Kajal Aggarwal Favourite Hero : పెళ్లి అయ్యి ఓ బిడ్డకు తల్లి అయినా కూడా వన్నె తరగని అందంతో ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది చందమామ కాజల్ . ఇటీవలే వచ్చిన 'భగవంత్ కేసరి'లో తన నటనతో అలరించింది ఈ భామ. పెళ్లి తర్వాత సినిమాలకు కాస్త గ్యాప్ ఇచ్చిన ఈ చిన్నది తన సెకెండ్ ఇన్నింగ్స్‌లోనూ మరిన్ని అవకాశాలను అందుకుంటూ బిజీ బిజీగా ఉంది. ఇప్పటి హీరోయిన్స్ కు ఏమాత్రం తగ్గేదే లేదు అంటుంది.
ప్రస్తుతం కాజల్ సత్యభామ అనే లేడీ ఓరియెంటడ్ సినిమాలో నటిస్తోంది. ఇందులో ఆమె ఓ సూపర్ పోలీస్ ఆఫీసర్‌గా కనిపించనుంది. ఇప్పటికే విడుదలైన టీజర్లో తన యాక్షన్ చూసి అభిమానులు షాకయ్యారు. ఈ సినిమా కోసం ఎంతగానో ఎదురుచూస్తున్నారు. అయితే తాజాగా కాజల్ ఓ ఇంటర్వ్యూలో పాల్గొని తన కెరీర్‌కు సంబంధించిన ఆసక్తికరమైన విషయాలు పంచుకుంది. ఇందులో భాగంగా తన ఫేవరట్ హీరో పేరును రివీల్ చేసింది. అలా టాలీవుడ్ టాప్ హీరో యంగ్ టైగర్ పై అభిమానం కురిపించింది. ఎన్టీఆర్ తో నటించడం అంటే తనకు చాలా ఇష్టమని చెప్పుకొచ్చింది. కాజల్ - ఎన్టీఆర్ కాంబోలో 'బృందావనం', 'బాద్ షా', 'టెంపర్' సినిమాల్లో జోడీగా నటించింది. జనతా గ్యారేజీలో ఒక స్పెషల్ సాంగ్ ఎన్టీఆర్ తో డ్యాన్స్ అదరగొట్టింది.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
2007లో 'లక్ష్మీ కల్యాణం' సినిమాతో తెలుగు తెరకు పరిచయం అయిన కాజల్ ఆ తర్వాత 'చందమామ' సినిమాతో సూపర్ ఫామ్‌లోకి వచ్చింది. ఆ తర్వాత మరికొన్ని సినిమాలు చేసినా తన కెరీర్ కు ఏమాత్రం అవి సహాయపడలేదు. 2009లో రాజమౌళి తెరకెక్కించిన వచ్చిన మగధీర కాజల్ ఫేట్ ను మార్చేసింది. టాలీవుడ్ లో వచ్చిన పేరు మిగిలిన ఇండస్ట్రిలలో అవకాశాలు రావడానికి కాజల్ కి బాగా ఉపయోగపడింది. అలా కోలీవుడ్ లో కూడా ఎన్నో సూపర్ హిట్ సినిమాలను చేసింది. బాలీవుడ్‌లోనూ మంచి ప్రాధాన్యమున్న పాత్రలు చేసింది. 'లైవ్ టెలీకాస్ట్' అనే వెబ్ సిరీస్‌తో ఓటీటీలోకి కూడా అడుగుపెట్టింది.
ఆ తర్వాత తనకు ప్రాధాన్యమున్న పాత్రలు ఎంచుకుంటూ తనతో పాటు వచ్చిన ఎంతోమంది హీరోయిన్లు ఫేడ్ అవుట్ అయిపోయినా పదిహేనేళ్లకు పైగా ఉన్న కెరీర్లో తను మాత్రం ఇంకా హీరోయిన్ గా నటిస్తుంది. అలా అన్ని బాషల్లో 58 పైగా సినిమాలు చేసింది. 2020లో పెళ్లి అయ్యాక కాజల్ కెరీర్ ముగిసిపోయినట్టే అని అనుకున్నారు అందరూ కానీ 2022లో ఒక బిడ్డకు తల్లి అయ్యాక కూడా సినిమాలకు బ్రేక్ ఇవ్వకుండా నటిస్తూనే ఉంది కాజల్. ప్రస్తుతం 'ఇండియన్ 2', 'ఉమ', 'సత్యభామ' సినిమా షూటింగ్స్ లో బిజీగా గడుపుతుంది.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
విలన్లను రప్ఫాడిస్తున్న కాజల్ - మరీ ఇంత వైలెంట్ అయితే ఎలా!