ETV Bharat / entertainment

స్టార్ కపుల్స్ డిన్నర్ డేట్​ - బీటౌన్​లో ఎన్​టీఆర్, ప్రణతి సందడి - Jr NTR Dinner Date - JR NTR DINNER DATE

Jr NTR Dinner Date : మ్యాన్ ఆఫ్ మాసెస్ జూనియర్ ఎన్​టీఆర్ ప్రస్తుతం వార్ షూటింగ్​లో బిజీగా ఉన్నారు. ఈ నేపథ్యంలో తాజాగా ఆయన తన సతీమణి ప్రణతీతో కలిసి ముంబయిలోని ఓ పాపులర్ రెస్టారెంట్​కు డిన్నర్ డేట్​కు వెళ్లారు. వీరితో పాటు ఆలియా,రణ్​బీర్ అలాగే హృతిక్ రోషన్, సబా ఆజాద్ కూడా వచ్చారు. ఆ విశేషాలు మీ కోసం.

Jr NTR Dinner Date
Jr NTR Dinner Date
author img

By ETV Bharat Telugu Team

Published : Apr 29, 2024, 10:35 AM IST

Jr NTR Dinner Date : మ్యాన్ ఆఫ్ మాసెస్ జూనియర్ ఎన్​టీఆర్ తన బాలీవుడ్ డెబ్యూ మూవీ వార్ షూటింగ్​లో బిజీగా ఉన్నారు. ఓ వైపు దేవర సెట్స్​లో సందడి చేస్తూనే మరోవైపు హృతిక్​తో వార్​ చిత్రీకరణలో బిజీగా ఉన్నారు. అయితే తాజాగా ఎన్​టీఆర్ తన సతీమణితో కలిసి డిన్నర్ డేట్​కు వెళ్లారు. ముంబయిలోని ఓ రెస్టారెంట్​కు వెళ్తున్న సమయంలో కెమెరాకు చిక్కారు.

అయితే వారితో పాటు బీటౌన్ కపుల్ ఆలియా భట్​ రణ్​బీర్ కపూర్​ కూడా అక్కడికి వచ్చారు. దీంతో ఆ ప్రాంతమంతా సందడి సందడిగా మారింది. ఈ క్యూట్ కపుల్స్​ను చూసేందుకు ఫ్యాన్స్​ గుమిగూడారు. ఇక ఈ డిన్నర్ డేట్​కు 'వార్​ 2' నటుడు హృతిక్ రోషన్​, ఆయన గర్ల్​ఫ్రెండ్​ సబా ఆజాద్​ కూడా వచ్చారు. ఇక ఫిల్మ్​ మేకర్ కరణ్ జోహార్ కూడా ఈ పార్టీలో సందడి చేశారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన, ఫోటోలు, వీడియోలు నెట్టింట ట్రెండ్ అవుతోంది.

ఇక 'వార్ 2' సినిమా కోసం తారక్ మొత్తం 60 రోజుల కాల్ షీట్స్ కేటాయించిన‌ట్లు సమాచారం. ఇక ఈ సినిమాను వార్ 1ను మించిపోయేలా సూపర్ యాక్షన్ సీక్వెన్స్‌లు ఉంటాయని టాక్.

2025 ఆగష్టు 14న ఈ సినిమాను రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు. ఎన్​టీఆర్​ ఇదే తొలి బాలీవుడ్ ప్రాజెక్ట్. ఈ చిత్రంలో సీక్రెట్ ఏజెంట్‌గా ఎన్టీఆర్ యాక్ట్ చేస్తున్నారు. అయితే తన లుక్‌ను సీక్రెట్‌గా ఉంచేందుకు ఎన్టీఆర్ తెగ కష్టపడుతున్నారు.

మరోవైపు ఎన్టీఆర్- కొరటాల శివ కాంబో దేవర మూవీ షూటింగ్ చివరకి దశకు చేరుకుంది. ఈ సినిమాను డైరెక్టర్ కొరటాల శివ రెండు పార్ట్​లుగా తెరకెక్కిస్తున్నారు. ఇక ఈ సినిమాతో అతిలోక సుందరి దివంగత శ్రీదేవి కుమార్తే జాన్వీ కపూర్ తెలుగు ప్రేక్షకులరు పరిచయం కానుంది. బాలీవుడ్ స్టార్ సైఫ్ అలీ ఖాన్ కీలక పాత్ర పోషిస్తున్నారు.

సీనియర్ నటులు శ్రీకాంత్, ప్రకాశ్​రాజ్, మురళీ శర్మ తదితరులు ఆయా పాత్రల్లో నటిస్తున్నారు. మ్యూజిక్ సంచలనం అనిరుధ్ రవిచంద్రన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమా ఎన్​టీఆర్ ఆర్ట్స్ బ్యానర్​పై రూపొందుతోంది. దసరా కానుకగా 2024 అక్టోబర్ 10న వరల్డ్​వైడ్​గా గ్రాండ్​గా రిలీజ్ కానుంది.

జూనియర్ ఎన్​టీఆర్ ఎనర్జీ సీక్రెట్ - చిన్నప్పుడు అలా చేశారట! - Jr Ntr Energy Secret

ప్రశాంత్ నీల్ షాకింగ్ డెసిషన్- 'సలార్ 2'కు బ్రేక్- ఆ స్టార్ హీరో కోసమేనట! - Salaar Part 2 Postponed

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.