ETV Bharat / entertainment

అవినీతిని అంతమొందించడాని సేనాపతి రాక- అందుకే రెండు సినిమాల మధ్య 28 ఏళ్ల గ్యాప్! - Kamal Haasan Indian 2 - KAMAL HAASAN INDIAN 2

Kamal Haasan Indian 2 : సరిగ్గా 28 ఏళ్ల క్రితం అవినీతికి వ్య‌తిరేకంగా పోరాటం చేసిన సేనాప‌తిగా 'భార‌తీయుడు' చిత్రంలో క‌మ‌ల్ హాస‌న్ నటించి ఇటు సౌత్​తో పాటు అటు నార్త్ ఆడియెన్స్​ను మెప్పించారు. ఇప్పుడు దీనికి కొన‌సాగింపుగా ప్రేక్షకుల ముందుకు వస్తోంది 'భారతీయిడు 2'. మునపటి సినిమాకంటే ఇంకొన్ని ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్స్ చేర్చి డైరెక్టర్ శంకర్ ఈ చిత్రాన్ని ఎంతో జాగ్రత్తగా తీర్చిదిద్దారు. అయితే సినిమా రిలీజ్ దగ్గరపడుతున్న కొద్దీ మేకర్స్ ప్రమోషనల్ ఈవెంట్స్​ను వేగవంతం చేశారు. ఈ నేపథ్యంలో తాజాగా మూవీ రిలీజ్​ ట్రైలర్​ను విడుదల చేశారు. దాన్ని మీరూ చూసేయండి

Kamal Haasan Indian 2 Trailer
Kamal Haasan (ETV Bharat)
author img

By ETV Bharat Telugu Team

Published : Jun 25, 2024, 7:11 PM IST

Kamal Haasan Indian 2 : లోకనాయకుడు కమల్ హాసన్, తమిళ స్టార్​ డైరెక్టర్ శంకర్ కాంబినేషన్​లో వచ్చిన లేటెస్ట్ మూవీ 'భారతీయుడు 2'. అభిమానులు ఏంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఈ సినిమా రిలీజ్ ట్రైలర్​ను మేకర్స్ నేడు (జూన్ 25)న విడుదల చేశారు. అయితే తొలుత చెన్నైలో మీడియా కోసం మాత్రమే దీన్ని టెలికాస్ట్ చేయగా, ఇప్పుడు అభిమానుల కోసం నెట్టింట అప్​లోడ్ చేశారు. ఆద్యంతం థ్రిల్లింగ్​గా సాగిన ఈ గ్లింప్స్ ప్రస్తుతం మూవీ లవర్స్​ను తెగ ఆకట్టుకుంటోంది.

రెండు సినిమాల మధ్య 28 ఏళ్ల గ్యాప్ - కారణం అదే !
చెన్నైలో తాజాగా జరిగిన మీడియా సమావేశానికి మూవీటీమ్ హాజరై సందడి చేసింది. ఈ సందర్భంగా 'భారతీయుడు' సినిమా 1996లో విడుదల అవ్వగా ఇప్పుడు ఈ రెండవ భాగం రావడానికి ఎందుకు 28 ఏళ్లు పట్టిందంటూ విలేకరులు అడిగ్గా, దానికి కమల్ స్పందించారు. ఇదంతా పరిస్థితుల ప్రభావం వల్ల జరిగిందని ఆయన క్లారిటీ ఇచ్చారు. అసలు 'భారతీయుడు' సినిమా గురించి ఆలోచించినప్పుడల్లా తను ఏంటో ఉద్వేగానికి లోనవుతానన్నారు.

ట్రైలర్ స్క్రీనింగ్‌కు వచ్చిన కమల్ "ఉయిరే ఉలగే తమిలే (నా జీవితం, నా ప్రపంచం, తమిళం)" అని పేర్కొంటూ తమిళ భాషను గౌరవిస్తూ తన ప్రసంగాన్ని ప్రారంభించారు. తనతో అనేక చిత్రాలకు కలిసి పనిచేసిన దివంగత నటులు వివేక్, మనోబాలలకు నివాళులర్పించారు. చిత్రానికి సంగీతం అందించిన అనిరుధ్ రవిచందర్​కు ధన్యవాదాలు తెలిపారు. భారతీయుడిని ఆదరించినట్టుగానే ఈ చిత్రాన్ని కూడా ఆదరిస్తానని నమ్ముతున్నానన్నారు.

"కమల్ ప్రతిరోజు సెట్‌లో అందరికంటే ముందుగా వస్తారు. చివరిగా వెళ్ళేవారు. సినిమా కోసం ఏంతో అంకితభావంతో పనిచేశారు. మొదటిభాగంలో కంటే ఎక్కువ రోజులు ఈ భాగం కోసం పని చేయాల్సి వచ్చింది, అది కాక మేకప్ తియ్యడానికి కూడా గంట పడుతుంది. అలాంటి సందర్భంలో కూడా కమల్ ఓపికతో వ్యవహరించారు" అని డైరెక్టర్ శంకర్ కమల్​ను కొనియాడారు.

ఇదిలా ఉండగా, పోస్ట్ ప్రొడక్షన్ వర్క్‌ ఇంకాస్త ఉందని, అందువల్లే ఇంత ఆలస్యమైందన్నారు. ప్రపంచ వ్యాప్తంగా తెలుగు, తమిళ, హిందీ భాషల్లో జులై 12న ఈ చిత్రం గ్రాండ్ లెవ‌ల్లో రిలీజ్ కానుంది. ఇందులో సిద్ధార్థ్‌, కాజ‌ల్ అగ‌ర్వాల్‌, ర‌కుల్ ప్రీత్ సింగ్, ప్రియా భ‌వానీ శంక‌ర్‌, ఎస్‌.జె.సూర్య‌, బాబీ సింహ త‌దిత‌రులు ఇత‌ర కీల‌క పాత్ర‌ల్లో న‌టిస్తున్నారు. ఈ చిత్రానికి అనిరుద్ ర‌విచంద్ర‌న్ సంగీతాన్ని అందిస్తున్నారు. బి.జ‌య‌మోహ‌న్‌, క‌బిల‌న్ వైర‌ముత్తు, ల‌క్ష్మీ శ‌ర‌వ‌ణ‌ కుమార్‌ల‌తో క‌లిసి డైరెక్ట‌ర్ శంక‌ర్ స్క్రీన్ ప్లే అందిస్తున్నారు.

విక్రమ్ బాటలో 'భారతీయుడు' - లోకేశ్ ఫార్ములా సక్సెస్ అవుతుందా? - Bharateeyudu 2 Movie

'కమల్ హాసన్ తప్ప ప్రపంచంలో ఎవరూ ఆలా చేయలేరు' - INDIAN 2

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.