ETV Bharat / entertainment

ఆ హాలీవుడ్ మూవీకి​ కల్కి కాపీనా? - నాగ్‌ అశ్విన్‌ అదిరిపోయే ఆన్సర్​! - Prabhas Kalki 2898 AD - PRABHAS KALKI 2898 AD

Kalki 2898 AD Nag Ashwin : దర్శకుడు నాగ్​ అశ్విన్​ ప్రభాస్ కాంబోలో భారీ బడ్జెట్​తో తెరకెక్కుతోన్న సైన్స్ ఫిక్షన్ మూవీ కల్కి 2898 AD. ఈ చిత్రం హాలీవుడ్‌ మూవీ డ్యూన్‌ను చూసి కాపీ కొట్టారంటూ సామాజిక మాధ్యమాల్లో జోరుగా ప్రచారం సాగుతోంది. తాజాగా ఈ విషయంపై దర్శకుడు నాగ్‌ అశ్విన్​ ఒక్కసారిగా నవ్వేసి అదిరిపోయే సమాధానం ఇచ్చారు.

.
.
author img

By ETV Bharat Telugu Team

Published : Apr 29, 2024, 9:38 PM IST

Updated : Apr 29, 2024, 9:58 PM IST

Kalki 2898 AD Nag Ashwin : దర్శకుడు నాగ్​ అశ్విన్​ ప్రభాస్ కాంబోలో భారీ బడ్జెట్​తో తెరకెక్కుతోన్న సైన్స్ ఫిక్షన్ మూవీ కల్కి 2898 AD. మొదటి నుంచి ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నప్పటికీ మరోవైపు విమర్శలు కూడా వస్తూనే ఉన్నాయి. ఇప్పటివరకు విడుదలైన పోస్టర్లు, ప్రచార చిత్రాలు చూసి ఈ సినిమా హాలీవుడ్‌ మూవీ డ్యూన్‌ను చూసి కాపీ కొట్టారంటూ సామాజిక మాధ్యమాల్లో జోరుగా ప్రచారం సాగుతోంది.

తాజాగా ఈ విషయంపై ఓ ఇంటర్వ్యూలో దర్శకుడు నాగ్‌ అశ్విన్ స్పందించారు. ఒక్కసారిగా నవ్వేసి సెటైరికల్​గా అదిరిపోయే సమాధానం ఇచ్చారు. "అవునా. బహుశా సినిమాలో ఉన్న ఇసుకను చూసి అలా అనుకొని ఉంటారు. మీరు ఇసుక ఎక్కడ చూసినా డ్యూన్‌ మూవీలానే కనిపిస్తుంది" అని రిప్లై ఇచ్చారు. కాగా, కల్కిని ఇలా వేరే హాలీవుడ్‌ చిత్రాలతో పోల్చడం కొత్తేమి కాదు. గతంలోనూ పలు సినిమాల రిఫరెన్స్‌లు ఉన్నాయంటూ చాలా మంది అభిప్రాయపడ్డారు. అయితే మూవీటీమ్ మాత్రం వీటిని కొట్టిపారేస్తూ వస్తోంది. ఇప్పటివరకు తెలుగు తెరపై చూడని సరికొత్త ప్రపంచాన్ని ఆవిష్కరించబోతున్నట్లు చెబుతోంది.

Kalki 2898 AD New Release Date : కాగా, వాయిదా పడుతూ వస్తోన్న ఈ చిత్రం ఎట్టకేలకు రీసెంట్​గానే కొత్త రిలీజ్ డేట్​ను కన్ఫామ్​ చేసుకుంది. జూన్‌ 27న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానున్నట్లు మేకర్స్ అనౌన్స్ చేశారు. రీసెంట్​గా ఈ చిత్రం నుంచి విడుదలైన అమితాబ్‌ బచ్చన్​ అశ్వత్థామ పాత్ర ఇంట్రడ్యూస్ వీడియో సినిమాపై అంచనాలను మరింత పెంచింది. ఇంకా చిత్రంలో యూనివర్సల్ స్టార్ కమల్‌ హాసన్‌, బాలీవుడ్ బోల్డ్ బ్యూటీస్​ దీపికా పదుకొణె, దిశా పటానీ తదితరులు ఇతర కీలక పాత్రల్లో కనిపించనున్నారు. వైజయంతీ మూవీస్‌ ఈ చిత్రాన్ని దాదాపు రూ.500 కోట్ల బడ్జెట్​తో నిర్మిస్తోందని సినీ వర్గాల నుంచి సమాచారం అందుతోంది. చూడాలి మరి ఇంతటి భారీ తారాగణం ఉన్న ఈ సినిమా ఎలాంటి ఫలితాన్ని అందుకుంటుందో.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

ప్రశాంత్ వర్మ షాకింగ్ డెసిషన్- ఆ స్టార్ కోసం 'జై హనుమాన్' పోస్ట్​పోన్! - Prashanth Varma

మహేశ్​ను నమ్రత ముద్దుగా ఏమని పిలుస్తారో తెలుసా? - Mahesh babu Namratha

Last Updated : Apr 29, 2024, 9:58 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.