Kareena Kapoor Career: ఇండియన్ సినీ ఇండస్ట్రీలో కరీనా కపూర్ పరిచయం అవసరం లేని నటి. ప్రస్తుతం బాలీవుడ్ టాప్ హీరోయిన్లలో ఒకరిగా కొనసాగుతోంది. అయితే కెరీర్ ప్రారంభంలో ఇండస్ట్రీలో నిలదొక్కుకోవడానికి చాలా కష్టపడింది. నటిగా అరంగేట్రం చేసిన తొలి సినిమానే ప్లాప్. తర్వాత కొన్ని సినిమాలు విజయం సాధించినప్పటికీ ఒకానొక సమయంలో వరుసగా తన పది చిత్రాలు ప్లాప్ అయ్యాయి. దీంతో కెరీర్ పరంగా కొంత ఇబ్బంది పడిన కరీనా ఆ తరువాత నిలదొక్కుకొని వరుస విజయాలు సాధించింది. అంతే కాకుండా ప్రస్తుతం బాలీవుడ్లో అత్యధిక పారితోషికం తీసుకునే నటిగా కొనసాగుతోంది.
ఫ్యామిలీ బ్యాక్‌గ్రౌండ్: బాలీవుడ్ నటీనటులు రణధీర్ కపూర్- బబితా దంపతుల కుమార్తె కరీనా కపూర్. ఆ కుటుంబానికి ఇండస్ట్రీలో పలుకుబడి ఉండడం వల్ల కరీనా ఈజీగానే తెరంగేట్రం చేసింది. జేపీ దత్తా తీసిన 'రెఫ్యూజీతో సినిమా రంగప్రవేశం చేసిన ఆ చిత్రం బాక్సాఫీస్ వద్ద నిరాశపరిచింది. అనంతరం వచ్చిన 'ముజే కుచ్ కహేనా హయ్' విజయం హిట్ అందుకోవడం వల్ల కరీనాకు నటిగా మంచి గుర్తింపునిచ్చింది. ఇక 2001 లో కరణ్ జోహార్ దర్శకత్వంలో వచ్చిన 'కబీ ఖుషి కబీ గమ్' బాక్సాఫీస్ వద్ద బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. దీంతో కరీనాకు ఇండస్ట్రీలో మంచి గుర్తింపు లభించింది.
వరుసగా 10 ఫ్లాప్స్: అయితే ఆ తర్వాత కరీనాకు కెరీర్లో బ్యాడ్ టైమ్ ఫేస్ చేసిందని చెప్పాలి. దీని తర్వాత వచ్చిన పది సినిమాలు ' ముజ్సే దోస్తీ కరోగి ', 'జెలీనా సిర్ఫ్ మేరే లియే', 'తలాష్ ది హంగ్ బిగిన్స్', 'ఖుషీ', 'మెయిన్ ప్రేమ్ కీ దీవానీ హూన్', 'LOC కార్గిల్', 'చమేలీ','యువ', 'దేవ్', 'ఫిదా' బాక్సాఫీస్ వద్ద విఫలమయ్యాయి. దీంతో ఆమె కెరీర్ నెమ్మదించింది.
కెరీర్ గుడ్ టర్న్: ఆ తర్వాత కరీనా కెరీర్ గుడ్ టర్న్ తీసుకుంది. 2004 లో వచ్చిన 'ఐత్రాజ్' ఆమెకు నటన పరంగా మంచి గుర్తింపు నిచ్చింది. అనంతరం వచ్చిన 'హల్చల్' బాక్సాఫీస్ రికార్డు స్థాయి విజయం సాధించింది. 2007 లో వచ్చిన 'జబ్ వీ మీట్' చిత్రం ఇండస్ట్రీ హిట్ కొట్టింది. దీంతో బాలీవుడ్లో అత్యధిక రెమ్యునరేషన్ అందుకున్న నటిగా నిలిచింది. అప్పట్లో కరీనా ఒక సినిమాకు రూ.3.5 కోట్లు తీసుకుంది. తన తరువాతి స్థానంలో ఐశ్వర్యరాయ్ రూ.3 కోట్లుగా ఉండేది.
తర్వాత వచ్చిన '3 ఇడియట్స్', 'భజరంగీ భాయిజాన్', 'గోల్ మాల్', 'ఫన్ అన్ లిమిటెడ్', 'గోల్ మాల్ 3', 'బాడీగార్డ్' ,'సింగం రిటర్న్స్' వంటి పలు హిట్ చిత్రాల్లో నటించింది. ఇప్పటి వరకూ కరీనా కపూర్ 6 ఫిల్మ్ ఫేర్ అవార్డులు గెలుచుకుంది. ప్రస్తుతం బాలీవుడ్ టాప్ హీరోయిన్లలో ఒకరిగా ఉన్న కరీనా సినిమాకు రూ.18 కోట్లు ఛార్జ్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ లిస్ట్‌లో ప్రియాంకా చోప్రా రూ.40 కోట్లతో అగ్రస్థానంలో ఉంది. తను'సింగం రిటర్న్స్ ' సినిమాతో ఆగస్టు 15న ప్రేక్షకుల ముందుకు రానుంది.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
33 మంది హీరోలు, 12 హీరోయిన్లు- బాలీవుడ్లో లాంగెస్ట్ రన్ టైమ్ గల మూవీ ఇదే!