? - కీర్తి సురేశ్ తొలి బాలీవుడ్ సినిమా

Keerthi Suresh First Bollywood Movie Remuneration : నేను శైలజ సినిమాతో చాలా సింపుల్​గా పక్కింటి అమ్మాయి తరహాలో ఎంట్రీ ఇచ్చిన కీర్తి సురేశ్​ ఆ తర్వాత మహానటితో మంచి క్రేజ్ సంపాదించుకుంది. ఓ వర్గం ప్రేక్షకులకు చాలా దగ్గరైపోయింది. ఇప్పుడీమే బాలీవుడ్​ అరంగేట్రం కోసం ఓ హిందీ సినిమా చేస్తోంది? ఇంతకీ ఆ చిత్రం ఏంటి? దీనికి ఆమె ఎన్ని కోట్ల రెమ్యునరేషన్ తీసుకుంటుందో వివరాలను తెలుసుకుందాం.

కీర్తి సురేశ్ తొలి బాలీవుడ్ సినిమా ఇదే - ఏకంగా ఎన్ని కోట్లు ఛార్జ్​ చేసిందంటే?

author img

By ETV Bharat Telugu Team

Published : Mar 6, 2024, 7:57 AM IST

Keerthi Suresh First Bollywood Movie Remuneration : మహానటి కీర్తి సురేశ్​ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈ మలయాళీ ముద్దుగుమ్మ మొదటి నుంచి గ్లామర్ పాత్రలు కాకుండా సింపుల్ రోల్స్​ చేస్తూ ఆకట్టుకునేందుకు ప్రయత్నాలు చేసింది. ఈ క్రమంలోనే మహానటి సినిమాతో ఇండియా వైడ్​గా గుర్తింపు తెచ్చుకున్న ఈ భామ అప్పటి నుంచి కేవలం నటనకు ఆస్కారం ఉన్న సినిమాలు చేస్తూ హోమ్లీ హీరోయిన్​గా అలరించింది.

అలానే లేడీ ఒరియెంటెడ్ మూవీస్​, నటనకు ప్రాధాన్యత ఉన్న పాత్రలు, డీ గ్లామర్ రోల్స్ చేస్తూ మెప్పించే ప్రయత్నం చేసింది. కానీ ఇది ఆమెకు అంతగా వర్కౌట్ కాలేదు. దీంతో మహేశ్ బాబు సర్కారు వారి పాట చిత్రంతో కాస్త గ్లామర్ డోస్​ పెంచి మెస్మరైజ్ చేయడం మొదలుపెట్టింది ఈ కేరళ కుట్టి.

సోషల్ మీడియాలో హాట్ షోలతో రెచ్చిపోతోంది. అల్ట్రా గ్లామరస్​ లుక్స్​తో ఆమె పోస్ట్​ చేసే ఎక్స్ పోజింగ్ పిక్స్​ యూత్​కు నిద్ర పట్టకుండా చేస్తున్నాయి. చివరిగా తెలుగులో మెగాస్టార్ భోళాశంకర్ చిత్రంతో ప్రేక్షకులను పలకరించింది. అయితే ఇప్పటివరకు సౌత్ ఇండస్ట్రీలో నటించిన ఈమె ఇక బాలీవుడ్​లో తన అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు రెడీ అవుతోంది. తేరీ రీమేక్​గా తెరకెక్కుతోన్న బేబీ జాన్ చిత్రంతో హిందీలోకి అడుగుపెట్టింది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుపుకుంటోంది. కలీస్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రం 31న థియేటర్లలో గ్రాండ్ రిలీజ్ కానుంది.

అయితే ఈ సినిమాకు గానూ కీర్తి సురేశ్ తీసుకుబోయే రెమ్యునరేషన్ వివరాలు తెలిశాయి. ప్రస్తుతం అవి నెట్టింట్లో చక్కర్లు కొడుతున్నాయి. ఈ మూవీ కోసం ఆమె ఏకంగా రూ. 4 కోట్ల రూపాయలు రెమ్యునరేషన్ ఛార్జ్ చేస్తున్నట్లు బయట కథనాలు వస్తున్నాయి. టాలీవుడ్​లో ఈ బ్యూటీ సాధారణంగా ఒక్కో చిత్రానికి కోటి నుంచి రూ.2 కోట్ల వరకు పారితోషికం తీసుకునేదట. ఇప్పుడు బాలీవుడ్​లోకి ఎంట్రీ ఇవ్వగానే తనకున్న కాస్త క్రేజ్ కారణంగా రెమ్యునరేషన్ డబుల్ చేసిందట.

కాగా, కీర్తి సురేశ్ రీసెంట్​గా ఓటీటీలో సైరన్ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇందులో పోలీస్ ఆఫీసర్​ రోల్​లో కనిపించింది. ప్రస్తుతం​ కోలీవుడ్‌లో రఘుతాత, రివాల్వర్ రీటా, కన్నివెడి వంటి చిత్రాల్లో నటిస్తూ బిజీగా ఉంది.

ఓటీటీలో ప్రతిష్టాత్మక ఆస్కార్ అవార్డ్స్ వేడుక - లైవ్ స్ట్రీమింగ్ ఎందులో అంటే?

ఓటీటీలోకి బాలయ్య బ్యూటీ హనీ రోజ్ రియల్ స్టోరీ మూవీ! - స్ట్రీమింగ్ ఎక్కడంటే?

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.