ETV Bharat / entertainment

బాలయ్య సినిమా స్ఫూర్తితోనే కల్కి!: నాగ్ అశ్విన్ - Director Nag Ashwin

author img

By ETV Bharat Telugu Team

Published : Jul 14, 2024, 11:03 AM IST

Nag Ashwin Inspiration: టాలీవుడ్ యంగ్ డైరెక్టర్ నాగ్ అశ్విన్ మూడో సినిమాతోనే రూ.1000కోట్ల క్లబ్​లో చేరారు. దీంతో తక్కువ కాలంలోనే ఇండస్ట్రీలో స్టార్ డైరెక్టర్ ట్యాగ్ అందుకున్నారు. మరి ఆయన ఏ స్ఫూర్తితో సినిమాలు తీస్తున్నారంటే?

Nag Ashwin kalki
Nag Ashwin kalki (Source: ETV Bharat)

Nag Ashwin Inspiration: ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో ప్రస్తుతం ఎక్కువగా వినిపిస్తున్న పేరు 'నాగ్ అశ్విన్'. ప్రభాస్ లీడ్​ రోల్​లో అశ్విన్ హాలీవుడ్ రేంజ్​లో తెరకెక్కించిన 'కల్కి 2898 ఏడీ' సినిమా జూన్ 27న రిలీజై బాక్సాఫీస్ వద్ద బ్రేకుల్లేకుండా దూసుకెళ్తోంది. ఈ సినిమా కోసం దర్శకుడు నాగ్ అశ్విన్ కొత్త ప్రపంచాన్ని సృష్టించారు. హై క్వాలిటీ వీఎఫ్ ఎక్స్​, సీజీ వర్క్స్​తో వండర్స్ క్రియేట్ చేశారు. ఫలితంగా కెరీర్​లో తీసిన మూడో సినిమాతోనే అశ్విన్ రూ.1000కోట్ల క్లబ్​లో చేరిపోయారు. ఈ నేపథ్యంలో ఆయన స్ఫూర్తి, సక్సెస్ మంత్ర ఏంటో ఆయన మాటల్లోనే తెలుసుకుందాం.

'చాలామంది తమ జీవితంలో ఎవరినో ఒకరిని స్ఫూర్తిగా తీసుకుంటారు. తాము చేసే పనుల్లోనూ ఎవరిదో ఒకరి ప్రభావం ఉంటుంది. అయితే నా విషయంలో అది పూర్తి భిన్నం. నాకు స్ఫూర్తినిచ్చింది వ్యక్తులు కాదు. నాకు ఎంతో ఇష్టమైన 'మాయాబజార్', 'భైరవ ద్వీపం', 'పాతాళభైరవి', 'స్టార్ వార్స్​', 'మార్వెల్ సిరీస్​' సినిమాలు. ఇవి ప్రేక్షకులను ఇంకో లోకంలోకి తీసుకువెళ్తాయి. అలాగే ఈ స్టోరీలు విన్నా, మన కళ్ల ఎదుట మరో ప్రపంచం కనిపిస్తుంది. ఈ సినిమాలు నా జీవితంలో నన్ను ఎంతగానో ప్రభావితం చేశాయి. నేను కూడా అలాంటి సినిమాలు తీయాలనే స్ఫూర్తిని నింపాయి. ఒక విధంగా 'కల్కి' ఆలోచన కూడ అక్కడ్నుంచి వచ్చిందే. స్టోరీతోపాటు సినిమాలో కొత్త కొత్త ప్రాంతాల ఆలోచనకు ఈ చిత్రాలే ఒక రకమైన కారణం.

కాగా, తన సినిమా రూ.1000 కోట్లు క్రాస్ చేయడం పట్ల డైరెక్టర్ నాగ్ అశ్విన్ సంతోషం వ్యక్తం చేశారు. ఇది తమ టీమ్ అందరి సక్సెస్ అని అన్నారు. 'ఇది (సినిమా రూ.1000కోట్లు వసూల్ చేయడం) మా టీమ్ విజయం మా టీమ్ విజయం. అయితే సినిమాలో ఎలాంటి అశ్లీలత, విద్వేశపూరిత డైలాగులు​, దోపిడి సన్నివేశాలు లేకుండా మేం ఈ ఘనత సాధించాం. నిజంగా మాకు ఇది ఘనమైన విజయం' అని అన్నారు.

'కల్కి' ఖాతాలో మరో ఘనత- RRR రికార్డ్ బ్రేక్

రూ.1000 కోట్ల క్లబ్​లోకి ప్రభాస్​ 'కల్కి'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.