ETV Bharat / entertainment

బావ బామ్మర్దిల అనుబంధంతో కార్తి ఎమోషనల్ మూవీ! - ఓటీటీలో ఎక్కడ చూడొచ్చంటే? - KARTHI ARVIND SWAMY MOVIE

ఓటీటీలోకి హీరో కార్తి లేటెస్ట్ మూవీ! - స్ట్రీమింగ్‌ ఎప్పుడంటే?

Karthi Arvind Swamy Movie
Karthi (Getty Images)
author img

By ETV Bharat Telugu Team

Published : Oct 22, 2024, 10:41 AM IST

Karthi Arvind Swamy Movie : కోలీవుడ్ సీనియర్ హీరో అరవింద్‌ స్వామి, యంగ్ హీరో కార్తి ప్రధాన పాత్రల్లో మెరిసిన తాజా చిత్రం 'సత్యం సుందరం' బావ, బావమరిది అనుబంధం నేపథ్యంలో సాగే ఈ చిత్రం థియేటర్​లో డీసెంట్​ టాక్ అందుకుని నడిచింది. ఇప్పుడీ సినిమా ఓటీటీలోనూ అభిమానులను అలరించేందుకు సిద్ధమైంది. ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్‌ఫ్లిక్స్‌ వేదికగా అక్టోబర్‌ 27 నుంచి స్ట్రీమింగ్​ అయ్యేందుకు సిద్ధంగా ఉంది. తెలుగుతో పాటు తమిళ, మలయాళం, హిందీ, కన్నడ భాషల్లోనూ ఈ చిత్రం అందుబాటులోకి రానుంది. తాజాగా ఈ విషయాన్ని తెలియజేస్తూ నెట్‌ఫ్లిక్స్ ఓ స్పెషల్ పోస్టర్‌ను విడుదల చేసింది.

ఇంతకీ స్టోరీ ఏంటంటే
సత్యమూర్తి అలియాస్ సత్యం (అరవింద్ స్వామి)ది గుంటూరు దగ్గరున్న ఉద్దండరాయుని పాలెం. అతడికి ఆ ఊరన్నా, అక్కడ ఉన్న తమ తాతల కాలం నాటి ఇళ్లన్నా ఎంతో ఇష్టం. అయితే కొందరు బంధువులు చేసిన మోసం వల్ల యుక్తవయసులోనే సత్యం వాళ్ల కుటుంబం ఆ ఇల్లు కోల్పోతుంది. దీంతో వారందరూ ఆ ఊరుని వదిలేసి వైజాగ్ వచ్చి స్థిరపడతారు. అలా 30ఏళ్లు గడిచిపోతాయి. కానీ ఇన్నేళ్లు గడిచినా సత్యంను తన ఊరు, ఇంటి జ్ఞాపకాలు వెంటాడుతూనే ఉంటాయి.

అయితే ఓ సారి తన బాబాయ్ కుమార్తె పెళ్లి కోసం తప్పనిసరి పరిస్థితుల్లో సత్యం ఉద్దండరాయుని పాలెం వెళ్లాల్సి వస్తుంది. అక్కడే అతన్ని బావా బావా అంటూ ఆప్యాయంగా పలకరిస్తూ ఓ వ్యక్తి (కార్తి) తారసపడతాడు. దీంతో ఒక్కసారిగా ఆశ్చర్యపోతాడు. అతనెవరు? తన పేరేంటి? అన్న విషయాలు తెలియకపోయినా, మొహమాటం కొద్దీ తనకు తెలిసినట్లుగానే నటిస్తూ వస్తాడు. మొదట్లో అతని(కార్తి) అతి వాగుడు, మితిమీరిన కలుపుగోలుతనం చూసి తనని జిడ్డులా భావిస్తాడు సత్యం. అయితే ఆ తర్వాత అతడితో కలిసి ప్రయాణం చేసే కొద్దీ ఆ వ్యక్తి చూపించే ఆప్యాయత, ప్రేమాభిమానాలు సత్యం (అరవింద్ స్వామి) మనసును కట్టిపడేస్తాయి. దీంతో సత్యం కాస్త ఎమోషనల్ అవుతారు. అయితే ఈ ఇద్దరి ప్రయాణం ఏ మజిలీకి చేరింది? ఈ జర్నీలో సత్యం తనని తాను ఎలా తెలుసుకున్నాడు? బావా అని పిలుస్తున్న ఆ వ్యక్తితో సత్యానికి ఉన్న బంధం ఏంటి? ఆఖరికి అతని పేరు సత్యంకు గుర్తొచ్చిందా?లేదా? అన్నదే మిగతా స్టోరీ.

మహేశ్ బాబుతో మూవీ - కార్తి ఏమన్నారంటే? - Karthi Mahesh Babu Movie

'సత్యం సుందరం' రివ్యూ - మనసును హత్తుకునేలా ఫీల్​ గుడ్​ స్టోరీ! - Satyam Sundaram Movie Review

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.