ETV Bharat / entertainment

హాలీవుడ్​లోనూ 'దేవర' ఫీవర్ - కాలిఫోర్నియా ఫిల్మ్​ ఫెస్టివల్​లో అరుదైన ఘనత! - Devara California Film Festival - DEVARA CALIFORNIA FILM FESTIVAL

Devara Movie California Film Festival : జూనియర్ ఎన్​టీఆర్ అప్​కమింగ్ మూవీ 'దేవర' ఇప్పుడు అమెరికా వేదికగా ఓ అరుదైన రికార్డును అందుకోనుంది. ఆ వివరాలు మీ కోసం.

Devara Movie California Film Festival
Devara Movie California Film Festival (Etv Bharat)
author img

By ETV Bharat Telugu Team

Published : Sep 13, 2024, 12:33 PM IST

Devara Movie California Film Festival : జూనియర్ ఎన్​టీఆర్, కొరటాల శివ కాంబినేషన్​లో తెరకెక్కిన యాక్షన్ థ్రిల్లర్ మూవీ 'దేవర' త్వరలో అభిమానుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో ఇప్పటికే ఈ సినిమా గురించి అందరిలోనూ భారీగానే అంచనాలు ఉన్నాయి. ట్రైలర్​, సాంగ్స్​ ఇలా ఈ చిత్రానికి సంబంధించిన పలు పాయింట్స్ ఆకట్టుకోవడం వల్ల ఫ్యాన్స్ కూడా ఈ సినిమా గురించి ఓ రేంజ్​లో వెయిట్ చేస్తున్నారు.

ఇదిలా ఉండగా, రిలీజ్​కు ముందు నుంచే పలు రికార్డులను తన ఖాతాలో వేసుకుంటున్న 'దేవర' తాజాగా మరో ఘనతను సొంతం చేసుకుంది. కాలిఫోర్నియాలోని లాస్‌ ఏంజెలిస్‌ వేదికగా ప్రారంభం కానున్న అతిపెద్ద జానర్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్‌ 'బియాండ్‌ ఫెస్ట్‌'లో ఈ సినిమాను ప్రదర్శించనున్నారు. సెప్టెంబర్‌ 25 నుంచి అక్టోబర్‌ 9 వరకు ఈ ఈవెంట్ జరగనుండగా, సెప్టెంబర్‌ 26 సాయంత్రం ఈజిప్టియన్‌ థియేటర్‌లో అక్కడి ప్రేక్షకులతో పాటు ప్రముఖులు కూడా ఈ చిత్రాన్ని వీక్షించనున్నారు. ఇక ఈ సినిమా ఈవెంట్​ కోసం జూనియర్ ఎన్​టీఆర్​ సెప్టెంబర్‌ 25న అమెరికా వెళ్లనున్నారని సినీవర్గాల మాట.

ఇక ఈ సినిమాకు సెన్సార్‌ బోర్డు యూ/ఏ (U/A) సర్టిఫికెట్‌ జారీ చేసింది. కాగా, సినిమా రన్​టైమ్​ 2 గంటల 57 నిమిషాల 58 సెకన్ల పాటు ఉండనుంది. స్టార్ డైరెక్టర్ కొరటాల శివ 'జనతా గ్యారేజ్' తర్వాత ఎన్టీఆర్​తో తీసిన సినిమా కావడం వల్ల దీనిపై అంచనాలు భారీగా ఉన్నాయి. ఇక మూవీలో విజువల్స్‌ అద్భుతంగా ఉంటాయని, చివరి 40 నిమిషాలు సినిమాలో హైలైట్‌ అని హీరో ఎన్టీఆర్ ముంబయిలో జరిగిన ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌లో ఎన్టీఆర్‌ అంచనాలు రెట్టింపు చేశారు.

Devara Movie USA Pre Sales : ఇటీవలే ఓవర్సీస్‌లో ఈ మూవీ ప్రీసేల్‌ టికెట్‌ బుకింగ్స్​లో వన్‌ మిలియన్‌ సేల్ చేసింది. ఈ క్రమంలో నార్త్‌ అమెరికన్‌ బాక్సాఫీస్‌ వద్ద అత్యంత వేగంగా టికెట్ల ప్రీసేల్‌ ద్వారా వన్‌ మిలియన్‌ మార్క్‌ దాటిన సినిమాగా రికార్డుకెక్కింది. అంతేకాకుండా ట్రైలర్‌ రిలీజ్ కాకముందే ఈ ఘనత సాధించిన తొలి భారతీయ చిత్రంగానూ రికార్డు నెలకొల్పింది.

'దేవర' ట్రైలర్ వచ్చేసిందహో - ఎన్టీఆర్ మాస్ ఊచకోత - గూస్ బంప్సే - Devara Movie Trailer

'దేవర' బిజినెస్ డీటెయిల్స్ ఇవే​ - భారీ స్థాయిలో టికెట్ ప్రీ సేల్స్​! - NTR Devara Movie

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.