Kalki Overseas Collection: రెబల్ స్టార్ ప్రభాస్- నాగ్ అశ్విన్ కల్కి 2898 AD బౌండరీలు దాటుతూ రికార్డులు సృష్టిస్తోంది. ఇప్పటికే భారీ స్థాయిలో ఓపెనింగ్ డే వసూళ్లు చేసిన ఈ సినిమా నాలుగు రోజుల్లోనే రూ.500 కోట్ల క్లబ్లో చేరిపోయింది. అటు ఓవర్సీస్లోనూ కల్కి జోరు ప్రదర్శిస్తోంది. నార్త్ అమెరికాలో ఈ సినిమాకు విశేష ఆదరణ లభిస్తోంది. ఈ క్రమంలోనే ఓవర్సీస్లో రికార్డు స్థాయిలో వసూళ్లు సాధించింది.
ఫస్ట్ వీకెండ్ నార్త్ అమెరికాలో కల్కి కాసుల వర్షం కురిపిస్తోంది. 11+ మిలియన్ డాలర్ల కలెక్షన్ సాధించింది. ఈ క్రమంలో నార్త్ అమెరికాలో తొలి వీకెండ్ అత్యధిక వసూళ్లు సాధించిన తొలి భారతీయ సినిమాగా రికార్డు క్రియేట్ చేసింది.
ఇక సినిమాకు ఆల్ ఓవర్‌గా పాజిటివ్ టాక్ ఉండటం వల్ల రానున్న రోజుల్లో ఈ మూవీ కలెక్షన్లు మరింత పెరిగే ఛాన్స్ ఉన్నాయని సమాచారం. కాగా, నార్త్ అమెరికాలో అత్యధిక వసూళ్లు సాధించిన ఇండియన్ ఫిల్మ్స్‌లో టాప్ 2 సినిమాలు (కల్కి, బాహుబలి 2) కూడా ప్రభాస్‌వే కావడం విశేషం. ఇక కెనడాలోనూ ఈ సినిమా భారీ స్థాయిలోనే కలెక్షన్లు సాధించినట్లు తెలుస్తోంది. అంతేకాకుండా కెనడాలో రిలీజైన తెలుగు సినిమాల్లోకెల్లా అన్నింటికంటే అత్యధికంగా గ్రాస్ సాధించిందట.
For the first time, a film hits $11 MILLION in its first weekend in North America 💥💥#Kalki2898AD ~ North America ~ $11M & Counting 🔥#EpicBlockbusterKalki #Prabhas @VyjayanthiFilms @Kalki2898AD @PrathyangiraUS pic.twitter.com/WX2QauNcUf
— Kalki 2898 AD (@Kalki2898AD) July 1, 2024
నాలుగు రోజుల్లో కల్కి ఓవర్సీస్ కలెక్షన్సు (ప్రీమియర్స్‌తో కలిపి)
- యూకే- రూ.9.38 కోట్లు
- ఆస్ట్రేలియా- రూ.9.18 కోట్లు
- జర్మనీ- రూ.1.30 కోట్లు
- న్యూజిలాండ్- రూ.93.75 లక్షలు
హిందీలో హవా
దేశవ్యాప్తంగా తెలుగుతోపాటు పలు భాషల్లో కల్కికి ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్నారు. ఈ క్రమంలో కల్కి హిందీలోనూ రికార్డు స్థాయిలో వసూళ్లు సాధిస్తోంది. నాలుగు రోజుల్లో రూ.115+ కోట్ల గ్రాస్ వసూల్ చేసినట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు.
ఇదిలా ఉంటే, జూన్ 27న రిలీజైన ఈ మూవీ సూపర్ సక్సెస్ సాధించింది. దీంతో వచ్చే ఏడాది నాటికి కల్కి సీక్వెల్ తీసుకురావాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారట. క్రియేటివ్ డైరెక్టర్ అని ప్రూవ్ చేసుకున్న నాగ్ అశ్విన్ యానిమేషన్‌తో కురుక్షేత్ర యుద్ధ సన్నివేశాలను కళ్లకు కట్టినట్లుగా చూపించగలిగారు. బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ స్కోరును అందించిన సంతోష్ నారాయణన్ మంచి మార్కులు పడ్డాయి. నిర్మాత అశ్వనీదత్ ఈ సినిమాను భారీ బడ్జెట్‌తో రూపొందించారు.
धन्यवाद 🙏🏻
— Kalki 2898 AD (@Kalki2898AD) July 1, 2024
A historic milestone ❤️🔥#Kalki2898AD’s Hindi version crosses ₹115 CRORES+ NBOC in the first weekend in India.#EpicBlockbusterKalki in cinemas - https://t.co/z9EmiReie8@SrBachchan @ikamalhaasan #Prabhas @deepikapadukone @nagashwin7 @DishPatani @Music_Santhosh… pic.twitter.com/CGJcV8Wt8e
బాక్సాఫీస్ వద్ద కల్కి జోరు- 4 రోజుల్లోనే రూ.500 కోట్లు క్రాస్!