Kalki 2 Shooting : రెబల్ స్టార్ ప్రభాస్ లీడ్ రోల్లో తెరకెక్కిన 'కల్కి 2898 AD' మూవీ ఎంతటి ప్రభంజనాలు సృష్టిస్తోందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. రిలీజైనప్పటి నుంచి బాక్సాఫీస్‌లు షేక్ చేస్తూ రికార్డు స్థాయిలో కలెక్షన్లు అందుకుంటోంది. రిలీజై వారమైనప్పటికీ సూపర్ క్రేజ్‌తో థియేటర్లలో సందడి చేస్తోంది. అయితే ఈ సినిమా చూసిన ప్రేక్షకులతో పాటు ప్రభాస్ ఇచ్చిన హింట్ బేస్ చేసుకుని అభిమానులు ఈ మూవీకి సీక్వెల్ ఉంటుందని గట్టిగా ఫిక్స్ అయ్యారు.
తాజాగా చిత్ర నిర్మాత అశ్వనీదత్ కూడా ఈ విషయం గురించి క్లారిటీ ఇచ్చారు. 'కల్కి పార్ట్-2' షూటింగ్ ఈ ఏడాది చివర్లో ప్రారంభం అయ్యే అవకాశాలు ఉన్నాయంటూ సీక్రెట్‌ను రివీల్ చేశారు. అంతేకాకుండా 2025 సమ్మర్ కల్లా ఈ సినిమా థియేటర్లలో విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నట్లు తెలిపారు. దీంతో ప్రభాస్ ఫ్యాన్స్ సంబరాలు చేసుకుంటున్నారు. 'త్వరగా అఫీషియల్ అప్డేట్ ఇవ్వండి', 'పార్ట్ 2 కోసం వెయిటింగ్' అంటూ సోషల్ మీడియా వేదికగా కామెంట్లు పెడుతున్నారు.
భారీ అంచనాల నడుమ జూన్ 27న విడుదలైన ఈ మూవీ సినీప్రేక్షకులను కొత్త ప్రపంచంలోకి తీసుకెళ్లింది. బాలీవుడ్ స్టార్ హీరో అమితాబ్ బచ్చన్ అశ్వత్థామగా, కమల్ హాసన్ సుప్రీం యాస్కిన్‌గా తమ నటనతో అభిమానులను ఆకట్టుకున్నారు.
ఇక విజయ్ దేవరకొండ, దుల్కర్ సల్మాన్, మాళవిక నాయర్, మృణాల్ ఠాకూర్, రాజమౌళి లాంటి స్టార్స్ అతిథి పాత్రలతో అలరించారు. బౌంటీ ఫైటర్ భైరవగా సందడి చేసిన ప్రభాస్, చివరిలో కర్ణుడిగా కనిపించి పార్ట్ 2పై మరిన్ని అంచనాలు పెంచేశారు. దీపికా పదుకుణె, దిశా పటానీ పశుపతి, రాజేంద్ర ప్రసాద్, శోభన, బ్రహ్మానందం, అన్నా బెన్ తదితరులు కూడా తమ పాత్రల్లో చక్కగా ఒదిగిపోయారు.
కేవలం సౌత్‌లోనే కాకుండా నార్త్‌లోనూ ఈ సినిమాకు విశేష స్పందన లభిస్తోంది. అక్కడ కూడా రికార్డు స్థాయిలో కలెక్షన్లు సొంతం చేసుకుని అదరగొడుతోంది. ఇక ఓవర్సీస్లోనూ రెబల్ ఫ్యాన్స్ ఈ సినిమా చూసేందుకు బారులు తీస్తున్నారు.
ప్రభాస్ - ఒక్క పూట ఫుడ్ కోసం అన్ని లక్షలు ఖర్చు పెడతారా?
'కల్కి' బ్రేక్ చేసిన రికార్డులివే - ఇంతకీ అవి ఏంటంటే? - Kalki 2898 AD Movie Records