ETV Bharat / entertainment

లిరిసిస్ట్​గా మారిన కమల్ హాసన్- 2గంటల్లోనే రికార్డింగ్ కూడా కంప్లీట్ - Kamal Haasan Thug Life - KAMAL HAASAN THUG LIFE

Kamal Haasan Thug Life: కోలీవుడ్ స్టార్ హీరో కమల్ హాసన్ లిరిసిస్ట్​గా మారారు. మణిరత్నం తెరకెక్కిస్తున్న థగ్​లైఫ్​ సినిమాలో ఓ పాట రాశారు.

Kamal Haasan
Kamal Haasan
author img

By ETV Bharat Telugu Team

Published : Apr 28, 2024, 8:58 AM IST

Updated : Apr 28, 2024, 9:52 AM IST

Kamal Haasan Thug Life: కోలీవుడ్ స్టార్ హీరో కమల్ హాసన్ తన కెరీర్​లో ఆనేక పాత్రలు పోషించి ప్రేక్షకులను మెప్పించారు. సినీ ఇండస్ట్రీలో ఆయన ఓ మల్టీ టాలెంటెడ్. హీరోగానే కాకుండా ఆయన పలు సినిమాలకు స్క్రిప్ట్ రైటర్​గా, ప్రొడ్యూసర్​గా, డాన్స్ కొరియోగ్రాఫర్​గా, దర్శకుడిగా పనిచేసి అన్నింట్లోనూ సక్సెస్ అయ్యారు. తాజాగా కమల్ ఆయనలోని మరో టాలెంట్​ను ఆడియెన్స్​కు పరిచయం చేయనున్నారు.

హీరో కమల్ తాజాగా లిరిసిస్ట్​గా మారారు. తమిళ ప్రముఖ డైరెక్టర్ మణిరత్నం తెరకెక్కిస్తున్న 'థగ్​లైఫ్' మూవీలో కమల్ ఓ పాట రాశారు. అయితే ఇందులో మరింత ఇంట్రెస్టింగ్ మ్యాటర్ ఏంటంటే? ఆయన ఈ పాటను కేవలం 2 గంటల్లోనే రాసి, రికార్డింగ్ పనులు కూడా కంప్లీట్ చేశారట. దీంతో ఈ విషయం తెలుసుకున్న మూవీ లవర్స్​ కమల్​ను తెగ పొగిడేస్తున్నారు.

ఇక ఈ సినిమాలో కమల్ హాసన్​తోపాటు సీనియర్ హీరోయిన్ త్రిష కృష్ణన్, ఐశ్వర్య లక్ష్మి కీలత పాత్రల్లో నటిస్తున్నారు. జయం రవి, జోగు జార్జి, పంకజ్ త్రిపాఠి, నాజర్, గౌతమ్ కార్తిక్ తదితరులు ఆయా పాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమాకు మణిరత్నం దర్శతక్వం వహిస్తుండగా రాజ్​కమల్ ఇంటర్నేషనల్ ఫిల్మ్స్​ అండ్ మద్రాస్ టాకీస్ బ్యానర్​పై కమల్ హాసన్, శివ అనంతి, ఆర్ మహేంద్రన్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఆస్కార్ అవార్డ్ విన్నర్ ఏఆర్ రెహమాన్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నారు.

Bharateeyudu 2: త్వరలో కమల్ హాసన్ 'భారతీయుడు 2' సినిమాతో థియేటర్లలో సందడి చేయనున్నారు. ఈ సినిమా 2024 జూన్ 1న వరల్డ్​వైడ్​గా రిలీజ్ కానున్నట్లు మేకర్స్ ఇదివరకే ప్రకటించారు. 1996లో సూపర్ హిట్ టాక్ అందుకున్న 'భారతీయుడు' సీక్వెల్​గా ఈ సినిమా తెరకెక్కింది. దీంతో ఈ సినిమా అభిమానుల్లో అంచనాలు మరింత పెరిగిపోయాయి. కమల్​ హాసన్​తో పాటు సిద్ధార్థ్​, రకుల్ ప్రీత్ సింగ్​, ఎస్​జే సూర్య, కాజల్ అగర్వాల్, ప్రియా భవాని శంకర్, వివేక్, గుల్షన్ గ్రోవర్, సముద్రఖని, జాకీర్ హుస్సేన్, బాబీ సింహా, దిల్లీ గణేశ్, పీయూశ్ మిశ్రా, నీడుముడి వేణు, బ్రహ్మానందం కీలక పాత్రలు పోషించారు. లైకా ప్రొడక్షన్స్, రెడ్ జెయింట్ మూవీస్ సంస్థలు సంయుక్తంగా నిర్మించారు. ప్రముఖ మ్యూజిక్​ డైరెక్టర్ అనిరుధ్ రవిచంద్రన్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

'సేనాపతి తిరిగి వచ్చేస్తున్నాడు'- భారతీయుడు 2 రిలీజ్ ఎప్పుడంటే ? - Bharateeyudu 2 Release Date

'ఇండియన్-2' ఇంట్రో రిలీజ్​, 'భారతీయుడుకు చావే లేదు' అంటున్న కమల్

Last Updated : Apr 28, 2024, 9:52 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.