ETV Bharat / entertainment

ఆ ముగ్గురి వల్లే కమల్​కు ఛాన్స్​!- 'ఇండియన్' మిస్ చేసుకున్న స్టార్స్ ఎవరంటే? - Kamal Haasan Indian 2 - KAMAL HAASAN INDIAN 2

Kamal Haasan Indian : 'ఇండియన్' సినిమాతో సూపర్ క్రేజ్ సంపాదించుకున్నారు స్టార్ హీరో కమల్​ హాసన్. 1996లో విడుదలైన ఈ మూవీ ఆయన కెరీర్​లో సూపర్ సక్సెస్​ చిత్రంగా రికార్డుకెక్కింది. అయితే వాస్తవానికి ఈ సినిమాలో కమల్ నటించాల్సిందే కాదట. ఆయన స్థానంలో మరోక స్టార్ హీరోను దృష్టిలో ఉంచుకుని శంకర్ ఈ కథను రాశారట. ఇంతకీ ఆయన ఎవరంటే?

Etv Bharat
Etv Bharat (Etv Bharat)
author img

By ETV Bharat Telugu Team

Published : Jul 11, 2024, 7:49 PM IST

Kamal Haasan Indian 2 : సౌత్​తో పాటు నార్త్​లోనూ మంచి క్రేజ్ సంపాదించుకున్న సినిమాల్లో 'ఇండియన్' ఒకటి. లోకనాయకుడు కమల్​హాసన్, డైరెక్టర్ శంకర్ కాంబినేషన్​లో 1996లో వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద సూపర్ సెన్సేషన్ క్రియేట్ చేసింది. అంతే కాకుండా కమల్ కెరీర్​లో బిగ్గెస్ట్​ హిట్​గా నిలిచింది. ఆ సమయంలోనే అత్యధిక బడ్జెట్లో తెరకెక్కిన ఈ చిత్రం వసూళ్లు కూడా అందుకు తగ్గట్లుగానే సాధించింది. సుమారు 28 ఏళ్ల తర్వాత ఇప్పుడీ చిత్రానికి సీక్వెల్ రానుంది. మరికొద్ది గంటల్లో థియేటర్లలో సందడి చేయనున్న ఈ సినిమాపై అభిమానుల్లో భారీ అంచనాలే ఉన్నాయి.

అయితే 'ఇండియన్' చూసిన తర్వాత కమల్ తప్ప సేనాపతి పాత్రకు మరొ హీరో న్యాయం చేయలేరని చాలా మంది అభిప్రాయపడ్డారు. తండ్రీగానే కాకుండా కొడుకుగానూ తన యాక్టింగ్​తో అదరగొట్టారు కమల్. దీంతో ఇండియన్ 2 లోనూ సేనపతి పాత్రను మరింత కొత్తగా చూపించేందుకు మేకర్స్ తగినన్ని జాగ్రత్తలు తీసుకున్నారు. అయితే వాస్తవానికి ఈ సినిమాలో కమల్ నటించాల్సిందే కాదట. ఆయన స్థానంలో మరోక స్టార్ హీరోను దృష్టిలో ఉంచుకుని శంకర్ ఈ కథ రాశారట. ఇంతకీ ఆయన ఎవరంటే?

డైరెక్టర్ శంకర్ ఈ సినిమా కథను కోలీవుడ్​ సూపర్ స్టార్ రజినీకాంత్‌ను దృష్టిలో ఉంచుకుని రాశారట. అయితే స్టోరీని పట్టాలెక్కించే సమయంలో రజినీ అందుబాటులో లేకపోవడం వల్ల మూవీ టీమ్​ కమల్‌ను సంప్రదించారట. అయితే కమల్ కూడా నో చెప్తే శంకర్ మరో ఇద్దరు హీరోలను అప్రోచ్ అవ్వాలనుకున్నారట. వారెవరో కాదు టాలీవుడ్ స్టార్ హీరోలైన రాజశేఖర్, వెంకటేశ్​.

తాజాగా ఈ విషయాన్ని ఒకప్పటి శంకర్ అసిస్టెంట్, ప్రస్తుత డైరెక్టర్ వసంత బాలన్ ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు. కమల్ ఓకే చెప్పకుంటే రాజశేఖర్‌కు సేనాపతి పాత్ర, అలాగే కొడుకు ప్లేస్​లో వెంకటేశ్​ను చూపించాలని శంకర్ అనుకున్నారట. అయితే స్టోరీ విన్న తర్వాత తండ్రీకొడుకులిద్దరి పాత్రలు నచ్చి వాటిని తనే చేస్తానంటూ కమల్ అన్నారట. దీంతో శంకర్ ఆ ఐడియాకు ఓకే చెప్పారట.

డైరెక్టర్ శంకర్ బిగ్ సర్​ప్రైజ్- 'ఇండియన్ 3' ట్రైలర్​ రిలీజ్ అక్కడే!

'భారతీయుడు 2' - వారందరికి ఎంతో కీలకం! - Indian 2 Movie

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.