ETV Bharat / entertainment

ఆ బాలీవుడ్​ హీరోయిన్​తో సినిమా - అసలు విషయం బయటపెట్టిన 'కల్కి' నాగ్ అశ్విన్! - NAG ASHWIN ALIA BHATT MOVIE

బాలీవుడ్​ హీరోయిన్​తో సినిమా చేసే విషయంపై స్పష్టత ఇచ్చిన దర్శకుడు నాగ్ అశ్విన్!

Kalki  Nag Ashwin
Kalki Nag Ashwin (source Getty Images)
author img

By ETV Bharat Telugu Team

Published : Nov 11, 2024, 2:54 PM IST

Nag Ashwin Alia Bhatt Movie : 'కల్కి' చిత్రంతో అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు నాగ్‌ అశ్విన్‌ ప్రస్తుతం కల్కి సీక్వెల్ పనుల్లో బిజీగా ఉన్నారు. అయితే కల్కి 2 కాకుండా ఆయన తర్వాతి ప్రాజెక్ట్‌ ఏంటనే విషయంపై సినీ ప్రియుల్లో భారీగా ఆసక్తి నెలకొన్న సంగతి తెలిసిందే.

ఈ క్రమంలోనే నాగ్ అశ్విన్ ఓ బాలీవుడ్‌ హీరోయిన్​తో లేడీ ఓరియంటెడ్‌ సినిమా తెరకెక్కిస్తారని వార్తలు వినిపించాయి. గతంలో నాగ్‌ అశ్విన్‌ గతంలో హీరోయిన్ కీర్తి సురేశ్‌తో మహానటి సినిమా చేసి అందరి ప్రశంసలు అందుకున్న సంగతి తెలిసిందే. ఇదే తరహాలో ఇప్పుడు అలియా భట్​తో కూడా ఓ చిత్రం చేస్తారని కొన్ని రోజులుగా బాలీవుడ్‌ మీడియాల్లో కథనాలు కనిపించాయి. ఈ ప్రాజెక్ట్‌ కోసం ఇప్పటికే అలియా భట్​​తో చర్చలు కూడా జరిపినట్లు అందులో రాసి ఉంది.

తాజాగా ఈ విషయంపై దర్శకుడు నాగ్ అశ్విన్ స్పందించారు. ఓ ఆంగ్ల మీడియాతో మాట్లాడుతూ అలియా భట్​తో సినిమా గురించి క్లారిటీ ఇచ్చారు. ఈ వార్తలన్నీ అవాస్తమేనని స్పష్టత ఇచ్చారు. అలాగే తన తర్వాత సినిమా కల్కి 2 అని మాత్రమే చెప్పుకొచ్చారు. ప్రస్తుతం తాను కల్కి 2 సినిమా పనుల్లో మాత్రమే బిజీగా ఉన్నట్లు అన్నారు. దీంతో వైరల్​గా మారిన రూమర్స్‌కు తెరపడినట్టైంది.

ఆ దేశంలో రిలీజ్​కు సిద్ధమైన కల్కి - నాగ్ అశ్విన్ దర్శకత్వంలో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్‌ హీరోగా వచ్చిన కల్కి 2898 ఏడీ ఎంతటి భారీ విజయన్ని సాధించిందో తెలిసిన విషయమే. అయితే ఇప్పుడీ చిత్రం జపాన్ ఆడియెన్స్​ను అలరించేందుకు సిద్ధమైంది. జనవరి 3వ తేదీ జపాన్‌లో విడుదల కానుంది. తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన టీజర్‌ను రిలీజ్​ చేయగా అక్కడ ప్రేక్షకాదరణను దక్కించుకుంది.

Kalki 2898 AD Part 2 Shooting : కల్కి పార్ట్‌ 2 చిత్రీకరణ వచ్చే ఏడాది జనవరి లేదా ఫిబ్రవరిలో ప్రారంభించే అవకాశం కనిపిస్తోంది. షూటింగ్ ప్రారంభమైన తర్వాత రెండో భాగానికి సంబంధించిన మరిన్ని అప్‌డేట్స్‌ ఇస్తామని నిర్మాతలు గతంలో చెప్పుకొచ్చారు. మొదటి భాగం షూటింగ్ సమయంలోనే రెండో పార్ట్‌కు సంబంధించి కొన్ని సీన్స్​కు కూడా చిత్రీకరించారు. మరి కొన్ని కీలక సన్నివేశాలతో పాటు వీఎఫ్‌ఎక్స్‌ పనులు పూర్తి చేయాల్సి ఉంది.

ట్రెండింగ్​లో 'గేమ్​ఛేంజర్' టీజర్ - 24గంటల్లోనే 55 మిలియన్ వ్యూస్!

సంక్రాంతి రేసులో 4 సినిమాలు! - అయినా ఈ సీజన్‌ వారిద్దరిదే!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.