Kanguva Teaser Update : కోలీవుడ్ స్టార్ హీరో సూర్య లీడ్ రోల్లో తెరకెక్కుతున్న లేటెస్ట్ మూవీ 'కంగువా'. పీరియాడికల్ బ్యాక్‌డ్రాప్‌తో తెరకెక్కుతుత్న ఈ మూవీ ప్రస్తుతం షూటింగ్ దశలో ఉంది. అయితే తాజాగా మేకర్స్ ఈ సినిమాకు సంబంధించిన ఓ లేటెస్ట్ వీడియోను విడుదల చేశారు. శివ్ అండ్ హిస్ టీమ్ అంటూ ఆసక్తికంగా ఉన్న ఆ గ్లింప్స్ ప్రస్తుతం నెటిజన్లను ఆకట్టుకుంటూ సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది.
ఓ అడవిలో రెండు ట్రైబల్ తెగల మధ్య జరిగే పోరాటం నేపథ్యంలో సాగే చిత్రమని టీజర్ చూస్తుంటే అర్థమవుతోంది. ఆ తెగల లీడర్ సూర్య తమ ప్రత్యర్థలతో చేసే వార్ ఆసక్తికరంగా ఉండనుంది. గ్లింప్స్‌లో ఆయన కొత్త లుక్‌తో ఆకట్టుకోగా, పోరాట సన్నివేశాలను తలపించే సీన్స్ గూస్‌బంప్స్‌ను తెప్పిస్తున్నాయి. ఇక ఇందులో విలన్ బాబీ దేఒల్ రోల్ కూడా బలంగా ఉండనున్నట్లు తెలుస్తోంది. వీడియో చివరిలో ఆయనకు కూడా సూర్యకు మధ్య జరిగిన సీన్స్ ఎంతో ఆసక్తిగా ఉంది.
మరోవైపు ఇది పూర్తిగా విజువల్ వండర్‌గా ఉండనున్నట్లు తెలుస్తోంది. మొసలి సీన్ నుంచి నిప్పులో నుంచి సూర్య వచ్చే సీన్ వరకూ అన్ని భారీ అంచనాలు రేపుతున్నాయి. అంతే కాకుండా టీజర్ చివరిలో 'పెరుమాచి' అంటూ సూర్య వాయిస్ ఓవర్ వీడియోకే హైలైట్‌గా నిలిచింది.
Kanguva Movie Cast : ఇక కంగువ సినిమాలో సూర్యతో పాటు దిశాపటానీ లీడ్ రోల్లో మెరవనున్నారు. పవర్ఫుల్ విలన్ రోల్లో బాలీవుడ్ స్టార్ బాబీ దేవోల్ కనిపించనున్నారు. వీరితో పాటు టాలీవుడ్ సీనియర్ నటుడు జగపతి బాబు, యోగిబాబు, కోవై సరళ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. దేవిశ్రీ ప్రసాద్ ఈ సినిమాకు సంగీతాన్ని అందిస్తున్నారు. స్టూడియో గ్రీస్ సంస్థ బ్యానర్‌పై ఈ సినిమాను జ్ఞానవేల్ రాజా నిర్మిస్తున్నారు. ఇందులో హీరో సూర్య ఆరు భిన్నమైన అవతారాల్లో కనిపించనున్నట్లు తెలుస్తోంది. దాదాపు 38 బాషల్లో ఈ సినిమా విడుదల కానున్నట్లు మేకర్స్ ప్రకటించారు.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
'కంగువా', 'తంగలాన్' రిలీజ్ డేట్స్ - థియేటర్లలోకి అప్పుడే
'ఆ మూవీలో నా రోల్ కొత్తగా ఉంటుంది - నా కంఫర్ట్ జోన్‌లో అస్సలు లేదు'