ETV Bharat / entertainment

దీపికా పదుకొణె రేర్​ ఫీట్​ - రూ.1000 కోట్ల హ్యాట్రిక్ సక్సెస్​! - Kalki 2898 AD Deepika Padukone - KALKI 2898 AD DEEPIKA PADUKONE

Kalki 2898 AD Deepika Padukone 1000 Crore Collections : బాలీవుడ్ బ్యూటీ దీపికా పదుకొనే ఓ అరుదైన ఘనత సాధించింది. ఇతర హీరోయిన్లు సాధించని ఓ సూపర్ మార్క్​ను టచ్​ చేసింది. అదేంటంటే?

source Associated Press
Kalki 2898 AD Deepika Padukone (source Associated Press)
author img

By ETV Bharat Telugu Team

Published : Jul 17, 2024, 12:17 PM IST

Kalki 2898 AD Deepika Padukone 1000 Crore Collections : బాలీవుడ్ బ్యూటీ దీపికా పదుకొనే గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. తన అందం, ఫిట్​నెట్​, యాక్టింగ్​తో వరుస అవకాశాలను అందుకుంటూ కెరీర్​లో ముందుకెళ్లింది. ఈ క్రమంలోనే స్టార్ హీరోల సినిమాల్లోనూ అవకాశాలు దక్కించుకుని స్టార్ హీరోయిన్​గా ఎదిగింది. హీరో రణ్​వీర్ సింగ్​తో పెళ్లి జరిగాకా కూడా సినీ కెరీర్​ను కొనసాగించింది. అయితే ఇప్పుడీ ముద్దుగుమ్మ ఇండియన్ ఫిల్మ్​ ఇండస్ట్రీలో ఓ అరుదైన మార్క్​ను టచ్​ చేసింది. ఏడాది కాలంలో మూడు రూ.1000 కోట్ల గ్రాస్ వసూళ్ల సినిమాలతో హ్యాట్రిక్ విజయాలను ఖాతాలో వేసుకుంది.

రీసెంట్​గా దీపిక నటించిన 'కల్కి 2898 AD' చిత్రంతో దీపికా పదుకొణె టాలీవుడ్​కు ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. పాన్ ఇండియా రెబల్ స్టార్ ప్రభాస్, బిగ్ బీ అమితాబ్​, దర్శకుడు నాగ్ అశ్విన్ కాంబినేషన్​లో తెరకెక్కిన ఈ సైన్స్ ఫిక్షన్ చిత్రంలో సుమతి పాత్రలో నటించింది దీపిక. కల్కిని కడుపులో మోసిన యువతిగా మంచి నటన కనబరిచింది. ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా 15 రోజుల్లోనే రూ.1000 కోట్ల క్లబ్​లోకి అడుగుపెట్టింది. ఇంకా వసూళ్లను అందుకుంటూ దూసుకెళ్తోంది.

ఇకపోతే గతేడాది ప్రారంభంలో దీపికా పదుకొణె 'పఠాన్' చిత్రంతో ప్రేక్షకుల్ని అలరించింది. బాలీవుడ్ బాద్ షా షారుఖ్ ఖాన్​తో కలిసి యాక్షన్ చేసింది. సిద్దార్థ్ ఆనంద్ దర్శకత్వం వహించిన ఈ స్పై యాక్షన్ థ్రిల్లర్ బాక్సాఫీస్ ముందు దాదాపు రూ.1,050 కోట్లు వసూలు చేసింది.

ఇక అట్లీ దర్శకత్వంలో తెరకెక్కిన 'జవాన్'​లోనూ కనిపించింది. ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్​లో షారుక్ భార్యగా కనిపించి ఆకట్టుకుంది. బాక్సాఫీస్ ముందు ఈ చిత్రం రూ.1,148 కోట్ల వరకు కలెక్ట్ చేసింది. ఇలా దీపిక ఏడాది వ్యవధిలో మూడు రూ.1000 కోట్ల గ్రాస్ వసూళ్ల సినిమాల్లో భాగమైన తొలి నటిగా నిలిచింది. గతంలో ఆమె నటించిన హాలీవుడ్ చిత్రం 'త్రిపుల్ ఎక్స్'​ కూడా రూ.1000 కోట్లకు పైనే వసూలు చేసింది. ఇక హీరోలలో ప్రభాస్, షారుఖ్ ఖాన్ మాత్రమే చెరో రెండు సార్లు వెయ్యి కోట్లకు పైగా వసూళ్లను సాాధించారు.

'చిరు సాంగ్స్ అంటే విరాట్​కు చాలా ఇష్టం - ఆయన గురించి అడుగుతుంటాడు' - Virat Kohli Chiranjeevi Songs

OTTలోకి 9 మంది స్టార్​ హీరోలు కలిసి నటించిన సిరీస్​!- స్ట్రీమింగ్ ఎందులో అంటే? - Manorathangal OTT

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.