Kalki 2898 AD BoxOffice Collection: రెబల్‌స్టార్ ప్రభాస్ భారీ బడ్జెట్ సినిమా 'కల్కి' జూన్ 27న రిలీజై థియేటర్లలో సందడి చేస్తోంది. సినిమాకు సూపర్ హిట్ రావడం వల్ల తొలిరోజు కాసుల వర్షం కురిసింది. ఓపెనింగ్ రోజే ఈ సినిమా ఏకంగా రూ.191.50 కోట్లు వసూల్ చేసి సంచలనం సృష్టించింది. ఇక రెండో రోజు కూడా కల్కి హౌస్‌పుల్ షోస్‌తో రన్ అయ్యింది.
దీంతో వరుసగా సెకండ్ డే కూడా రూ.100 కోట్ల కలెక్షన్ సాధించింది. ఈ మూవీ సెకండ్ డే వరల్డ్‌వైడ్‌గా రూ.107 కోట్లు వసూల్ చేసింది. దీంతో రెండు రోజుల్లో కల్కి రూ.298.50 కోట్ల కలెక్షన్ చేసినట్లు మూవీ టీమ్ అఫీషియల్‌గా ప్రకటించింది. ఇక మూడో రోజు వీకెండ్ కావడం వల్ల కలెక్షన్లు మరింత పెరిగే అవకాశం ఉంది. ఈ వీకెండ్లోనే కల్కి ఈజీగా రూ.400 కోట్ల మార్క్ అందుకోవడం పక్కా అని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.
The love is pouring in from all corners of the world! ❤️🔥#Kalki2898AD #EpicBlockbusterKalki @SrBachchan @ikamalhaasan #Prabhas @deepikapadukone @nagashwin7 @DishPatani @Music_Santhosh @VyjayanthiFilms @Kalki2898AD @saregamaglobal @saregamasouth pic.twitter.com/o2v5mfOiUN
— Kalki 2898 AD (@Kalki2898AD) June 29, 2024
యంగ్ డైరెక్టర్ నాగ్ అశ్విన్ ఈ సినిమాను సైన్స్ ఫిక్షన్ మైథలాజికల్ జానర్లో తెరకెక్కించారు. హై క్వాలిటీ విజువల్స్, గ్రాఫిక్స్‌తో హాలీవుడ్ రెంజ్లో సినిమాను రూపొందించారు. ఈ చిత్రానికి అన్ని వర్గాల ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ వస్తోంది. సినిమా కోసం ప్రత్యేకంగా బుజ్జి (కారు)ని డిజైన్ చేశారు. మూవీ ప్రమోషన్స్ టైమ్‌లో దేశంలోని పలు నగరాల్లో ఈ కారును రోడ్లపై తిప్పారు.
ఇక ప్రభాస్‌తోపాటు ఈ సినిమాలో బాలీవుడ్ బిగ్ బి అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, బ్యూటీ దిపికా పదుకొణె, దిశా పటానీ నటించారు. ఇక యంగ్ హీరోలు దుల్కర్ సల్మాన్, విజయ్ దేవరకొండ, రాజమౌళి ప్రత్యేక పాత్రల్లో కనిపించారు. భారీ బడ్జెట్‌తో అశ్వినీ దత్ ఈ సినిమా నిర్మించగా, సంతోష్ నారాయణ్ సంగీతం అందించారు.
కల్కి 2 60 శాతం పూర్తి
కల్కి- 2 ప్రాజెక్ట్‌పై ప్రొడ్యూసర్ అశ్వినీ దత్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. కల్కి సక్సెస్‌పై మాట్లాడున్న సందర్భంలో ఆయన సీక్వెల్ గురించి ప్రస్తావించారు. కల్కి- 2 దాదాపు 60 శాతం షూటింగ్ పూర్తి అయ్యిందని అన్నారు. కొన్ని కీలక సన్నివేశాలు ఇంకా చిత్రీకరించాల్సి ఉందన్నారు. ఇక ఈ సీక్వెల్ రిలీజ్ డేట్ గురించి ఇంకా ఓ నిర్ణయానికి రాలేదని అశ్వినీదత్ అన్నారు.
'కల్కి' నుంచి కాంప్లెక్స్ సాంగ్ రిలీజ్ - సినిమాపై రజనీకాంత్ రివ్యూ - Kalki 2898 AD Movie
'కల్కి' కలెక్షన్స్ - రెండో రోజు ఎన్ని కోట్లు వచ్చాయంటే? - Kalki 2898 AD Day 2 Collections