ETV Bharat / entertainment

ఆ దేశంలో 'కల్కి' రిలీజ్​కు సన్నాహాలు - మేకర్స్​ అఫీషియల్ అనౌన్స్​మెంట్​ - Kalki 2898 AD RRR Movies - KALKI 2898 AD RRR MOVIES

Kalki 2898 AD Movie : 'కల్కి' చిత్రాన్ని ఆ దేశంలో రిలీజ్​ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు మేకర్స్​. పూర్తి వివరాలు స్టోరీలో.

source ETV Bharat
Kalki 2898 AD Movie (source ETV Bharat)
author img

By ETV Bharat Telugu Team

Published : Aug 28, 2024, 8:23 AM IST

Kalki 2898 AD Release in Russia : అంతర్జాతీయ వేదికపై ఇండియన్ సినిమాలు సత్తా చాటుతున్న సంగతి తెలిసిందే. తాజాగా రష్యాలో జరుగుతోన్న మాస్కో ఇంటర్నేషనల్‌ ఫిల్మ్‌ వీక్‌లో భారతీయ చిత్రాలు సినీ ప్రేక్షకుల్ని ఆకట్టుకున్నాయి. సాధారణంగానే రష్యా సినీ ప్రియులు భారతీయ చిత్రాలను ప్రత్యేకంగా ఆదరిస్తారన్న సంగతి తెలిసిందే. ఇప్పుడు తాజాగా 'ఆర్‌ఆర్‌ఆర్', 'కల్కి'పై కూడా మరోసారి తమ ప్రేమను చూపారు అక్కడి ప్రేక్షకులు.

ఈ 'ఆర్‌ఆర్‌ఆర్‌'(RRR), 'కల్కి 2898 ఏడీ'(Kalki 2898 AD) చిత్రాలను మాస్కో ఇంటర్నేషనల్ ఫిల్మ్​ వీక్​లో ప్రదర్శించగా వాటికి సంబంధించిన వీడియోలు గత రెండు రోజులుగా సోషల్‌ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. ఇది చూసిన ఇక్కడి సినీ అభిమానులు వాటిని తెగ షేర్ చేస్తూ ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

అయితే రెండేళ్ల క్రితమే విడుదలైన 'ఆర్‌ఆర్ఆర్‌'(RRR Russia) రష్యాలో భారీ విజయాన్ని దక్కించుకుంది. మెగా పవర్ స్టార్ రామ్​ చరణ్​, యంగ్ టైగర్ ఎన్టీఆర్ కలిసి నటించిన ఆ విజువల్‌ వండర్‌ మూవీని చూసేందుకు అక్కడి ప్రేక్షకులు థియేటర్లకు క్యూ కట్టారు. దీంతో ఇప్పుడు 'కల్కి' చిత్రాన్ని కూడా అక్కడ రిలీజ్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు తెలిపారు నిర్మాతలు. స్వప్న దత్‌, ప్రియాంక దత్‌లు 'కల్కి'(Kalki 2898 AD Russia) చిత్రాన్ని రష్యా భాషలో డబ్‌ చేయనున్నట్లు అఫీషియల్​గా అనౌన్స్ చేశారు. వచ్చే నెలలో అక్కడ ప్రేక్షకుల ముందుకు వస్తుందని తెలిపారు.

Kalki 2898 AD Movie Collections : కాగా, కల్కి 2898 ఏడీ సినిమా విషయానికొస్తే బాక్సాఫీస్ ముందు రూ.1100 కోట్లకుపైగా వసూళ్లను సాధించింది. నాగ్ అశ్విన్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో బిగ్ బీ అమితాబ్​ బచ్చన్​, యూనివర్సల్ స్టార్ కమల్ హాసన్​, హాట్ బ్యూటీస్​ దీపికా పదుకొణె, దిశా పటానీ సహా పలువురు కీలక పాత్రలు పోషించారు. ముఖ్యంగా అశ్వత్థామగా అమితాబ్ - భైరవగా ప్రభాస్ మధ్య వచ్చిన యాక్షన్ సన్నివేశాలు ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నాయి. త్వరలోనే రెండో భాగం కూడా రిలీజ్ కానుంది.

ప్రభాస్ 'జోకర్' - అర్షద్ వార్సి కాంట్రవర్సీ కామెంట్స్​పై ​స్పందించిన నాగ్​ అశ్విన్​ - Prabhas Joker Controversy

పికిల్‌ బాల్‌ గేమ్‌ ఆడిన సమంత - ఈ ముద్దుగుమ్మ ఎనర్జీ, ఫిట్​నెస్​కు ఫ్యాన్స్ ఫిదా! - Samantha World Pickleball League

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.