ETV Bharat / entertainment

రాములమ్మ ఈజ్ బ్యాక్​ - పోలీస్​ ఆఫీసర్​గా విజయశాంతి ​పవర్​ఫుల్ గ్లింప్స్​ చూశారా? - NKR21 Vijayashanthi Birthday

author img

By ETV Bharat Telugu Team

Published : Jun 24, 2024, 12:46 PM IST

Updated : Jun 24, 2024, 12:58 PM IST

NKR21 Vijayashanthi Birthday Glimpse : NKR21 మూవీలో టాలీవుడ్ సీనియ‌ర్ న‌టి విజ‌య‌శాంతి కీల‌క పాత్ర‌లో న‌టిస్తున్న‌ సంగతి తెలిసిందే. అయితే నేడు(జూన్​ 24) విజ‌య‌శాంతి పుట్టినరోజు సంద‌ర్భంగా మూవీ నుంచి రాముల‌మ్మ ఫ‌స్ట్ లుక్‌తో పాటు స్పెష‌ల్ అండ్​ పవర్​ఫుల్​ గ్లింప్స్ రిలీజ్ చేశారు.

Source ETV Bharat
vijayshanthi (Source ETV Bharat)

NKR21 Vijayashanthi Birthday Glimpse : టాలీవుడ్​ స్క్రీన్​పై లేడీ ఓరియెంటెడ్ చిత్రాలతో విజయాలు అందుకున్న నటి విజయశాంతి. హీరోలకు దీటుగా యాక్షన్ ఎపిసోడ్స్​లో నటించి సంచలనం సృష్టించారు. లేడీ అమితాబ్​, లేడీ సూపర్ స్టార్​గా పేరు సంపాదించుకున్నారు. అయితే ఆమె నటించిన పలు హిట్​ చిత్రాల్లో కర్త్యవం కూడా ఒకటి. తెలుగు తెరపై ఒక చరిత్ర సృష్టించిన ఈ చిత్రంలో పోలీస్​ ఆఫీసర్​ వైజయంతిగా నటించి విజయశాంతి సూపర్ స్టార్ అయ్యారు. అప్పటి వరకు పోలీసు పాత్రలో ఇతర ఏ నటి కూడా అంత పవర్ ఫుల్​గా నటించలేదు. కానీ విజయశాంతి మాత్రం నటించి సెన్సేషన్ క్రియేట్ చేశారు. ఆ సినిమా అప్పట్లో ప్రేక్షకులపై చాలా ప్రభావం చూపించింది. ఎందరికో స్ఫూర్తిని కూడా ఇచ్చింది.

అయితే ఇప్పుడు చాలా ఏళ్ల తర్వాత మళ్ళీ విజయశాంతి పోలీస్​ ఆఫీసర్ వైజయంతి​గా కనపడనున్నారు. అది నంద‌మూరి క‌ల్యాణ్‌రామ్ చిత్రం కోసం. డెవిల్ సక్సెస్‌ తర్వాత నంద‌మూరి క‌ల్యాణ్‌రామ్ ప్ర‌ధాన పాత్ర‌లో న‌టిస్తున్న లేటెస్ట్ మూవీ NKR21. యాక్షన్​ జానర్‌లో రానున్న ఈ చిత్రంతో ప్రదీప్ చిలుకూరి దర్శకుడిగా పరిచయమవుతున్నారు. అయితే నేడు(జూన్​ 24) విజ‌య‌శాంతి పుట్టినరోజు సంద‌ర్భంగా మూవీ నుంచి రాముల‌మ్మ ఫ‌స్ట్ లుక్‌తో పాటు స్పెష‌ల్ అండ్ పవర్​ఫుల్​ గ్లింప్స్ రిలీజ్ చేశారు మేకర్స్​.

"వైజ‌యంతి ఐపీఎ. తను పట్టుకుంటే పోలీసు తుపాకీకి ధైర్యం వస్తుంది. వేసుకుంటే యూనిఫామ్​కు పౌరుషం వస్తుంది. తనే ఒక యుద్ధం. నేనే తన సైన్యం" అంటూ విజయ శాంతిని ఉద్దేశిస్తూ కల్యాణ్ రామ్​ చెప్పే డైలాగ్​ గూస్​ బంప్స్​ తెప్పిస్తోంది. ఇందులో విజయ శాంతి యాక్షన్ మోడ్​లోనూ కనిపించింది. బ్యాక్​గ్రౌండ్ మ్యూజిక్ కూడా అదిరిపోయింది. కాగా, సినిమాను అశోక క్రియేషన్స్ నిర్మిస్తోంది. అశోక్‌ వర్ధన్‌ ముప్ప, సునిల్ బలుసు, ఎన్టీఆర్‌ ఆర్ట్స్‌తో కలిసి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇప్ప‌టికే ఈ మూవీ నుంచి విడుదలైన క‌ల్యాణ్ రామ్ ఫ‌స్ట్ లుక్ కూడా ప్రేక్ష‌కుల‌ను ఆక‌ట్టుకుంది.

ఈ వారం థియేటర్లలో ఒక్కటే సినిమా - కానీ OTTలో మాత్రం బోలెడు! - This Week Theatre OTT Releases

దీపికను ఆటపట్టించిన ప్రభాస్​ - ఈ ఫన్నీ వీడియో చూశారా? - Kalki 2898 AD Movie

Last Updated : Jun 24, 2024, 12:58 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.