ETV Bharat / entertainment

'కౌన్‌ బనేగా కరోడ్‌పతి'లో అల్లు అర్జున్ పై ప్రశ్న - ఏమని అడిగారంటే? - KAUN BANEGA CROREPATI ALLU ARJUN

'కౌన్‌ బనేగా కరోడ్‌పతి'లో ఐకాన్​ స్టార్ అల్లు అర్జున్​పై అమితాబ్ బచ్చన్​ ప్రశ్న!

Kaun Banega Crorepati Allu Arjun
Kaun Banega Crorepati Allu Arjun (source ANI and ETV Bharat)
author img

By ETV Bharat Telugu Team

Published : Oct 18, 2024, 9:47 AM IST

Kaun Banega Crorepati Allu Arjun : తెలుగు చిత్ర పరిశ్రమలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ స్టార్ హీరోగా రాణిస్తున్న సంగతి తెలిసిందే. 'పుష్ప' చిత్రంతో పాన్ ఇండియా హీరోగా ఇమేజ్ సంపాదించుకున్నారు. ముఖ్యంగా నార్త్​లో ఆయన పేరు మార్మోగిపోయింది. అయితే తాజాగా ప్రఖ్యాత షో కౌన్‌ బనేగా కరోడ్‌పతిలో అల్లు అర్జున్​కు సంబంధించి ఓ ప్రశ్న అడగడం ప్రస్తుతం వైరల్​గా మారింది. కాగా, ఇటీవలే ఇదే షోలో పవర్​ స్టార్ పవన్ కల్యాణ్​ గురించి ఓ ప్రశ్న వేయడం హాట్ టాపిక్​ మారిన సంగతి తెలిసిందే.

ఏం ప్రశ్న అంటే? - బాలీవుడ్ బిగ్ బీ అమితాబ్ బచ్చన్ ఈ మధ్యే కల్కి 2898 ఏడీ, వేట్టాయన్ చిత్రాలలో నటించి ఆడియెన్స్​ను మెప్పించారు. అయితే బిగ్​ బీ​ కేవలం బిగ్ స్క్రీన్​పై మాత్రమే కాకుండా స్మాల్ స్క్రీన్​పై కూడా హోస్ట్​గా వ్యవహరిస్తున్నారు. అత్యంత ప్రేక్షకాదరణ సొంత చేసుకున్న టెలివిజన్‌ షో కౌన్‌ బనేగా కరోడ్‌పతికి వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్నారు. దీనిని తెలుగులో 'మీలో ఎవరు కోటీశ్వరుడు' అంటూ కింగ్ నాగార్జున, మెగాస్టార్ చిరంజీవి, జూనియర్ ఎన్టీఆర్ కూడా హోస్ట్ చేసిన సంగతి తెలిసిందే.

అయితే ప్రస్తుతం హిందీలో కౌన్‌ బనేగా కరోడ్‌పతి 16వ సీజన్‌ నడుస్తోంది. దీనికి కూడా బాలీవుడ్‌ స్టార్‌ అమితాబ్‌ బచ్చనే హోస్ట్‌గా వ్యవహరిస్తున్నారు. ఈ క్రమంలోనే తాజాగా జరిగిన ఎపిసోడ్‌లో బిగ్‌బీ ఓ కంటెస్టెంట్‌ను అల్లు అర్జున్​ సంబంధించిన ప్రశ్నను అడిగారు. '2023లో నేషనల్‌ అవార్డు గెలుచుకున్న నటుడు ఎవరు' అని అమితాబ్‌ అడిగారు. దానికి కంటెస్టెంట్​ సరైన సమాధానం అల్లు అర్జున్​ అని చెప్పి రూ.20 వేలు గెలుచుకున్నారు. అంతకుముందు రీసెంట్​గా జరిగిన ఎపిసోడ్​లో '2024 జూన్‌లో ఆంధ్రప్రదేశ్‌ డిప్యూటీ సీఎంగా బాధ్యతలు చేపట్టిన నటుడు ఎవరు?' అని ప్రశ్న వేశారు అమితాబ్​.

Allu Arjun Pushpa 2 Movie : ప్రస్తుతం అల్లు అర్జున్​ 'పుష్ప 2'తో బిజీగా గడుపుతున్నారు. ఈ చిత్రాన్ని డిసెంబర్​లో రిలీజ్​ చేసేలా షూటింగ్ పూర్తి చేసే పనిలో ఉన్నారు. సినిమాలో ఫహాద్​ ఫాజిల్​, రష్మిక, సునీల్, అనసూయ వంటి నటులు నటిస్తున్నారు.

'పుష్ప 2'లో యానిమల్ యాక్టర్​ - సుకుమార్ ప్లానింగ్​కు ఫ్యాన్స్ సర్​ప్రైజ్​

1600 కి.మీ సైకిల్ జర్నీ- బన్నీని కలిసేందుకు ఫ్యాన్ క్రేజీ ఫీట్

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.