Kajal Aggarwal First Movie Auditions : సౌత్ ఇండస్ట్రీలో మోస్ట్ సక్సెస్ఫుల్ హీరోయిన్లలో ఒకరు కాజల్ అగర్వాల్. 'లక్ష్మీ కల్యాణం' సినిమాతో తన కెరీర్ ప్రారంభించిన ఈ చిన్నది, ఆ తర్వాత తెలుగు, తమిళం, హిందీ ఇలా అన్నీ భాషల్లోనూ పలు హిట్ సినిమాల్లో నటించి అనతికాలంలోనే స్టార్డమ్ పొందింది. రోల్ ఏదైనా సరే అలవోకగా నటించి అభిమానులను మెప్పిస్తుంటుంది.
అయితే ఈ చిన్నది తన తొలి ఆడిషన్స్ ఎలా ఇచ్చిందో తెలుసా ? ఇదే విషయాన్ని తాజాగా ఈటీవీలో ప్రసారమవుతున్న ఆలీతో సరదాగా సీజన్ 2లో చెప్పింది. తన అప్‌కమింగ్ మూవీ 'సత్యభామ' ప్రమోషన్స్‌లో భాగంగా డైరెక్టర్ సుమన్ చిక్కాలతో కలిసి షో లో సందడి చేసింది. తన కెరీర్‌తో పాటు పర్సనల్ విషయాల గురించి మాట్లాడింది.
"లైఫ్‌లో నా ఫస్ట్ ఆడిషన్స్ అది. తేజ నన్ను ఏడవమన్నారు. అయితే నేను నా లైఫ్‌లో ఏడవడానికి ఏం రీజన్ లేదు. నా మైండ్‌లో ఎటువంటి ఆలోచనలు రావట్లేదు. నేను ఏడవలేకపోతున్నా అని అన్నాను. వెంటనే మా నాన్న నాతో ఏదో అన్నారు. అది విని నాకు ఏడుపొచ్చింది. అలా ఆ ఆడిషన్స్‌లో నేను సెలక్ట్ అయ్యాను." అంటూ అప్పటి రోజులను గుర్తు చేసుకుంది.
పెళ్లి తర్వాత కాస్త గ్యాప్ తీసుకున్నప్పటికీ తన సెకెండ్ ఇన్నింగ్స్‌లో దూసుకెళ్తోంది. ఓ వైపు ఫ్యామిలీని బ్యాలెన్స్ చేస్తూనే మరోవైపు సినిమాల్లోనూ నటిస్తోంది. అయితే ఎప్పుడూ సాఫ్ట్ రోల్స్ చేస్తూ వచ్చిన కాజల్ ఇప్పుడు రూట్ మార్చి ఫీమేజ్ ఓరియెండట్ మూవీస్ చేసేందుకు ఆసక్తి చూపిస్తోంది.
ఇందులో భాగంగా 'సత్యభామ' అనే సినిమా అనౌన్స్ చేసింది. ఓ సూపర్ కాప్‌గా తన పరిధిలోనీ కేసులను సాల్వ్ చేస్తూ వస్తున్న సత్యభామ అనుకోకుండా ఓ అమ్మాయి హత్య కేసును ఛేదించేందుకు సిద్ధమవుతుంది. ఈ క్రమంలో ఆమె ఎదుర్కొన్న ఇబ్బందులు ఏమిటి ?అనే ఆసక్తికర కోణంలో ఈ సినిమా సిద్ధమైనట్లు టీజర్లో చూపించారు మేకర్స్. ఇక కాజల్ తనలోని యాక్షన్ కోణాన్ని చూపించి ప్రేక్షకులను అబ్బురపరిచింది. విలన్లను చితక్కొడుతూ సూపర్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో మెరిసింది. ఇక మే 17న ఈ సినిమా విడుదలకు సిద్ధం కానుంది.
- " class="align-text-top noRightClick twitterSection" data="">