Kalki 2898 AD Movie Krishna Role : భారీ అంచనాలతో విడుదలైన కల్కి 2898 ఏడీ ఊహించిన దాని కన్నా అతి పెద్ద భారీ సక్సెస్ అందుకుంది. ప్రీమియర్ షోస్ నుంచే ఎపిక్ బ్లాక్ బస్టర్ టాక్ అందుకుని దూసుకెళ్తోంది. కథ, విజువల్స్‌తో పాటు ఊహించని గెస్ట్ రోల్స్‌తో ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. ఆడియెన్స్‌ను మరో ప్రపంచంలోకి తీసుకెళ్లింది.
అయితే ఈ చిత్రంలో కృష్ణుడిగా నటించిందెవరా? అని సినిమా చూసిన ప్రేక్షకులు, నెటిజన్లు తెగ ఆరా తీస్తున్నారు. దీంతో నెట్టింట్లో ఈ విషయం ఫుల్ హాట్ టాపిక్‌గా మారిపోయింది. ఎందుకంటే సినిమాలో కురుక్షేత్రం బ్యక్డ్రాప్తో సాగే కొన్ని సన్నివేశాల్లో కృష్ణుడి పాత్రధారి ముఖాన్ని చూపించలేదు. అయితే కృష్ణుడు పాత్ర పోషించిన వ్యక్తి నడక తీరును గమనించిన ప్రేక్షకులు కొందరు హీరో నాని అని అనుకుంటున్నారు. మరికొంతమంది ఇతర హీరోల పేర్లు చెబుతున్నారు.
Na dimak lo @urstrulyMahesh nuvve thirigav e scene ki
— అతడు (@vinays369) June 27, 2024
pic.twitter.com/BHneQyeFTX
ఈ క్రమంలోనే స్వయంగా కృష్ణుడు పాత్ర పోషించిన నటుడే సోషల్ మీడియా వేదికగా స్పందించారు. దీంతో అందరికీ సమాధానం దొరికింది. ఆయన మరెవరో కాదు తమిళ నటుడు కృష్ణ కుమార్ (కేకే). ఈయన చాలా మంది తెలుగు ప్రేక్షకులకు బాగానే పరిచయం. డబ్బింగ్ మూవీ ఆకాశం నీ హద్దురాలో నటించారు. సూర్య హీరోగా రూపొందిన ఈ చిత్రంలో ఆయనకు స్నేహితుడిగా కనిపించారు కేకే. అలానే ధనుశ్ మారన్‌లోనూ కీలక పాత్రలో కనిపించారు. వాస్తవానికి 2010లో కాదళగి చిత్రంతో సినిమాల్లో ఎంట్రీ ఇచ్చిన కేకేకు కల్కి ఐదో సినిమా.
ఇకపోతే ఈ చిత్రంలో విజయ్ దేవరకొండ అర్జునుడిగా నటించి ఆకట్టుకున్నారు. ఆయన యుద్ధంలో అశ్వత్థామపై బాణం వదులుతున్న సమయంలో చెప్పే లుక్స్, సంభాషణలు అదిరిపోయాయి. ఫ్యాన్స్ విజయ్ యాక్టింగ్‌కు ఫిదా అయిపోయారు. అలనే దర్శకులు రాజమౌళి, రామ్‌గోపాల్ వర్మ, అనుదీప్ కేవీ కూడా తమ పరిధి మేరకు బానే నటించారు. అయితే మలయాళ స్టార్ దుల్కర్ సల్మాన్ నటించిన పాత్రకు మంచి రివ్యూస్ వస్తున్నాయి. ఇంకా మృణాల్ ఠాకూర్, ఫరియా అబ్దుల్లా, మాళవిక నాయర్‌తో పాటు పలువురు ఇతర అతిథి పాత్రల్లో కనిపించి సర్ప్రైజ్ ఇచ్చారు.
'కల్కి 2898 ఏడీ' - ఇది మరో ప్రపంచానికి ఆరంభం - Kalki 2898 AD Movie Review